Gummadi Narsaiah Biopic: సిల్వర్ స్క్రీన్‌పై 'గుమ్మడి నర్సయ్య' లైఫ్ స్టోరీ - లీడ్ రోల్ ఎవరో తెలుసా?... ఫస్ట్ తెలుగు డెబ్యూమూవీతోనే...
Shivaraj Kumar: ప్రజల నాయకుడు గుమ్మడి నర్సయ్య లైఫ్ స్టోరీ మూవీగా రానుంది. ఆయన బయోపిక్‌ను సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించేందుకు ప్లాన్ చేస్తుండగా... తాజాగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

Shiva Rajkumar Set To Play Lead Role In Gummadi Narsaiah Biopic: గుమ్మడి నర్సయ్య... ఈ పేరు వింటేనే మనకు ప్రజల మనిషి గుర్తొస్తారు. రైతులు, గిరిజన ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు పాలిటిక్స్‌లోకి అడుగు పెట్టిన ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. వరుసగా ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే పదవి చేపట్టి తెలుగు రాష్ట్రాల్లోనే మంచి నాయకుడిగా పేరొందారు. ఆయన జీవిత కథను సిల్వర్ స్క్రీన్‌పై చూపించనున్నారు.
లీడ్ రోల్ ఎవరంటే?
గుమ్మడి నర్సయ్య రోల్‌ను కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ పోషించనున్నారు. ఈ మేరకు రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. అసెంబ్లీ ముందు సైకిల్, దానిపై జెండా, కళ్లజోడు, ఎర్ర కండువా ఇలా ఎంతో అథెంటిక్‌గా ఆయన లుక్ అదిరిపోయింది. అందరు ఎమ్మెల్యేలు కార్లలో వస్తుంటే ఈయన మాత్రం సైకిల్‌పై రావడం... బీజీఎం వేరే లెవల్‌లో ఉన్నాయి. గుమ్మడి నర్సయ్య పాత్రకు ఆయన ప్రాణం పోస్తారనేది మాత్రం కన్ఫర్మ్ అని మోషన్ పోస్టర్‌ను బట్టే అర్థమవుతోంది. శివరాజ్ కుమార్‌కు ఇదే ఫస్ట్ డైరెక్ట్ తెలుగు సినిమా.
ఈ మూవీకి పరమేశ్వర్ హివ్రాలే దర్శకత్వం వహిస్తుండగా... ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎన్.సురేష్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బడ్జెట్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. ఈ మూవీకి కెమెరామెన్‌గా సతీష్ ముత్యాల, మ్యూజిక్ డైరెక్టర్‌గాా సురేష్ బొబ్బిలి, ఎడిటర్‌గా సత్య గిడుటూరి పని చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి ఇతర వివరాలు వెల్లడి కానున్నాయి.
Also Read: కుమార్తె ఫేస్ రివీల్ చేసిన దీపికా పదుకోన్ - ఎంత క్యూట్‌గా ఉందో తెలుసా?





















