Image Credit: Kamal Haasan/Vijay/Instagram
Leo Movie: తమిళ స్టార్ నటుడు విజయ్ కు అక్కడ ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జూన్ 22న దళపతి విజయ్ పుట్టిన రోజు వేడుకలు జరగనున్నాయి. అయితే ఈసారి విజయ్ పుట్టిన రోజు వేడుకలను భారీ ఎత్తున జరపాలని చూస్తున్నారట. అలాగే ఈ బర్త్ వేడుకల సందర్భంగానే ‘విజయ్ 68’ కు సంబంధించిన ఫస్ట్ లుక్, పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. దీంతో విజయ్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
విజయ్ ప్రస్తుతం దర్శకుడు లోకేష్ గనగరాజ్ తో ‘లియో’ సినిమా చేస్తున్నారు. గతంలో విజయ్ తో లోకేష్ ‘మాస్టర్’ సినిమాను తీశారు. ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది. ఇప్పుడు మళ్లీ ఈ ఇద్దరి కాంబోలో ‘లియో’ సినిమా రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈసారి విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ‘లియో’ నుంచి గ్లింప్స్ వీడియోను చేసి విజయ్ కు బర్త్ డే గిప్ట్ గా ఇవ్వాలని చూస్తోందట చిత్ర బృందం. ఇప్పటికే లోకేష్, అనిరుధ్ చెన్నై లోని ఓ మేజర్ స్టూడియోలో ఈ వీడియోను షూటింగ్ చేసినట్టు తెలుస్తోంది. మరో విషయం ఏమిటంటే.. ఈ గ్లింప్స్ వీడియోకు స్టార్ నటుడు కమల్ హాసన్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్టు సమాచారం.
లోకేష్ కనగరాజ్ ‘విక్రమ్’ సినిమాతో కొత్త యూనివర్స్ ను క్రియేట్ చేశారు. ‘ఖైది’, ‘విక్రమ్’ సినిమాలు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు విజయ్ తో తెరకెక్కిస్తున్న ‘లియో’ కూడా ఈ యూనివర్స్ లో భాగమేనని అనికుంటున్నారు. ఎందుకంటే ‘ఖైది’, ‘విక్రమ్’ సినిమాలలో నటించిన నటులతోనే మిగిలిన సినిమాలు కూడా చేస్తామని గతంలో చెప్పారు లోకేష్. ఇప్పటికే ‘ఖైదీ’ సినిమాలో నటించిన నటులు ‘విక్రమ్’ లో కూడా అదే పాత్రలలో కనిపించారు. ఇప్పుడు విజయ్ బర్త్ డే కు ‘లియో’ నుంచి రిలీజ్ చేసే గ్లింప్స్ వీడియోలో కమల్ హాసన్ వాయిస్ అందిస్తున్నారని తెలిసింది. దీంతో మూవీలో కమల్ హాసన్ నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి.
అయితే కమల్ హాసన్ ‘లియో’లో ఏ సందర్భంలో కనిపిస్తాడనేది తెలియాలి. ఇంకా దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక ఈ మూవీలో విజయ్ సరసన త్రిష నటించనుంది. మధ్యలో త్రిష ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని వార్తలు వచ్చినా అవి వాస్తవం కాదని ప్రకటించింది చిత్ర బృందం. దాదాపు 15 ఏళ్ల తర్వాత విజయ్ తో కలసి నటిస్తోంది త్రిష. మరి ఈ మూవీతో లోకేష్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి. ఈ గ్యాంగ్ స్టర్ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. సంజయ్ దత్, అర్జున్, మిస్కిన్, GVM, శాండీ, జోజు జార్జ్ మరియు ప్రియా ఆనంద్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను ఎస్.ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామి నిర్మిస్తున్నారు. ఈ మూవీకు సంబంధించి మరిన్ని విషయాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.
Also Read: అందుకే సీరియల్స్ మానేశా, రవి నా కంటే ముందే ప్రయత్నించాడు: నటి నవ్య స్వామి
Pawan Kalyan: జనసేనకు విరాళం, పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో స్టంట్ మ్యాన్ సాయం
Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!
WhatsApp Channels: వాట్సాప్ చానెల్స్లో మన దేవరకొండే టాప్ - మెటా యజమానికే షాకిచ్చిన కత్రినా కైఫ్!
Vidhi Movie: కంటి చూపులేనివాళ్లు సైతం థియేటర్కు వచ్చి ఎంజాయ్ చేసే సినిమా: ‘విధి’ హీరో రోహిత్ నందా
అప్పట్లో చిరంజీవి, కమల్ హాసన్, శ్రీదేవిల రెమ్యునరేషన్ ఇంతేనా? ఆసక్తికర విషయాలు చెప్పిన యండమూరి
Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన
Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!
IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్ మాక్సీ! రాజ్కోట్ వన్డేలో టీమ్ఇండియా ఓటమి
TS TET: తెలంగాణ 'టెట్' పేపర్-1లో 36.89 శాతం, పేపర్-2లో 15.30 శాతం ఉత్తీర్ణత
/body>