Chandramukhi 2: నువ్వు ఎంచుకున్న నాట్యం ఏమిటీ? నువ్వు చేస్తున్నదేమిటీ- కంగనా ‘చంద్రముఖి’ డ్యాన్స్‌పై ట్రోల్స్!
హీరోయిన్ కంగనా రనౌత్ 'చంద్రముఖి 2' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సినిమా నుంచి 'స్వాగతాంజలి' అనే సాంగ్ విడుదలవగా.. ఈ సాంగ్లో కంగనా డ్యాన్స్ ని నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కి వివాదాలు, ట్రోల్స్ కొత్తేమీ కాదు. ఇప్పటికే సోషల్ మీడియాలో కంగనా రకరకాల ట్రోల్లింగ్స్ కి గురైంది. అలాగే కొన్ని సంఘటనలో ఆమె చేసే వ్యాఖ్యలు పలు వివాదాలకు దారితీశాయి. ఇక సినిమాల పరంగాను ఆమెను చాలా మంది ట్రోల్ చేశారు. ఇక ఇప్పుడు మరోసారి కంగనా సోషల్ మీడియాలో నెటిజెన్స్ నుంచి ట్రోలింగ్ బారిన పడింది. పూర్తి వివరాల్ల్లోకి వెళితే.. కంగనా రనౌత్ 'చంద్రముఖి 2' అనే తమిళ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. 'స్వాగతంజలి' అంటూ సాగే ఈ పాటని కంగనా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఎం ఎం కీరవాణి స్వరపరిచిన ఈ పాటలో కంగనా భరతనాట్యం చేసింది. అయితే ఈ పాటలో కంగనా చేసిన భరతనాట్యం డాన్స్ పై సోషల్ మీడియా వేదికగా తెగ ట్రోలింగ్ జరుగుతోంది. ఆగస్టు 12న ఈ 'స్వాగతాంజలి' అనే సాంగ్ ని విడుదల చేయగా.. ఈ పాటలో కీరవాణి సంగీతాన్ని పలువురు ప్రశంసించారు. కానీ అదే పాటలో కంగనా భరతనాట్య ప్రదర్శనను చాలామంది నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. పాటలో ఆమె డాన్స్ ఏమాత్రం ఆకట్టుకునే విధంగా లేదని చెబుతున్నారు.
ఈమేరకు కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ.. "కంగనా మంచి యాక్టర్ కావచ్చు. కానీ మంచి డాన్సర్ కాలేదు" అని కొందరు, "కంగనా కంటే చంద్రముఖిలో జ్యోతిక అద్భుతంగా భరతనాట్యం చేసింది. ఆమె క్లాసికల్ డాన్సర్ కాకపోయినా అద్భుతంగా ఆ పాటలో డాన్స్ చేసింది" అని మరికొందరు కామెంట్లు చేశారు. "చంద్రముఖి 2లో కంగనాకి బదులు అనుష్కను తీసుకుంటే బాగుండేది. చంద్రముఖి పాత్రకి కంగనా అస్సలు సూట్ అవ్వలేదు" అంటూ రకరకాల కామెంట్స్ తో ఆమెను తెగ ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు కంగనా అభిమానులు కొంతమంది ఈ విషయంలో ఆమెను సపోర్ట్ చేస్తూ.. "ఆమె చాలా అందంగా కనిపిస్తోందని.. అంతేకాకుండా సినిమాలో ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తుందంటూ" సమర్థించారు.
మొత్తం మీద మరోసారి 'చంద్రముఖి 2' లోని లిరికల్ సాంగ్ ద్వారా కంగనా రనౌత్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ‘చంద్రముఖి 2’ విషయానికొస్తే.. పి వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, ప్రభు, వడివేలు ప్రధాన పాత్రల్లో వచ్చిన 'చంద్రముఖి' అనే సినిమాకి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక ఈ సీక్వెల్లో రాఘవ లారెన్స్, కంగనా రనౌత్, వడివేలు లీడ్ రోల్స్ చేస్తున్నారు. లక్ష్మీ మీనన్, రాదికా శరత్‌కుమార్, మహిమా నంబియార్, రావు రమేష్, విఘ్నేష్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారర్ అండ్ కామెడీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకి ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే సినిమా నుంచి టీజర్ కూడా విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 19న ఈ సినిమాని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Also Read : ధనుష్ - శేఖర్ కమ్ముల సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన!