అన్వేషించండి

War 2 Movie: ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ 'వార్ 2' - డబ్బింగ్ స్టార్ట్ చేసిన తారక్.. ఎంట్రీ అదిరిందిగా..

NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఆయన బాలీవుడ్ ఎంట్రీ మూవీ 'వార్ 2' డబ్బింగ్ పనులు షురూ అయ్యాయి. తాజాగా.. తన డబ్బింగ్ పార్ట్‌ను ప్రారంభించారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.

NTR Starts War 2 Dubbing: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు నిజంగా ఇది గూస్ బంప్స్ తెప్పించే న్యూస్. ఆయన బాలీవుడ్ ఎంట్రీ మూవీ 'వార్ 2' కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ఈ మూవీ డబ్బింగ్ పనులు షురూ అయ్యాయి.

మాస్ ఎంట్రీ అదుర్స్

ఈ మూవీలో తన డబ్బింగ్ వర్క్‌ ప్రారంభించారు ఎన్టీఆర్. 'వార్ 2 డబ్బింగ్ బిగిన్స్' అంటూ స్టూడియోలోకి ఆయన ఎంట్రీ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2'. బాలీవుడ్‌లో ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ ఇది. దీంతో భారీగా హైప్ క్రియేట్ అవుతోంది. ఇటీవల ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. 

Also Read: హీరోయిన్ కోసం మినిస్టర్ స్పీచ్ ఆపేసిన యాంకర్ ఝాన్సీ - సారీ సర్ అంటూనే.. అంతెందుకు అంటోన్న నెటిజన్స్

టీజర్ వేరే లెవల్ అంతే

ఈ మూవీలో సీక్రెట్ ఏజెంట్‌గా ఓ డిఫరెంట్ లుక్‌లో ఎన్టీఆర్ కనిపించనున్నారు. 'నా కళ్లు ఎప్పటి నుంచో నిన్ను వెంటాడుతూనే ఉన్నాయి కబీర్. ఇండియా బెస్ట్ సోల్జర్. రాలో బెస్ట్ ఏజెంట్ నువ్వే. కానీ, ఇప్పుడు కాదు. నా గురించి నీకు తెలియదు. కానీ, ఇప్పుడు తెలుసుకుంటావ్. గెట్ రెడీ ఫర్ వార్' అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమయ్యే టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. దాదాపు పదేళ్ల తర్వాత మోడ్రన్ స్టైలిష్ లుక్‌లో ఎన్టీఆర్ కనిపించగా భారీ యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటున్నాయి. 

ఈ భారీ పాన్ ఇండియా మూవీని యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా.. 'బ్రహ్మాస్త్ర' ఫేం అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆగస్ట్ 14న హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి.

బాలీవుడ్ ఎంట్రీ అదిరిపోవాలంతే..

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన స్పై థ్రిల్లర్ 'వార్' బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకుంది. దీనికి సీక్వెల్‌గా 'వార్ 2' రాబోతోంది. ఏజెంట్ రోల్స్ అన్నింటిలోనూ ఈ మూవీలో ఎన్టీఆర్ రోల్ డిఫరెంట్‌గా ఉండబోతుందనే టాక్ ముందు నుంచీ వినిపించింది. అందుకు తగ్గట్లుగానే టీజర్‌లోనూ ఆయన మాస్ ఎలివేషన్స్‌, ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయ్యేలా డైలాగ్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. మూవీలో ఎన్టీఆర్, హృతిక్‌లపై దాదాపు 500 మంది డ్యాన్సర్లతో ఓ స్పెషల్ సాంగ్ ఉందని.. అది చాలా స్పెషల్ అనే టాక్ వినిపిస్తోంది.

ఈ మూవీతోనే ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. టాలీవుడ్‌తో పాటే బాలీవుడ్‌లోనూ ఓ వెలుగు వెలగాలని ఆయన ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. ఆయన ప్రస్తుతం ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్టు షూటింగ్‌లోనూ బిజీగా ఉన్నారు. ఆ తర్వాత 'దేవర 2' మూవీ లైనప్‌లో ఉంది. ఆ తర్వాత త్రివిక్రమ్‌తోనూ ఓ మూవీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget