Kalki 2898 AD: ‘కల్కి‘ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ - 24 గంటల్లో అన్ని టిక్కెట్లు అమ్ముడయ్యాయా?
ప్రభాస్ తాజా చిత్రం ‘కల్కి 2898 ఎడి‘ సినిమాకు సంబంధించి ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కేవలం 24 గంటల్లో ఏకంగా రూ. 1.10 కోట్లు విలువ చేసే టిక్కెట్లు అమ్ముడయ్యాయి.
‘Kalki 2898 AD’ Advance Bookings: సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘కల్కి 2898 ఎడి‘. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం జూన్ 27న విడుదలకు రెడీ అవుతోంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ఓవర్సీస్ లో ఒక రోజు ముందుగా, అంటే జూన్ 26నే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం విదేశాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించింది. అక్కడ మొత్తం 124 థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుండగా, ఇప్పటి వరకు 116 థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న నేపథ్యంలో టిక్కెట్లు ఓ రేంజిలో బుక్ అవుతున్నాయి. ఇప్పటికే చాలా థియేటర్లలో టిక్కెట్లు పూర్తిగా అమ్ముడయ్యాయి.
అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ. 1.10 కోట్లు వసూళు
‘కల్కి 2898 ఎడి‘ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన 4 గంటల్లోనే టికెట్స్ అన్నీఅయిపోయాయి. సుమారు 4200 టికెట్స్ హాట్ కేకుల్లా అందుకున్నారు ప్రేక్షకులు. ఈ టిక్కెట్ల అమ్మకం ద్వారా తొలి రోజు ఏకంగా 5 వేల అమెరికన్ డాలర్స్ వసూళు అయ్యాయి. అంటే, భారత కరెన్సీలో సుమారు రూ. కోటి 10 లక్షల రూపాయలు. అంతేకాదు, ఒక్క రోజులో అడ్వాన్స్ బుకింగ్స్ లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా ‘కల్కి 2898 ఎడి‘ కొత్త రికార్డును నెలకొల్పింది. ఇవాళ(మే 7) అడ్వాన్స్ బుకింగ్స్ పెద్ద మొత్తంలో జరిగే అవకాశం ఉంది.
పాత రికార్డులను ‘కల్కి 2898 ఎడి‘ తిరగరాసేనా?
ఇక భారతీయ సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ సాధించిన సినిమాగా ‘కేజీఎఫ్ 2’ నిలిచింది. ఈ సినిమా ఏకంగా రూ. 80 కోట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే సాధించింది. రెండో స్థానంలో ‘RRR’ నిలిచింది. ఈ సినిమా రూ. 59 కోట్లు అందుకుంది. మూడో స్థానంలో ‘సలార్’ ఉంది. ఈ సినిమా రూ. 49 కోట్లు వసూళు చేసింది. ‘కల్కి 2898 ఎడి‘ జోష్ చూస్తుంటే ‘కేజీఎఫ్ 2’ రికార్డులు బద్దలు కొట్టే అవకాశం కనిపిస్తోంది. రిలీజ్ కు చాలా ముందు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన నేపథ్యంలో కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు సినీ జనాలు.
జూన్ 10న ‘కల్కి 2898 ఎడి‘ ట్రైలర్ విడుదల
సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న ‘కల్కి 2898 ఎడి‘ ట్రైలర్ రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. తాజాగా చిత్రబృందం అమితాబ్ బచ్చన్ కు సంబంధించిన కొత్త పోస్టర్ ను షేర్ చేస్తూ జూన్ 10న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇటీవలే ‘కల్కి 2898 ఎడి‘ సినిమా ప్రమోషన్ ను హైదరాబాద్ లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకలో ప్రభాస్ తన ఫ్యూచరిస్టిక్ కారు ‘బుజ్జి’ని విడుదల చేసి సినిమాపై మరింత హైప్ పెంచారు. ఈ సినిమాలో ప్రభాస్ తరఫున బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిసతోంది. సినీయర్ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పశుపతి, దిశా పటానీ ఇతర క్యారెక్టర్లలో కనిపించనున్నారు.
Read Also: పవన్ చెప్పులు మోసిన భార్య.. వీడియో వైరల్, అన్నా లెజినోవాకు సలాం చేస్తున్న నెటిజన్స్