Rana Naidu 2 Series OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన 'రానా నాయుడు 2' వెబ్ సిరీస్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Rana Naidu 2 OTT Platform: వెంకటేష్, రానా దగ్గుబాటి లేటెస్ట్ వెబ్ సిరీస్ 'రానా నాయుడు' తాజాగా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. తెలుగు సహా మొత్తం 5 భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Venkatesh Rana's Rana Naidu Series Season 2 OTT Streaming: విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి లేటెస్ట్ అవెయిటెడ్ వెబ్ సిరీస్ 'రానా నాయుడు 2' ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' వేదికగా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
ఈ సిరీస్‌కు కరణ్ అన్షుమాన్, సుపర్ణ శర్మ, అభయ్ చోప్రా దర్శకత్వం వహించగా.. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ మీడియా నిర్మించారు. వెంకటేశ్ రానాలతో పాటు అర్జున్ రాంపాల్, సుర్వీన్ చావ్లా, కృతి కర్బంద, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, డినోమోరియా తదితరులు కీలక పాత్రలు పోషించారు. 2023లో రిలీజ్ అయిన 'రానా నాయుడు' సిరీస్‌కు సీక్వెల్‌గా ఈ సిరీస్ రూపొందింది.
Consider the date fixed. Rana Naidu is back today.
— Netflix India (@NetflixIndia) June 13, 2025
Watch Rana Naidu Season 2, out now, on Netflix. #RanaNaiduOnNetflix pic.twitter.com/SMwld2wngi
సిరీస్‌పై ట్రోలింగ్స్
ఇటీవలే ఈ సిరీస్ టీజర్ రిలీజ్ కాగా ఆకట్టుకుంది. ఫస్ట్ సీజన్‌లో మితి మీరిన అడల్ట్ కంటెంట్, అసభ్యకర డైలాగ్స్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. వెంకటేష్‌ను ఫ్యామిలీ ఆడియన్స్ అలాంటి క్యారెక్టర్‌లో చూసి తీసుకోలేకపోయారు. అయితే.. ఫస్ట్ పార్ట్ యూత్ ఆడియన్స్‌ను ఎక్కువగా వీక్షించగా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సిరీస్‌లోనూ అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందనే ట్రోలింగ్ సాగింది. అయితే, ఫస్ట్ సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్‌లో అడల్ట్ కంటెంట్ అంతగా లేదనే ప్రచారం సాగింది. టీజర్ బట్టి ఆ విషయం అర్థమైంది. ఇటీవలే సిరీస్ ప్రమోషన్లలో భాగంగా రానా ఈ విషయంపై స్పందించారు.
'నన్ను, వెంకటేష్‌ను అలా చూసి ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. ఈ సిరీస్‌లో వెంకటేష్‌లోని మరో కోణాన్ని చూశారు. అది ఆయన నిజ జీవితానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఎలాంటి కథతో వచ్చినా విమర్శలనేవి సహజం. ఈ సిరీస్‌తో మేమిద్దరం స్నేహితులయ్యాం. ఇలాంటి ప్రాజెక్ట్ గతంలో మేమిద్దరం ఎప్పుడూ చేయలేదు. సెట్‌లో నన్ను నేను మెరుగుపరుచుకునేలా ఆయన చేశారు. కొన్ని డైలాగ్స్ చెప్పేటప్పుడు ఇబ్బంది పడ్డాను. నటీనటులుగా ఆయా పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసినప్పుడు ఇలాంటివి తప్పదని అర్థం చేసుకున్నా.' అని రానా చెప్పారు. ఈ సిరీస్ తన కుటుంబ సభ్యులందరూ వీక్షించారని అన్నారు.
టీం రియాక్షన్
మరోవైపు.. మేకర్స్ కూడా రెండో సీజన్ గురించి తాజాగా స్పందించారు. స్టోరీకి అవసరమైన అంశాలన్నీ అందులోనే ఉన్నాయని.. కొత్త సిరీస్‌లో ఎమోషన్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు చెప్పారు. యాక్షన్, థ్రిల్లింగ్ అన్నీ మేళవించి ఈ సిరీస్ ఉంటుందన్నారు. దీన్ని బట్టి గత సీజన్ అంత బోల్డ్‌గా కాకుండా నార్మల్‌గా సిరీస్ ఉండనున్నట్లు అర్థమవుతోంది.





















