అన్వేషించండి

Kaala bhairava: ఉపాసనకు పుట్టబోయే బిడ్డ కోసం కాలభైరవ స్పెషల్ ట్యూన్, సంతోషంలో మునిగిపోయిన చెర్రీ!

రామ్ చరణ్ సతీమణి ఉపాసన రేపు బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో గాయకుడు కాల భైరవ వారి బిడ్డ కోసం చక్కటి ట్యూన్ కంపోజ్ చేశారు. ఈ ట్యూన్ విని చెర్రీ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన రేపు(మంగళవారం) బిడ్డకు జన్మనివ్వబోతోంది. అపోలో హాస్పటల్ లో ఉపాసన డెలివరీ కోసం డాక్టర్లు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. టైం ఎప్పుడు అనేది తెలియక పోయినా, కచ్చితంగా రేపే బిడ్డకు జన్మినిస్తుందని మెగా కుటుంబ సన్నిహితులు వెల్లడించారు. అయితే, మెగా ఫ్యామిలీ మాత్రం ఉపాసన డెలివరీ గురించి ఎలాంటి అఫీషియల్ ప్రకటన చేయలేదు. తాజాగా ఉపాసన, రామ్ చరణ్ చేసిన ట్వీట్లు మాత్రం రేపే డెలివరీ అనే విషయాన్ని కన్ఫామ్ చేస్తున్నాయి.   

చరణ్ దంపతుల బిడ్డ కోసం కాల భైరవ ట్యూన్

ఉపాసన, రామ్ చరణ్ దంపతులకు పుట్టబోయే బిడ్డ కోసం యువ సంగీత దర్శకుడు, గాయకుడు కాల భైరవ అద్భుతమైన ట్యూన్ ను రూపొందించాడు. ఈ ట్యూన్ చాలా వీనులవిందుగా ఉంది. ఈ ట్యూన్ విని  చిన్నారులు ఆనందంలో మునిగిపోయేలా ఉందని చెర్రీ దంపతులు ట్వీట్ చేశారు. ఇంత చక్కటి ట్యూన్ క్రియేట్ చేసినందుకు స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పారు. ఈ ట్యూన్ ను ట్వీట్ లో వీడియో రూపంలో షేర్ చేశారు.

కాల భైరవ ట్యూన్ గురించి చెర్రీ దంపతులు ఏమన్నారంటే?

కాల భైరవ ట్యూన్ పై చెర్రీ దంపతులు ఉప్పొంగిపోయారు. “ఈ ట్యూన్ మా కోసం తయారు చేసినందుకు థ్యాంక్యూ కాల భైరవ. ఈ భూమ్మీద ఉన్న మిలియన్ల మంది చిన్నారుల్లో ఈ మెలోడి ట్యూన్ సంతోషాన్ని, ఆనందాన్ని తీసుకొస్తుందని నమ్ముతున్నాం” అని ట్వీట్ చేశారు. అంతేకాదు, ఈ ట్యూన్ తో షేర్ చేసిన వీడియోలు ప్రత్యేక సందేశాన్ని కూడా ఇచ్చారు. “ధ్యానంలోకి వెళ్లడంతో పాటు పరివర్తన ఎనర్జీని పెంచడానికి, మనసులో పాజిటివ్ భావాలను తీసుకురావడానికి, ఆధ్యాత్మిక భావనలను కలిగించి బిడ్డలో మేధోసంపత్తి కలిగించడానికి ఈ ట్యూన్ ఎంతో ఉపయోగపడుతుంది” అని పేర్కొన్నారు.

మీ ప్రయాణంలో భాగం చేసినందుకు ధన్యవాదాలు- కాలభైరవ

ఈ ట్యూన్ పట్ల ఉపాసన, రామ్ చరణ్ స్పందనకు కాలభైరవ స్పందించాడు. డియరెస్ట్ చరణ్ అన్న, డియరెస్ట్ ఉప్సీ అక్క అంటూ రిప్లై ఇచ్చాడు.”ప్రియమైన చరణ్ అన్న, నాకూ ఎంతో ఆనందంగా ఉంది. ఎంతో అందమైన మీ ప్రయాణంలో నన్ను కూడా ఒక భాగం చేసినందుకు ధన్యవాదాలు” అని చెర్రీ ట్వీట్ కు రిప్లై ఇచ్చాడు. ఇదే మ్యాటర్ తో ఉపాసనకు కూడా  ధన్యవాదాలు చెప్పాడు కాల భైరవ.  ప్రస్తుతం కాల భైరవ రూపొందించిన ట్యూన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చెర్రీ దంపతులకు అభిమానుల శుభాకాంక్షలు

మరోవైపు చెర్రీ దంపతులకు బిడ్డ పుట్టబోతుందనే విషయం తెలుసుకుని మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా చిన్న మెగాస్టార్ రాబోతున్నాడని కొందరు ట్వీట్ చేస్తుంటే, లేదు పాప పుడుతుందని మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. ఎవరైనా ఒకటే అని మరికొంత మంది స్పందిస్తున్నారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ముందస్తుగా శుభాకాంక్షలు చెప్తున్నారు.

Read Also: ప్రభాస్, శేఖర్, జానీలకు గురువైన రాకేష్ మాస్టర్‌కు ఈ పరిస్థితి ఏమిటీ? ఎందుకలా మారారు?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Embed widget