అన్వేషించండి

Rakesh Master Career: ప్రభాస్, శేఖర్, జానీలకు గురువైన రాకేష్ మాస్టర్‌కు ఈ పరిస్థితి ఏమిటీ? ఎందుకలా మారారు?

ప్రముఖ సినిమా కొరియోగ్రాఫర్, రాకేష్ మాస్టర్ ఆదివారం(జూన్18) నాడు కన్నుమూశారు. ఇంతకీ రాకేష్ మాస్టర్ ఎవరు? ఇండస్ట్రీని ఏలే శిష్యులు ఉన్నా ఎందుకు ఆయనకీ దుస్థితి?

తన అద్భుత నృత్యాలతో తెలుగు సినిమా పరిశ్రమను ఉర్రూతలూగించిన ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్‌ ఆరోగ్యం క్షీణించడంతో జూన్ 18, ఆదివారం నాడు కన్నుమూశారు. ఆయన అసలు పేరు ఎస్. రామారావు.  విశాఖపట్నంలో షూటింగ్‌లో ఉండగా తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.  గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ అసాధారణ ప్రతిభావంతుడైన రాకేష్ మాస్టర్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, సినీ అభిమానులు ఆయనకు నివాళి అర్పించారు. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరనిలోటుగా అభివర్ణించారు.  

హైదరాబాద్ లో పుట్టి పెరిగిన రాకేష్ మాస్టర్

రాకేష్ మాస్టర్ హైదరాబాద్‌లోనే పుట్టి, పెరిగారు. చిన్నప్పటి నుంచి రాకేష్ మాస్టర్ కు సినిమాలు అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని అనే కోరిక ఉండేది. నృత్యకళపై మక్కువ బాగా ఎక్కువ. తనంతట తానే డ్యాన్స్ నేర్చుకున్నారు. ఆ తర్వాత అద్భుత డ్యాన్స్ మాస్టర్ గా రూపొందారు. అతడి అభిమానులు ఆయనకు ఏకలవ్య అనే ముద్దుపేరు పెట్టారు. డ్యాన్స్ పట్ల తనకున్న అభిరుచితో పాటు, రాకేష్ మాస్టర్‌కు జిమ్నాస్టిక్స్‌ అంటే కూడా చాలా ఇష్టం. పలు కళల్లో ఆయన రాణించారు. హైదరాబాద్ లో చదువు పూర్తి చేసిన తర్వాత రాకేష్ మాస్టర్ తిరుపతికి మాకాం మార్చారు. అక్కడ ఒక చిన్న డ్యాన్స్ స్టూడియోను స్థాపించాడు.  తన నైపుణ్యాన్ని మరింతగా పెంచుకున్నాడు. ఔత్సాహిక విద్యార్థులకు నృత్యం నేర్పించాడు.  ఒక్కో విద్యార్థికి డ్యాన్స్ నేర్పించేందుకు ఆయన కేవలం రూ. 5 తీసుకునేవారు. కళారూపం పట్ల, దాని వ్యాప్తి పట్ల ఆయనకున్న సంకల్పానికి ఈ ధర నిదర్శనం. 

2011లో కొరియోగ్రాఫర్ గా వెండి తెరకు పరిచయం

తన కెరీర్ ప్రారంభంలో  రాకేష్ మాస్టర్ తన స్నేహితులు వేణు పాల్, ప్రేమ్ గోపి, గిరీష్,  నటుడు తనికెళ్ల భరణి నుంచి చక్కటి సపోర్టు తీసుకున్నారు. వారి మార్గదర్శకత్వంలో ముందుకు నడిచారు. వారి మూలంగా ఆయనకు చిత్ర పరిశ్రమలో మంచి అవకాశాలు వచ్చేందుకు ఉపయోగపడ్డాయి.  2011లో రాకేష్ మాస్టర్ "అవ్వ’ అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ప్రభాష్, మహేష్ బాబు, రామ్ పోతినేనితో పాటు పలువురు స్టార్ హీరోలతో కలిసి పని చేశారు. శేఖర్ మాస్టర్ సహా పలువురు కొరియోగ్రాఫర్లకు ఆయన గురువు. ఆయన దగ్గరే వారు డ్యాన్స్‌లో ఓనమాలు నేర్చుకున్నారు. రాకేష్ మాస్టర్ ఢీ లాంటి డ్యాన్స్ రియాలిటీ షోలలోనూ తన ప్రతిభను ప్రదర్శించారు. పాపులర్ కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.   

