Prashanth Neel: ప్రశాంత్ నీల్ బర్త్ డే సెలబ్రేషన్స్ - ఫైర్ కనిపిస్తుందంటున్న మ్యాన్ ఆఫ్ మాసెస్
Prashanth Neel Birthday: మూవీ సెట్‌లోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కేక్ కట్ చేసి ఎన్టీఆర్‌కు తినిపించారు. సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ బర్త్ డే విషెష్ తెలిపారు.

Prashanth Neel Birthday Celebrations: తన ఫస్ట్ మూవీ 'కేజీఎఫ్'తో పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ప్రభాస్ 'సలార్'తో ఆ క్రేజ్ రెండింతలైంది. ఇప్పుడు తాజాగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌తో మూవీ చేయబోతున్నారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. డైరెక్టర్ నీల్ సెట్స్‌లో షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు.
ఎన్టీఆర్‌తో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బర్త్ డే సందర్భంగా మూవీ సెట్స్‌లోనే ఆయన ఎన్టీఆర్‌తో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. కేక్ కట్ చేసిన నీల్.. ఎన్టీఆర్‌కు తినిపించారు. మూవీ టీం అంతా ఆయనకు విషెష్ తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే.. సోషల్ మీడియా వేదికగా ప్రశాంత్ నీల్‌కు ఎన్టీఆర్ విషెష్ చెప్పారు. 'హ్యాపీ బర్త్ డే ప్రశాంత్. మీ మాటల కంటే మీ విజన్ సౌండ్ గట్టిగా వినిపిస్తుంది. స్క్రీన్‌పై మీ ఫైర్ కనిపిస్తుంది.' అంటూ ట్వీట్ చేశారు.
Last Night @tarak9999 Anna Celebrated #PrashanthNeel Garu Birthday In #NTRNeel Sets ❤️🔥💐❤️.#Dragon @NTRNeelFilm pic.twitter.com/t3sFOiQP70
— Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) June 4, 2025
Happy Birthday Prashanth!
— Jr NTR (@tarak9999) June 4, 2025
Your vision speaks louder than words. Here’s to more fire on screen… pic.twitter.com/fv2bxGaEMJ
హ్యాపీ బర్త్ డే మై సలార్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సైతం ప్రభాస్‌కు సోషల్ మీడియా వేదికగా విషెష్ చెప్పారు. 'హ్యాపీ బర్త్ డే మై సలార్. పార్ట్ 2లో మరింత విధ్వంసం చేయడానికి ఎదురుచూస్తున్నా. లవ్యూ' అంటూ పోస్ట్ పెట్టారు. ఇక పలువురు సినీ ప్రముఖులు, నిర్మాణ సంస్థలు కూడా ఆయనకు బర్త్ డే విషెష్ చెప్పాయి.
ఇక, 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కప్ సాధించడంతో మూవీ సెట్స్‌లోనే సంబరాలు చేసుకున్నారు ప్రశాంత్ నీల్. చిన్న పిల్లాడిలా గెంతులేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియోను ఆయన సతీమణి లికితా రెడ్డి ఈ వీడియోను షేర్ చేస్తూ.. 'క్రేజీయెస్ట్ క్రికెట్ ఫ్యాన్‌కు ఇది పర్‌ఫెక్ట్ బర్త్ డే గిఫ్ట్' అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
View this post on Instagram
మరోవైపు.. ఎన్టీఆర్, నీల్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, టి సిరీస్ ఫిలిమ్స్ (గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్) సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై మీద నవీన్ ఎర్నేని, రవిశంకర్ వై నిర్మిస్తున్నారు. రవిబ్రసూర్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 25 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.





















