First Female Superhero : భారతదేశంలో మొట్టమొదటి మహిళా సూపర్‌హీరో కళ్యాణి ప్రియదర్శన్!
Lokah Chapter 1: Chandra లోకాహ్ చాప్టర్ 1: చంద్ర సంచలనం సృష్టిస్తోంది. ఆడియన్స్ నుంచి మంచి స్పందన సొంతం చేసుకుంది..ఈ సినిమాతో ఫస్ట్ మహిళా సూపర్ హీరోగా నిలిచింది కళ్యాణి ప్రియదర్శన్

First Female Superhero Kalyani Priyadarshan: దుల్కర్ సల్మాన్ నిర్మించిన 'లోక చాప్టర్ 1: చంద్ర' లో కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీలో పవర్ ఫుల్ లేడీ సూపర్ హీరోగా అదరగొట్టేసింది కళ్యాణి ప్రియదర్శన్. ఆగష్టు 28న రిలీజైన ఈ మూవీ చూసి ఫిదా కాని ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా సూపర్ హీరోగా కళ్యాణి ప్రియదర్శన్ చంద్ర పాత్రకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయ్. ఆమెను గాల్ గాడోట్ వండర్ విమెన్ తో పోల్చుతున్నారు. ఈ ప్రశంసలు చూసి సంతోషం వ్యక్తం చేసిన కళ్యాణి.. ఇది నిజంగా గొప్ప ప్రశంస..ఈ సినిమాకోసం ఎంతో కష్టపడ్డాం.. ప్రేక్షకుల నుంచి ఇంతమంచి ఆదరణ లభించడం నిజంగా సంతోషంగా ఉందని చెబుతోంది
కళ్యాణి ప్రియదర్శన్ కెరీర్లో ఇలాంటి పాత్ర దొరకడం అదృష్టం అని అనుకున్నారంతా. కానీ సూపర్ హీరోగా ఎక్కడా రాజీ పడకుండా నటించింది కళ్యాణి. యాక్షన్ సన్నివేశాల్లోనూ అద్భుతంగా చేసింది. ఈ మూవీలో 'ప్రేమలు' ఫేమ్ నస్లీన్ కీలక పాత్ర పోషించడం ప్లస్ అయింది. చందమామ పుస్తకాల్లో కథని తలపించేలా సినిమా ఉండడం...సంగీతం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ప్లస్ అవడంతో వందశాతం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది ఈ మూవీ. ఫస్టాఫ్ కన్నా సెకెండాఫ్ కొంత గందరగోళంగా ఉందనే విమర్శలు వచ్చినా కానీ కళ్యాణి ప్రియదర్శన్ నటనకు ఫిదా అయిపోయారంతా. 'లోకా చాప్టర్ 1: చంద్ర'కు కేరళలో అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయ్.
35 కోట్ల వ్యయంతో రూపొందిన లోకాహ్ చాప్టర్ 1చంద్ర మూవీ తెలుగులో కొత్త లోకం పేరుతో రిలీజైంది. మొదటి వారాంతంలోనే 50 కోట్లు వసూళ్లు సాధించింది. కళ్యాణీ ప్రియదర్శన్ నటించిన ఈ మలయాళ మూవీ చిత్రం సౌత్ లోనే అత్యధిక గ్రాస్ ను వసూలు చేసిన లేడీ ఓరియంటెడ్ మూవీగా నిలిచింది. మలయాళంలో వచ్చిన ఫస్ట్ లేడీ సూపర్ హీరోగా నిలిచిన లోక చాప్టర్ 1 చంద్రని దక్షిణాది భాషలన్నింటిలోనూ రిలీజ్ చేశారు. మొత్తం 5 భాగాలుగా రానున్న ఈ సిరీస్ లో సెకెండ్ పార్ట్ లో టొవినో థామస్ హీరోగా నటించనున్నాడు. దీనికి సంబంధించిన లీడ్ ఆల్రెడీ 'లోక చాప్టర్ 1: చంద్ర'లో చూపించారు.
మహిళా ప్రధాన చిత్రాలుగా వచ్చిన రుద్రమదేవి, మహానటి కన్నా లోక చాప్టర్ 1 చంద్ర ఎక్కువ వసూలు చేసిందని చెబుతున్నాయ్ ట్రేడ్ వర్గాలు. 'రుద్రమదేవి' టోటల్ రన్ రూ. 80 కోట్ల గ్రాస్ , మహానటి రూ. 85 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇప్పుడు 'లోక చాప్టర్ 1: చంద్ర' మొదటి ఆరు రోజుల్లోనే రూ. 90 కోట్ల గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసింది. దాదాపు 35 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా దుల్కర్ సల్మాన్ కి భారీ లాభాలనే తెచ్చిపెడుతోంది. హిందీ వెర్షన్ సెప్టెంబర్ 4 నుంచి ప్రదర్శితమవుతోంది. ఉత్తరాది ప్రేక్షకులకు కూడా నచ్చితే 'లోక చాప్టర్ 1: చంద్ర' 200 కోట్ల క్లబ్ లో చేరడం పెద్ద కష్టమేం కాదంటున్నారు ట్రేడ్ వర్గాలు.
'లోక చాప్టర్ 1: చంద్ర' సక్సెస్ కావడంతో అప్పుడే సెకెండ్ పార్ట్ పై కాన్సన్ ట్రేట్ చేశారు మేకర్స్..






















