![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Jayamma Panchayathi Trailer: ఇదెక్కడి పంచాయతీ - సుమ నోటి వెంట బూతు
సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జయమ్మ పంచాయతీ'. ఈ రోజు పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు.
![Jayamma Panchayathi Trailer: ఇదెక్కడి పంచాయతీ - సుమ నోటి వెంట బూతు Jayamma Panchayathi Trailer released, Suma Kanakala utter cuss word in movie Jayamma Panchayathi Trailer: ఇదెక్కడి పంచాయతీ - సుమ నోటి వెంట బూతు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/16/e65253e4345bbbda4d167a404ac51064_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Suma Kanakala - Jayamma Panchayathi Update: సుమ కనకాల ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'జయమ్మ పంచాయతీ'. ఈ రోజు ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ అంతా ఒక ఎత్తు అయితే... చివర్లో సుమ నోటి వెంట దొర్లిన బూతు మరో ఎత్తు. సుమకు ఫ్యామిలీ యాంకర్ అనే ఇమేజ్ ఉంది. క్లీన్ కామెడీ చేస్తారని పేరు ఉంది. అందువల్ల, ఆమె నోటి వెంట బూతు రావడం నెటిజన్లకు షాక్ ఇచ్చింది.
'జయమ్మ పంచాయతీ' ట్రైలర్‌లో ఏముంది? అనే విషయానికి వస్తే... సుమ, దేవి ప్రసాద్ దంపతులుగా కనిపించారు. ఏదో సమస్య వల్ల జయమ్మ ఊరి పెద్దల దగ్గరకు పంచాయతీ వరకూ వెళ్ళిందని తెలుస్తోంది. తర్వాత ఆమె భర్తకు జబ్బు చేయడం, ఊరి సమస్య, రికార్డింగు డ్యాన్సులు, క్యాస్ట్ ఫీలింగ్, నక్సలిజం వంటివి టచ్ చేసినట్టు తెలుస్తోంది. సుమ క్యారెక్టరైజేషన్ ఆకట్టుకునేలా ఉంది. 'నీ గంట కోసేస్టా' అంటూ వినోదం పండించడమే కాదు, ట్రైలర్ చివర్లో చెట్టుకు మనుషుల్ని వేలాడదీసిన దగ్గర రౌద్రం కూడా చూపించారు.
అయితే... లాస్ట్‌లో చెప్పే డైలాగ్ మాత్రం ఆమె అభిమానులకు షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. సుమ ఆ డైలాగ్ చెప్పడానికి అంగీకరించారంటే... ఆ సన్నివేశంలో ఎమోషన్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మే 6న సినిమాను విడుదల చేస్తున్నట్టు ట్రైలర్ చివర్లో వెల్లడించారు.
Also Read: 'గాలివాన' రివ్యూ: 'జీ 5'లో విడుదలైన సిరీస్ ఎలా ఉందంటే?
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
ప్రముఖ స్వరకర్త ఎం.ఎం. కీరవాణి సంగీతం ఈ చిత్రానికి అందిస్తున్నారు. విజయ్ కలివరపు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు బలగ ప్రకాష్ రావు నిర్మాత.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)