అన్వేషించండి

King Of Kotha Teaser: రాజు వచ్చేశాడు, 'కేజీఎఫ్' రేంజ్‌లో 'కింగ్ ఆఫ్ కోథా' టీజర్ - దుల్కర్ సల్మాన్ నట విశ్వరూపం!

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కింగ్ ఆఫ్ కోథా'. తాజాగా ఈ చిత్ర తెలుగు టీజర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు.

లయాళ అగ్ర హీరో దుల్కర్ సల్మాన్ కి సౌత్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా మలయాళం తర్వాత ఈ హీరోకి తెలుగులో భారీ పాపులారిటీ ఉంది. గత ఏడాది విడుదలైన 'సీతారామం' సినిమాలో తన అద్భుతమైన నటనతో  తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు ఈ యంగ్ హీరో. బాక్సాఫీస్ వద్ద 'సీతారామం' ఎంతటి అద్భుత విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ తో ఇప్పుడు తెలుగులో స్ట్రైట్ మూవీస్ చేస్తున్నాడు దుల్కర్ సల్మాన్. 'సీతారామం' లో తన క్లాస్ నటనతో ఆకట్టుకున్న ఈ హీరో ఇప్పుడు మాస్ మూవీతో ఆడియన్స్ ని పలకరించబోతున్నాడు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'కింగ్ ఆఫ్ కోథా'. జి స్టూడియోస్ సంస్థతో కలిసి దుల్కర్ సల్మాన్ తన ప్రొడక్షన్ హౌస్ వెపేరియర్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన రాబట్టాయి. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

తెలుగులో ఈ మూవీ టీజర్ ని టాలీవుడ్ అగ్ర హీరో మహేష్ బాబు రిలీజ్ చేస్తూ చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ చెప్పారు. ఇక తాజాగా విడుదలైన ఈ టీజర్ ఆద్యంతం గూస్ బంప్స్ తెప్పిస్తోంది. టీజర్ లో దుల్కర్ సల్మాన్ మాఫియా కింగ్ ఆఫ్ కోథా కు నాయకుడిగా కనిపించాడు. ఇక టీజర్ ని పరిశీలిస్తే.. "రాజు గారి రాకకోసం ప్రజలు వేచి ఉన్నారు. వారి ప్రజలను చంపి తిన్న ఆ రాక్షసుడు నుంచి ఈ దేశాన్ని రక్షించడం రాజు గారి వల్లే వీలు అవుతుందని వాళ్లు నమ్మారు. ఆఖరికి ఆ రోజు వచ్చేసింది. రాజుగారు తిరిగి వచ్చేశారు" అని ఐశ్వర్య లక్ష్మి చెప్పే డైలాగ్ తో ఈ టీజర్ స్టార్ట్ అవుతుంది. కోథా అనే గ్రామంలో విలన్ చేతిలో బానిసలుగా పడి ఉన్న ప్రజల్ని కాపాడ్డానికి రాజుగా కింగ్ ఆఫ్ కోథాగా దుల్కర్ సల్మాన్ అడుగుపెడతాడు. ఇక టీజర్ మొత్తం యాక్షన్ సీన్స్ తోనే నింపేశారు. "ఇది గాంధీ గ్రామం కాదు.. కోథారా, ఇక్కడ నేను అన్నప్పుడే పగలు, నేను అన్నప్పుడే రాత్రి" అని టీజర్ లో దుల్కర్ చెప్పే డైలాగ్ అయితే హైలెట్ గా నిలిచింది.

టీజర్ లో దుల్కర్ ని చూస్తుంటే మాఫియా లీడర్ గా తన నట విశ్వరూపాన్ని చూపించాడని స్పష్టమవుతోంది. ముఖ్యంగా టీజర్ లో దుల్కర్ ఫేస్ ను రివిల్ చేసే షాట్స్ అయితే అదిరిపోయాయి. అంతేకాదు టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలెట్ గా నిలిచింది. ఇక టీజర్ చివర్లో రక్తంతో తడిసిన ముఖం చేతిలో కత్తితో దుల్కర్ సల్మాన్ విలన్స్ ను వేటాడుతున్న సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. మొత్తానికి టీజర్ తోనే సినిమాపై విపరీతమైన హైప్ పెంచేశారు మేకర్స్. తాజాగా విడుదలైన ఈ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తోంది. జేక్స్ బీజాయ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 1980 - 90 ల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో మలయాళం తో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఆగస్టు నెలలో ఈ సినిమాని విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మొత్తంగా 'కింగ్ ఆఫ్ కోట్థా' టీజర్ చూస్తుంటే 'కే జి ఎఫ్' వైబ్స్ గుర్తుకొస్తున్నాయి. మరి ఆ రేంజ్ లో ఈ మూవీ దుల్కర్ సల్మాన్ కి పాన్ ఇండియా సక్సెస్ ని అందిస్తుందేమో చూడాలి.

టాప్ హెడ్ లైన్స్

The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Ravi Teja Speech : రవితేజపై నెటిజన్స్ ఫైర్ - ఇరుముడి ఈవెంట్‌లో ముదురు ము*** కామెంట్‌ కాంట్రవర్సీ... చిన్నారిని అలా అనేశారేంటి?
రవితేజపై నెటిజన్స్ ఫైర్ - ఇరుముడి ఈవెంట్‌లో ముదురు ము*** కామెంట్‌ కాంట్రవర్సీ... చిన్నారిని అలా అనేశారేంటి?
Irumudi Mallepoola Pallaki Song : మణికంఠుడెక్కినాడు అందాల పల్లకీ - ఇరుముడి అయ్యప్ప పాట లిరిక్స్
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకీ - ఇరుముడి అయ్యప్ప పాట లిరిక్స్
Jabardasth Pavithra : జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?
జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget