News
News
X

Kangana Ranaut: నవాజుద్దీన్ సిద్ధిఖీ ఫ్యామిలీ గొడవల్లో తలదూర్చిన కంగనా - మౌనం మంచిది కాదంటూ..

గత కొన్ని రోజులుగా భార్య ఆలియా చేస్తున్న ఆరోపణలకు స్పందించిన నవాజుద్దీన్ సిద్ధిఖీ, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఈ సందర్భంగా నవాజుద్దీన్ సిద్ధిఖీకి మద్దతుగా సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేసింది.

FOLLOW US: 
Share:

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ ఫైర్ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ సోషల్‌ మీడియాలో ఏ చిన్న పోస్ట్‌ చేసినా కూడా వైరల్ అవుతుంది. ప్రతి విషయంలో కూడా ఆమె.. మన రాం గోపాల్ వర్మతో పోటీ పడుతుందా అన్నట్లుగా ఉంటాయి ఆమె పోస్టులు. తనకు అవసరం ఉన్నా లేకున్నా కూడా ప్రతి విషయంలో కూడా స్పందిస్తూ ఉండే కంగనా రనౌత్‌ తీరును చాలా మంది విమర్శిస్తూ ఉంటారు. ఆమె తనపై వచ్చే విమర్శలను అసలు పట్టించుకోదు. తన అభిప్రాయంను చెప్పేందుకు కంగనా ఎప్పుడూ ముందు ఉంటుంది. అందుకే, కంగనా రనౌత్ ను ఫైర్ బ్రాండ్‌ అంటారు. తాజాగా మరోసారి కంగనా రనౌత్‌ చేసిన సోషల్ మీడియా పోస్ట్‌ వివాదాస్పదమైంది.  

నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆయన భార్య ఆలియా మధ్య గత కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఇప్పటికే నవాజుద్దీన్ సిద్ధిఖీపై అత్యాచారం కేసు పెట్టడంతో పాటు గృహ హింస కేసు నమోదు చేశారు. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ కుటుంబ సభ్యులపై కూడా ఆలియా పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెట్టింది. గత కొన్ని రోజులుగా ఆలియా పదే పదే ఆరోపణలు చేసినా కూడా నవాజుద్దీన్‌ సిద్ధిఖీ మాత్రం మౌనంగా ఉంటూ వచ్చాడు. నవాజుద్దీన్‌ యొక్క మౌనంను చాలా మంది తప్పుబడుతూ ఉన్నారు. మౌనంగా ఉంటే ఆలియా యొక్క అన్ని ఆరోపణలను అంగీకరించినట్లు అవుతుంది అంటూ ఆయన్ను పలువురు హెచ్చరించారు. అయినా కూడా ఇన్నాళ్లు మౌనంగానే ఉన్న నవాజుద్దీన్ ఎట్టకేలకు స్పందించాడు. తనపై ఆలియా చేస్తున్న ప్రతి ఆరోపణకు సమాధానం ఇచ్చారు. 

మౌనం ఎప్పుడు శాంతిని ఇవ్వదు

నవాజుద్దీన్ ప్రకటనపై హీరోయిన్ కంగనా రనౌత్‌ స్పందించింది.. ఆలియాకు వ్యతిరేకంగా నవాజుద్దీన్‌ షేర్‌ చేసిన పోస్ట్‌ను షేర్‌ చేసిన కంగనా రనౌత్‌.. మౌనం ఎప్పుడూ శాంతిని ఇవ్వదు. ఈ సమయంలో మీరు ఇలా చేయడం చాలా అవసరం అని నేను భావిస్తున్నాను. మీరు ఇలాంటి ప్రకటన చేసినందుకు గాను నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటూ నవాజుద్దీన్‌ కు మద్దతుగా కామెంట్‌ పెట్టింది. ఇప్పటికే విడాకులు తీసుకున్న నవాజుద్దీన్‌, ఆలియా మధ్య గొడవ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సమయంలో ఆలియా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంను కొందరు తప్పుబడుతూ ఉంటే మరి కొందరు మాత్రం ఆమె తీరును సమర్ధిస్తున్నారు. 

