అన్వేషించండి

Tollywood News: బేబీ కోసం నరేష్‌ కన్నీళ్లు - సాయానికి ముందుకు వచ్చిన కల్కీ టీం

Veeranjaneyulu Vihara Yathra: సీనియర్ నటుడు నరేశ్, బ్రహ్మానందం ముఖ్యపాత్రలో నటించిన వీరాంజనేయలు విహారయాత్ర చిత్రానికి వినూత్న రీతిలో ప్రమోషన్స్‌..విపరీతంగా వైరల్‌ అవుతున్న వీడియో.

VV Yatra: మా బేబీ(Baby) ఎక్కడో తప్పిపోయిందంటూ  దీనంగా కనిపించిన వారందరినీ అడుగుతున్నాడు  ఓ పెద్దాయన. అది ఒక్కరోజు కంటికి కనిపించకపోయినా...వాళ్ల ఇంటిళ్లపాదికి ముద్ద దిగదని దిగాలుపడుతున్నాడు. ఎవరికైనా మా బేబీ కనిపిస్తే కాస్త కబురు పెట్టడంటూ వేడుకుంటున్నాడు. పైగా అందరూ కల్కి(Kalki) సినిమాలో బుజ్జి(Bujji) తెలుసుకానీ..ఈ బేబీ ఎవరో తెలియదంటూ  హేళన చేస్తున్నారని బావురమన్నాడు. ఇంతకీ ఎవరా బేబీ..ఏంటా కథ ఒకసారి తెలుసుకుందాం....

వీరాంజనేయలు విహారయాత్ర
ఈరోజుల్లో సినిమా తీయడం తేలికైందిగానీ ఆ సినిమాకు ప్రమోషన్స్‌ చేసుకోవడమే అన్నింటికన్నా కష్టమైంది. ఏదైనా వెరైటీగా చెబితే తప్ప ఈ తెలుగు జనాలకు ఎక్కదు. పైగా సినిమాల మధ్య పోటీ కన్నా ఓటీటీ(OTT)ల మధ్యే పోటీ పెరిగిపోయింది. అందుకే కాస్త భిన్నంగా ఆలోచించారు  సీనియర్ నటుడు నరేష్(Naresh).. ఇటీవలే విడుదలై వెయ్యికోట్లకుపైగా వసూళ్లతో సత్తాచాటిన కల్కి సినిమాను తన చిత్రానికి ప్రమోషన్స్‌గా వాడేసుకున్నాడు.

అసలు విషయం ఏంటంటే... సీనియర్ నటుడు నరేష్‌, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం(Brahmanandam) ముఖ్య పాత్రల్లో ఓ సినిమా రూపొందించారు. అదే వీరాంజనేయులు విహారయాత్ర (Veeranjaneyulu Vihara Yathra)....ఔట్‌ అండ్ ఔట్ కామెడీతో రూపొందించిన ఈ సినిమా కథ ఏంటంటే.. ఎప్పుడూ గొడవలుపడుతూ ఉండే ఓ కుటుంబం ఈ సమస్యలన్నీ మర్చిపోయి హాయిగా ఏదైనా విహారయాత్రకు వెళ్లి ఎంజాయి చేయాలని నిర్ణయించుకుంటుంది. అనుకున్నదే తడవుగా గోవా వెళ్లి హాయిగా గడపాలనుకుంటారు. దీనికోసం తమ వద్ద ఎన్నాళ్ల నుంచో ఉంటున్న పాత మెటాడోర్ వ్యాన్‌ కు కాస్త రంగులు వేసి అందంగా ముస్తాబుచేస్తారు. దీనిపైనే వారు గోవా(Goa) చేరుకోవాలని ప్లాన్ వేసుకుంటారు.

ఈ జర్నీలో వారికి ఎదురైన పరిణాలే ఈ సినిమా కథ అంతా..దీనికి సంబంధించిన టీజర్‌ను సీనియర్ నటుడు నరేష్‌ వినూత్నంగా విడుదల చేశారు. ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే ...వీరు ప్రయాణిస్తున్న బేబీ..అదేనండి ఆ పాతకాలం నాటి వ్యాన్‌ను ఎవరో దొంగిలించారు. అదంటే వారందరికీ ఎంతో సెంటిమెంట్‌  కాబట్టి అది ఎవరికైనా కనిపిస్తే కాస్త చెప్పండంటూ ఓ వీడియో రూపొందించి సోషల్‌మీడియాలో అందరినీ రిక్వెస్ట్‌ చేస్తుంటాడు. అయితే కల్కి సినిమాలో బుజ్జి తెలుసుకానీ ఈ బేబీ తెలియందటూ అందరూ హేళన చేస్తున్నారని మదనపడిపోతుంటాడు. ఈ టీజర్‌ను బట్టి చూస్తే... ఈ సినిమా మొత్తం ఆ బేబీ(Baby) చుట్టూ తిరగనుందని అర్థమవుతోంది. అందుకే వారు కల్కి సినిమాలో ప్రభాస్‌(Prabhas) వాడిన బుజ్జి అనే కారును దీనితో పోల్చుతూ  ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేశారు.

Also Read: ప్రేమికుల రోజున షాహిద్ కపూర్‌తో పూజా హెగ్డే - లేట్ అయినా సరే పర్ఫెక్ట్ డేట్!

ఊహించని రెస్పాన్స్‌
చిత్ర యూనిట్‌ అనుకున్నదానికన్నా ఎక్కువ రెస్పాన్స్ ఈ వీడియోకు దక్కింది. ఈ వీడియోను కల్కి సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Aswin)  ట్యాగ్‌ చేయడంతో బాగా వైరల్ అవుతోంది. అటు కల్కి సినిమా అభిమానులతోపాటు ప్రభాస్ ఫ్యాన్స్‌ సైతం విపరీతంగా షేర్ చేస్తున్నారు. మీ బేబీ తప్పకుండా దొరుకుతుందని కావాలంటే మా బుజ్జి సాయం చేస్తుందంటూ కామెంట్‌ చేస్తున్నారు. అలాగే నాగ్‌అశ్విన్ ఓ పోస్టర్‌ను సైతం విడుదల చేశారు.. మీరు ఏం బాధపడొద్దండి మా బుజ్జి ఫ్యాన్స్‌ మొత్తం ఇదే పనిలో ఉన్నారని...తప్పకుండా మీ బేబీని వెతికిపట్టుకుని వచ్చి మీకు అప్పగిస్తారన్నారు. ఈ పోస్టు కూడా సోషల్‌ మీడియాలో విపరీతంగా  వైరల్ అవుతోంది.

Also Read: సై అంటే సై అంటూ కాలుదువ్వుతున్న నిహారిక, బన్నీ వాసు- ఎవరు స్టామినా ఏంటో తేలేదీ సాయంత్రం 6 గంటలకే!

ఈటీవీ విన్‌లో విడుదల
అయితే ఈ వీరాంజనేయులు విహారయాత్ర నేరుగా థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఈటీవీ విన్‌(ETV WIN) యాప్‌లో త్వరలోనే ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
PM Modi : మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Embed widget