Jayam Ravi Divorce: అవును... మేం విడిపోయాం - ఆర్తితో విడాకులు కన్ఫర్మ్ చేసిన హీరో జయం రవి
Jayaram Ravi On Divorce: తమిళ కథానాయకుడు, తెలుగు ప్రేక్షకులకు సైతం తెలిసిన 'జయం' రవి తన వ్యక్తిగత జీవితం గురించి ఓ లేఖ విడుదల చేశారు. తాను విడాకులు తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
తమిళ చిత్రసీమలో మరో జంట విడాకులు తీసుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో, తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన నటుడు 'జయం' రవి (Jayam Ravi), ఆర్తి (Aarti) తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు. వీరిద్దరి విడాకుల గురించి మూడు నెలల క్రితమే వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు తమ బంధం ముగిసిందని 'జయం' రవి అధికారికంగా వెల్లడించారు. సోషల్ మీడియాలో ఓ లెటర్ షేర్ చేశారు ఆయన.
నేను నిజాయతీగా ఉన్నా... 'జయం' రవి
''జీవితంలో అనేక అధ్యయాలు ఉంటాయి. ప్రతి అధ్యాయంలో సవాళ్లు, మనకు అనుకూలమైన అవకాశాలు ఉంటాయి. నా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని ఫాలో అయ్యే చాలా మంది నాపై ఎంతో ప్రేమ, అభిమానం చూపిస్తూ వస్తున్నారు. నేనూ నా అభిమానులు, మీడియాతో నిజాయతీగా ఉంటున్నాను. బరువెక్కిన హృదయంతో అందరినీ నా వ్యక్తిగత జీవితానికి సంబదించిన ఓ విషయాన్నీ నేను పంచుకోవాలని అనుకుంటున్నాను'' అని 'జయం' రవి ఓ లేఖ విడుదల చేశారు. అందులో ఆర్తితో విడాకులను ధృవీకరించారు.
''చాలా ఆలోచించిన తర్వాత, చర్చలు జరిపాక... నా జీవితంలో కఠినమైన, చాలా కష్టతరమైన నిర్ణయం తీసుకున్నాను. ఆర్తితో వివాహ బంధానికి స్వస్తి పలికాను. ఈ నిర్ణయం వ్యక్తిగత కారణాల వల్ల తీసుకున్నది తప్ప మరొకటి కాదు. ఈ బంధంలో ఉన్న ప్రతి ఒక్కరి మేలు కోసం తీసుకున్న నిర్ణయమిది. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ మా వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించి ఎటువంటి ఊహాగానాలకు రాకూడదని మనవి చేస్తున్నాను. ఈ విషయాన్ని ప్రయివేటుగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నా'' అని 'జయం' రవి పేర్కొన్నారు.
Also Read: ముంబైలో ఎన్టీఆర్, సందీప్ రెడ్డి వంగా మీటింగ్ - 'దేవర'తో 'యానిమల్' దర్శకుడు సినిమా తీస్తే....
Grateful for your love and understanding.
— Jayam Ravi (@actor_jayamravi) September 9, 2024
Jayam Ravi pic.twitter.com/FNRGf6OOo8
సినిమాలతో అభిమానులను అలరిస్తా!
సినిమాలకు వస్తే తన ప్రయారిటీ ఎప్పుడూ ఒక్కటేనని 'జయం' రవి స్పష్టం చేశారు. తన సినిమాల ద్వారా అభిమానులకు ఎంటర్‌టైన్‌మెంట్, సంతోషం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. తనను అర్థం చేసుకున్నందుకు, తనకు మద్ధతు ఇస్తున్నందుకు అభిమానులు అందరికీ థాంక్స్ చెప్పారు.
Also Read: 'దేవర' ముంగిట కార్తీ, అరవింద్ స్వామి - సేమ్ రిలీజ్ డేట్‌కు తమిళ సినిమా 'సత్యం సుందరం'
పదిహేనేళ్ల వైవాహిక బంధానికి ముగింపు
'జయం' రవి తండ్రి తెలుగువారే, చిత్రసీమకు చెందిన వారే. ఎడిటర్, నిర్మాతగా ఆయన ఎంతో పాపులర్. ఎడిటర్ మోహన్ కుమారుడిగా చిత్రసీమకు హీరోగా 'జయం' రవి వచ్చారు. తమిళ టీవీ నిర్మాత సుజాత విజయ్ కుమార్ (Aarti Ravi)తో 2009లో వివాహం జరిగింది. రవి, ఆర్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 'జయం' రవి సోదరుడు మోహన్ రాజా దర్శకుడు. తెలుగులో 'హనుమాన్ జంక్షన్', చిరంజీవి 'గాడ్ ఫాదర్' సినిమాలకు దర్శకత్వం వహించారు.
Also Read: నయన్... భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించెన్ - భర్త, పిల్లలతో కలిసి హిందూ పద్ధతిలో!