Bharatiyudu 2: 'భారతీయుడు 2' అవుట్ ఫుట్ పై కమల్ ధీమా - దర్శకుడు శంకర్‌కు కాస్ట్లీ గిఫ్ట్, ధర ఎంతో తెలుసా?
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న చిత్రం 'ఇండియన్ 2'. తాజాగా ఈ సినిమా రషెష్ చూసిన కమల్, దర్శకుడు శంకర్ ని అభినందిస్తూ కాస్ట్లీ గిఫ్ట్ కూడా ఇచ్చారు.
తమిళ సీనియర్ హీరో, విశ్వ నటుడు కమలహాసన్ ప్రస్తుతం ‘భారతీయుడు 2’ (తమిళంలో ‘ఇండియన్-2) సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే సంచలన దర్శకుడు శంకర్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సుమారు 25ఏళ్ల కింద వచ్చిన 'ఇండియన్'(భారతీయుడు) సినిమాకి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఇక అప్పట్లో వచ్చిన 'భారతీయుడు' మూవీ దేశవ్యాప్తంగా ఓ సంచలనాన్ని క్రియేట్ చేసింది. లంచగొండితనం, అవినీతిపై వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది. ఇక దానికి సీక్వెల్ గా వస్తున్న ఈ ‘భారతీయుడు 2’ పై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ప్రారంభం నుంచి ఈ సినిమా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని మధ్యలో షూటింగ్ కూడా ఆగిపోయింది. చివరగా సినిమా క్యాన్సిల్ అనే స్టేజ్ కూడా వెళ్ళి ఆ తర్వాత మళ్లీ షూటింగ్ పునఃప్రారంభించుకుంది. గత కొన్ని రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ దాదాపు చివరి దశకు చేరుకుంది.
దర్శకుడు శంకర్ ప్రస్తుతం ఓవైపు రాంచరణ్ తో 'గేమ్ చేంజర్' సినిమాని తెరకెక్కిస్తూనే మరోపక్క కమలహాసన్తో ‘భారతీయుడు 2’ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించి కమలహాసన్ ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. తాజాగా ఈ సినిమాలో కొన్ని సీన్స్ ని చూశారు కమల్. ఈ సీన్స్ లో శంకర్ మేకింగ్ అద్భుతంగా ఉందని చెప్పినా కమల్, దీన్ని చూసి గర్వపడి ఇక్కడే ఆగకుండా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటూ శంకర్ కి సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు శంకర్ ని అభినందిస్తూ ఈ సినిమాతో తన కెరియర్ పీక్స్ కి వెళ్తుందని పరోక్షంగా చెప్పారు. అంతేకాకుండా దర్శకుడు శంకర్ పనితనాన్ని మెచ్చి ఆయనకి కి అదిరిపోయే కాస్ట్లీ గిఫ్ట్ కూడా ఇచ్చారు. తాజాగా శంకర్ కి అత్యంత ఖరీదైన 'పనేరై లుమినార్'(Panerai Luminor) బ్రాండ్ వాచ్ ను బహుమతిగా అందించారు కమల్ హాసన్. ఇందుకు సంబంధించిన ఫోటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఇక ఈ వాచ్ ధర సుమారు రూ.8 లక్షలు ఉంటుందని తెలుస్తోంది.
కాగా కమలహాసన్ ట్విట్టర్ ద్వారా శంకర్ ను అభినందిస్తూ.. "ఇండియన్ 2 కి సంబంధించిన మెయిన్ సీన్స్ చూశాను. దర్శకుడు శంకర్ కి నా అభినందనలు. నా సలహా ఏంటంటే, ఇది మీ శిఖరం కాకూడదని. ఎందుకంటే ఇది మీ కళాత్మక జీవితంలో అత్యున్నత దశ. దీని పైకి తీసుకెళ్లి గర్వపడకండి. ఎన్నో కొత్త ఎత్తుల అన్వేషణలో ఉండండి" అని పేర్కొన్నారు. కమల్ ట్వీట్స్ ని బట్టి పరోక్షంగా ఈ సినిమా శంకర్ కెరియర్ లోనే నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే మూవీ అవుతుందని హింట్ ఇచ్చారు. కాగా లైకా ప్రొడక్షన్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ టాలెంట్ యాక్టర్ ఎస్,జే సూర్య, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, సిద్ధార్థ, సముద్ర ఖని, బాబి సింహ, మనోబాల, వెన్నెల కిషోర్, కాళిదాస్ జయరాం తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇటీవల సౌత్ ఆఫ్రికాలో ఈ సినిమాకు సంబంధించి ఓ షెడ్యూల్ ని పూర్తి చేయగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్, అనిరుద్ రవిచంద్రన్ సంయుక్తంగా స్వరాలు సమకూరుస్తున్నారు.
‘இந்தியன் 2’ படத்தின் பிரதான காட்சிகளை இன்று பார்த்தேன். என் உளமார்ந்த வாழ்த்துகள் @shankarshanmugh
— Kamal Haasan (@ikamalhaasan) June 28, 2023
இதுவே உங்கள் உச்சமாக இருக்கக் கூடாது என்பதும் என் அவா. காரணம், இதுதான் உங்கள் கலை வாழ்வின் மிக உயரமான நிலை. இதையே உச்சமாகக் கொள்ளாமல் திமிறி எழுங்கள். பல புதிய உயரங்கள் தேடி.… pic.twitter.com/Mo6vDq7s8B
Also Read: రాజు వచ్చేశాడు, 'కేజీఎఫ్' రేంజ్లో 'కింగ్ ఆఫ్ కోథా' టీజర్ - దుల్కర్ సల్మాన్ నట విశ్వరూపం!