అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Kalki 2898 AD: ‘కల్కి 2898 ఏడీ’ టీమ్‌కు లీగల్ నోటీసులు - హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటున్న మాజీ కాంగ్రెస్ నేత

Kalki 2898 AD: ‘కల్కి 2898 ఏడీ’ మూవీ విడుదలయ్యి దాదాపుగా నెలరోజులు అవుతోంది. ఇదే సమయంలో ఈ సినిమాకు లీగల్ సమస్యలు ఎదురవుతున్నాయి. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ మాజీ కాంగ్రెస్ నేత ఆరోపిస్తున్నారు.

Legal Notices To Kalki 2898 AD: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీ విడుదలయ్యి దాదాపు నెలరోజులు అవుతోంది. ఇప్పటికీ పలు థియేటర్లలో ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవ్వడం విశేషం. అయితే ఇన్నిరోజులు లేనిది ఇప్పుడు ‘కల్కి 2898 ఏడీ’కు కొత్తగా ఒక సమస్య ఎదురయ్యింది. ఈ సినిమా నిర్మాతలతో పాటు ఇందులో నటించిన నటీనటులకు కూడా లీగల్ నోటీసులు వెళ్లాయనే వార్త ప్రస్తుతం టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ‘కల్కి 2898 ఏడీ’ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉందంటూ మాజీ కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్.. మూవీ టీమ్‌కు నోటీసులు జారీ చేశారు.

విష్ణుమూర్తి అవతారం..

మహాభారతాన్ని రిఫరెన్స్‌గా తీసుకొని ‘కల్కి 2898 ఏడీ’ని తెరకెక్కించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అయితే ఇది మహాభారతంలో ఉన్న కథ ప్రకారం తెరకెక్కలేదంటూ ఆచార్య ప్రమోద్ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇండియా అనేది ఎమోషన్స్, నమ్మకం, భక్తితో నిండిపోయి ఉంటుంది. సనాతన ధర్మకు మనం ఇచ్చే విలువను తారుమారు చేయకూడదు. సనాతన ధర్మానికి చెందిన రాతలను మార్చకూడదు. కల్కి నారాయణ్‌పై మాకు నమ్మకం ఉంది. ఆయన విష్ణుమూర్తికి చివరి అవతారం. పురాణాల్లో కల్కి పాత్ర గురించి చాలానే రాసుంది. దీని ఆధారంగానే ఫిబ్రవరి 19న నరేంద్ర మోదీ శ్రీ కల్కి ధామంకు శంకుస్థాపన కూడా చేశారు’’ అని ఆచార్య ప్రమోద్ చెప్పుకొచ్చారు.

కల్కి పాత్రలో మార్పులు..

‘‘కల్కి 2898 ఏడీ అనే సినిమా మా పురాణాల్లో రాసి ఉన్నదానికి అతీతంగా వెళ్తుంది. అది మా మతపరమైన భావాలను దెబ్బతీస్తుంది. కాబట్టి మేము ఇందులో కొన్ని సమస్యలను గుర్తించి మూవీ టీమ్ స్పందన కోసం ఎదురుచూస్తున్నాం. హిందువుల మనోభావాలతో ఆడుకోవడం ఫిల్మ్ మేకర్స్‌కు సరదా అయిపోయింది. మహర్షులను రాక్షసుల్లాగా చూపిస్తున్నారు. భావప్రకటన స్వేచ్ఛ అంటే ప్రేక్షకుల నమ్మకంతో ఆడుకోవచ్చని కాదు’’ అని అన్నారు ఆచార్య ప్రమోద్. సుప్రీం కోర్టు అడ్వకేట్ అయిన ఉజ్వల్ ఆనంద్ శర్మ సాయంతో ‘కల్కి 2898 ఏడీ’ టీమ్‌కు నోటీసులు జారీచేశారు ఆచార్య. హిందూ పురాణాల్లో ఉన్నట్టుగా ఈ సినిమాలో కల్కి పాత్ర లేదంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.

దెబ్బతింటున్న హిందువుల నమ్మకం..

‘‘కల్కి పాత్రను ఇష్టం వచ్చినట్టుగా మార్చడం పురాణాలను అవమించినట్టుగా ఉంటుంది. పురాణాలు అనేవి మత నమ్మకాలను పెంచుతాయి. కోట్లలో భక్తులు వీటిని నమ్ముతారు. ఇప్పటికే ఆ పాత్రను ఇష్టం వచ్చినట్టు మార్చడం వల్ల హిందువుల మనసుల్లో కల్కి గురించి వేరే అభిప్రాయం ఏర్పడి ఉండవచ్చు. దానివల్ల హిందువుల నమ్మకాన్ని దెబ్బతీసినట్టుగా ఉంటుంది’’ అంటూ ‘కల్కి 2898 ఏడీ’ టీమ్‌కు నోటీసులు పంపారు ఆచార్య ప్రమోద్. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను రూ.600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు స్వప్న దత్, ప్రియాంక దత్. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె.. ఇతర కీలక పాత్రల్లో నటించారు.

Also Read: ‘మోడర్న్ మాస్టర్స్ : ఎస్ఎస్ రాజమౌళి’ ట్రైలర్ - తను ఒక పిచ్చోడు అంటూ రాజమౌళిపై ప్రభాస్, ఎన్‌టీఆర్ వ్యాఖ్యలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!ఎలక్ట్రిక్ వెహికిల్స్ పేలిపోకూడదంటే.. జాగ్రత్తలు ఇవే!Memers Celebrating Team India Bowlers | Aus vs Ind First Test లో బౌలర్ల దెబ్బ అదుర్స్ కదూ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Road Accident: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
Jayamangala Venkataramana : వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
Embed widget