పలు ఇంటర్వ్యూలలో రాకేష్ మాస్టర్ సినిమా పరిశ్రమ గురించి కీలక విషయాలు వెల్లడించారు. ఇతర కొరియోగ్రాఫర్లతో పోల్చితే తనకు పెద్దగా రెమ్యునరేషన్ ఉండేది కాదని, ఇస్తామని చెప్పిన రెమ్యునరేషన్ కూడా ఇవ్వని సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పారు. అవకాశాల కోసం తాను ఎవరినీ బతిమలాడనని చెప్పారు. తన డ్యాన్స్ మీద నమ్మకం ఉన్నవారు తప్పకుండా తనకు అవకాశాలు ఇస్తారని చెప్పుకొచ్చారు. చివరి వరకు తను ఒకరి దగ్గరికి వెళ్లి అవకాశాల కోసం వెంపర్లాడలేదు. ఇండస్ట్రీని ఏలే శిష్యులు ఉన్నా, ఒక్కరినీ చేయి చాటి యాచించలేదు. బతికినంత కాలం నిజాయితీగానే ఉన్నారు. కాలక్రమేనా.. ఆయనకు అవకాశాలు తగ్గడంతో మానసికంగా కుంగిపోయారు. శిష్యులు కూడా అవకాశాలను అందిపుచ్చుకొనే క్రమంలో రాకేష్‌ను పట్టించుకోలేదు. అలాంటి సందర్భంలో ఆయనకు యూట్యూబ్ ఇంటర్వ్యూల ద్వారా ఉపాధి లభించింది. వివాదాస్పద వ్యాఖ్యలతో ఆయన మళ్లీ చర్చలోకి వచ్చారు. అయితే, ఆయన పూర్తి భిన్నంగా.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. అందులో పాపులారిటీ పొందిన వ్యక్తులతో జతకడుతూ.. వాళ్లతోనే కాలక్షేపం చేస్తూ.. సరదాగా గడిపారు. చివరకు ఊహించని విధంగా జీవితానికి వీడ్కోలు పలికారు.

Read Also: రిహార్సల్స్ చేసి మరీ లిప్ లాక్ - వైరల్ గా మారిన స్మృతి వెంకట్ ముద్దు సీన్!

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today November 28th: 'గోదావరి' సీరియల్: అమెరికా వెళ్లనున్న నందు! సంజు ఆఫీస్‌లో జాను అల్లరి! గౌతమి వెంట అజయ్!
'గోదావరి' సీరియల్: అమెరికా వెళ్లనున్న నందు! సంజు ఆఫీస్‌లో జాను అల్లరి! గౌతమి వెంట అజయ్!
Anil Ravipudi Ramayana : మైథలాజికల్ జానర్‌లో అనిల్ రావిపూడి మూవీ - డ్రీమ్ ప్రాజెక్టు‌పై స్టార్ డైరెక్టర్ రియాక్షన్
మైథలాజికల్ జానర్‌లో అనిల్ రావిపూడి మూవీ - డ్రీమ్ ప్రాజెక్టు‌పై స్టార్ డైరెక్టర్ రియాక్షన్
Bhogi First Day Collections : భోగి మూవీకి మిక్స్‌డ్ రెస్పాన్స్! - శర్వానంద్ యాక్షన్ థ్రిల్లర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
భోగి మూవీకి మిక్స్‌డ్ రెస్పాన్స్! - శర్వానంద్ యాక్షన్ థ్రిల్లర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Nindu Manasulu Serial Today November 28th: నిండు మనసులు: బిగ్‌ షాకింగ్.. సిద్ధూ, ప్రేరణ ఇక లేరు! గణ కళ్లముందే బాంబ్‌ పేలి చనిపోయిన సిద్ధూ, ప్రేరణ!
నిండు మనసులు: బిగ్‌ షాకింగ్.. సిద్ధూ, ప్రేరణ ఇక లేరు! గణ కళ్లముందే బాంబ్‌ పేలి చనిపోయిన సిద్ధూ, ప్రేరణ!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Seats In AP and Telangana: గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
AP Panchayat Polls: జనసేన, బీజేపీకి తొలి విడతలో నిరాశేనా? సోషల్ మీడియా హైప్ తేలిపోతుందా?
జనసేన, బీజేపీకి తొలి విడతలో నిరాశేనా? సోషల్ మీడియా హైప్ తేలిపోతుందా?
Akash Deep Fifer:  ఆకాశ్ దీప్ ఫైఫ‌ర్ వృథా.. పేసర్ల ధాటికి కుప్పకూలిన భారత బ్యాటింగ్ లైనప్,  రెండోటెస్టులో పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
ఆకాశ్ దీప్ ఫైఫ‌ర్ వృథా.. పేసర్ల ధాటికి కుప్పకూలిన భారత బ్యాటింగ్ లైనప్,  రెండోటెస్టులో పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
Delimitation Bill: డీలిమిటేషన్‌పై మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. కొత్త బిల్లులో భారీ మార్పులు.. సీట్లపై దక్షిణాదికి హామీ?
డీలిమిటేషన్‌పై మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. కొత్త బిల్లులో భారీ మార్పులు.. సీట్లపై దక్షిణాదికి హామీ?
Hyderabad Crime News: కార్తీక దీపం అంటుకుని యువతి మృతి.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం
కార్తీక దీపం అంటుకుని యువతి మృతి.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం
Aakasamlo Oka Tara Review : తంబీ నువ్ మావోనివి - మహానటి సావిత్రిలా సాత్విక... 'ఆకాశంలో ఒక తార'పై రాజమౌళి ప్రశంసలు
తంబీ నువ్ మావోనివి - మహానటి సావిత్రిలా సాత్విక... 'ఆకాశంలో ఒక తార'పై రాజమౌళి ప్రశంసలు
Ujjwal Nikam On Ajmal Kasab: కసబ్ నోరు విప్పేందుకు సిగరెట్ ఆశ చూపా.. బిర్యానీ వార్తల్లో నిజం లేదు- ఉజ్వల్ నికమ్
కసబ్ నోరు విప్పేందుకు సిగరెట్ ఆశ చూపా.. బిర్యానీ వార్తల్లో నిజం లేదు- ఉజ్వల్ నికమ్
శనివారం కొనుగోలు చేయకూడని 5 వస్తువులు ఇవే!
శనివారం కొనుగోలు చేయకూడని 5 వస్తువులు ఇవే!
Embed widget