నవాజుద్దీన్‌ ప్రకటన

‘‘నేను ఇన్నాళ్లు మౌనంగా ఉన్నందుకు అంతా నన్ను చెడ్డవాడినని అంటున్నారు. అందుకే నేను నా మౌనాన్ని బ్రేక్ చేయాలని అనుకుంటున్నాను. ఈ తమాషా మొత్తంను నా చిన్న పిల్లలు ఎక్కడి నుంచో చూస్తూనే ఉంటారు. సోషల్‌ మీడియా, ఇతర మీడియాల్లో కొందరు నాకు వ్యతిరేకంగా కథనాలు రాస్తున్నారు. కొన్ని విషయాలను నేను ప్రత్యేకంగా అందరికి తెలియజేయాలని అనుకుంటున్నాను. ఆలియా నేను కలిసి ఉండే పరిస్థితి లేక విడాకులు తీసుకున్నాం. ఈ విషయం గురించి మా పిల్లలకు అవగాహన ఉంది. ప్రస్తుతం మా పిల్లలు దుబాయిలో స్కూల్‌ లో కాకుండా ఇండియాలో ఎందుకు ఉన్నారో ఆమె చెప్పాలి. 45 రోజులుగా వారు పాఠాశాలను మిస్‌ అవుతున్నారు. దుబాయ్ స్కూల్ నుంచి ప్రతి రోజు నాకు లేఖలు వస్తున్నాయి. పిల్లలు స్కూల్‌కు ఎందుకు హాజరు కావడంలేదని ప్రశ్నిస్తున్నారు. 45 రోజులుగా ఇండియాలో నా పిల్లలు బంధీలుగా ఉన్నారు. ఇప్పటికే నేను ఆమెకు నెలకు సుమారు రూ.10 లక్షలు చెల్లిస్తున్నా. అయినా కూడా ఆమె ఇంకా డబ్బులు కావాలని అంటోంది. డబ్బుల కోసమే నన్ను, నా తల్లిని వేధిస్తోంది’’ అని నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రకటనలో పేర్కొన్నారు.  

Also Read : 'కెజియఫ్' మీద కామెంట్స్‌పై వెనక్కి తగ్గని వెంకటేష్ మహా - మంట మీద పెట్రోల్ పోశారా?

Published at : 07 Mar 2023 05:41 PM (IST) Tags: Kangana Ranaut Nawazuddin Siddiqui Bollywood Kangana about Nawazuddin

సంబంధిత కథనాలు

RC15 Welcome: రామ్ చరణ్‌కు RC15 టీమ్ సర్‌ప్రైజ్ - ‘నాటు నాటు’తో ప్రభుదేవ బృందం ఘన స్వాగతం

RC15 Welcome: రామ్ చరణ్‌కు RC15 టీమ్ సర్‌ప్రైజ్ - ‘నాటు నాటు’తో ప్రభుదేవ బృందం ఘన స్వాగతం

Tollywood: మాస్ మంత్రం జపిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలు - వర్కవుట్ అవుతుందా?

Tollywood: మాస్ మంత్రం జపిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలు - వర్కవుట్ అవుతుందా?

Aishwarya's Gold Missing Case: దొంగలు దొరికారట - రజినీకాంత్ కుమార్తె ఇంట్లో చోరీపై కీలకమైన క్లూ!

Aishwarya's Gold Missing Case: దొంగలు దొరికారట - రజినీకాంత్ కుమార్తె ఇంట్లో చోరీపై కీలకమైన క్లూ!

Tesla Cars - Naatu Naatu: టెస్లా కార్ల ‘నాటు నాటు‘ లైటింగ్ షోపై స్పందించిన మస్క్ మామ - RRR టీమ్ ఫుల్ ఖుష్!

Tesla Cars - Naatu Naatu: టెస్లా కార్ల ‘నాటు నాటు‘ లైటింగ్ షోపై స్పందించిన మస్క్ మామ - RRR టీమ్ ఫుల్ ఖుష్!

Ameer Sultan on Rajinikanth: రజినీకాంత్‌కు అసలు ఆ అర్హత ఉందా? తమిళ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు

Ameer Sultan on Rajinikanth: రజినీకాంత్‌కు అసలు ఆ అర్హత ఉందా? తమిళ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా