By: ABP Desam | Updated at : 23 Mar 2023 04:33 PM (IST)
Edited By: Mani kumar
Image Credit:Kangana Ranaut/Instagram
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పపక్కర్లేదు. తన వ్యాఖ్యలతో ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తూ ఉంటుంది కంగనా. అయితే ఒక్కోసారి వివాదాలే ఆమెను వెతుక్కుంటూ వస్తాయా అన్నట్టుగా ఆమె అప్పుడప్పుడూ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటుంది. తాజాగా అలాంటి పరిస్థితి ఒకటి కంగనాకు ఎదురైంది. అది అటు ఇటు తిరిగి ఇండస్ట్రీలో చర్చనీయాంశమవడంతో దానిపై కంగనా క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. కంగనా రనౌత్ 2021 లో ‘తలైవి’ సినిమాలో నటించింది. ఈ సినిమా నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడీ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను జీ స్టూడియోస్ తీసుకుంది. కానీ దారుణంగా నష్టాలు రావడంతో తాము ఖర్చు చేసిన 6 కోట్ల రూపాయలను తిరిగి ఇవ్వాలంటూ నిర్వాహకులు ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IMPPA)ను సంప్రదించారనే వార్త ఒకటి బయటకు వచ్చింది.
కంగనా రనౌత్ నటించిన ‘తలైవి’ మూవీ అప్పట్లో పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమాను తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఇందులో తలైవి పాత్రలో కంగనా రనౌత్ నటించింది. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా జీ స్టూడియోస్ సంస్థ విడుదల చేసింది. ఈ మూవీ విడుదల అయినప్పటి నుంచీ వివాదాల్లోనే ఉంటూ వస్తోంది. రిలీజ్ తర్వాత నిబంధనలకు విరుద్దంగా మూవీను రెండు వారాల్లోనే ఓటీటీలలో వదిలేశారు. దీంతో కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. దీంతో ఈ సినిమాను నిషేదించాలంటూ మల్టీఫ్లెక్స్ లు పిలుపునిచ్చాయి. తర్వాత కలెక్షన్లు ఊహించని విధంగా పడిపోయాయి. దీంతో సినిమాను డిస్టిబ్యూట్ చేసిన సంస్థ జీస్టూడియోస్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించి కలెక్షన్ లపై ప్రభావం చూపేలా చేశారంటూ జీస్టూడియోస్ ఆరోపించినట్లు సమాచారం. డిస్టిబ్యూషన్ కోసం తాము ఖర్చు చేసిన 6 కోట్ల రూపాయలను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసిందని, విబ్రి మోషన్ పిక్చర్స్ కు ఈమేరకు లేఖ కూడా రాసిందని బాలీవుడ్ వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. అయితే దీనిపై విబ్రి మోషన్ పిక్చర్స్ స్పందించకపోవడంతో IMPPAను జీ స్టూడియోస్ ఆశ్రయించినట్లు తెలిసింది. అంతేకాకుండా తమకు రావాల్సిన అడ్వాన్స్ మొత్తాన్ని చెల్లించాలంటూ జీ స్టూడియోస్ కోర్టును కూడా ఆశ్రయించేందుకు సిద్దమవుతోందని టాక్. ఇదీ ఆ వార్తల్లోని సారాంశం. అయితే ఈ వార్తలపై నటి కంగనా రనౌత్ స్పందించింది. ఆ వార్తలలో నిజం లేదని స్పష్టం చేసింది. జీ స్టూడియోస్ డిస్టిబ్యూషన్ విషయంలో ఎవరినీ కలవలేదని చెప్పింది. అయినా ఆ సినిమా విడుదల అయి దాదాపు రెండేళ్లు అవుతోందని చెప్పింది. ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయి అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇవి పుకార్లు మాత్రమే అలాంటి వార్తలను నమ్మొద్దు అంటూ చెప్పుకొచ్చింది కంగనా. ఇక కంగనా ప్రస్తుతం ‘ఎమెర్జెన్సీ’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ సినిమాతో పాటు పలు భారీ ప్రాజెక్టులలో కంగనా భాగం కానుంది.
Read Also: ఇండస్ట్రీలో నానికి పోటీనిచ్చే హీరో లేడట! ‘దసరా’ బాగా తీయలేదంటూ నేచురల్ స్టార్ వ్యాఖ్యలు
Swara Bhaskar Pregnancy : తల్లి కాబోతున్న బాలీవుడ్ నటి - పెళ్ళైన మూడు నెలలకే గుడ్ న్యూస్
నితిన్, రష్మికల 'VNRTrio' మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభం
Lust Stories 2 Teaser : పెళ్ళికి ముందు టెస్ట్ డ్రైవ్ చేయరా? హాట్ హాట్‌గా తమన్నా, మృణాల్ వెబ్ సిరీస్ టీజర్!
Mukesh Khanna: భారీ బడ్జెట్‌తో ‘శక్తిమాన్’ నిర్మాణం - ‘స్పైడర్ మ్యాన్’ నిర్మాణ సంస్థ చేతికి ఇండియన్ మూవీ: ముఖేష్ ఖాన్నా
Boyapati RAPO Movie : శ్రీ లీలతో కలిసి మైసూర్ వెళ్ళిన రామ్ పోతినేని - అసలు మ్యాటర్ ఏంటంటే?
కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- ఈ నెలలోనే జాయినింగ్స్!
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో స్మార్ట్ కాపీయింగ్- స్నేహితుల కోసం చీట్ చేసి చిక్కిన టాపర్
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు షురూ- యాక్సిడెంట్ స్పాట్‌ను పరిశీలించిన ఎంక్వయిరీ టీం
WTC Final 2023: మాకా.. నాకౌట్ ప్రెజరా! ఐసీసీ ట్రోఫీపై ద్రవిడ్ రెస్పాన్స్ ఇదీ!