Jawan Movie: ‘జవాన్’లో ఆ యాక్షన్ సీక్వెన్స్ కోసమే రూ.17 కోట్లు, అంత ఖర్చు ఎందుకైందో తెలుసా?
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ రాబోయే చిత్రం 'జవాన్'.. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమాలో 70 స్కార్పియోలతో థ్రిల్లింగ్ హైవే ఛేజ్ సీన్ కూడా ఈ సినిమాలో ఉండనుందనే టాక్ వినిపిస్తోంది.
Action Scquences in Jawan : తమిళ దర్శకుడు అట్లీ - కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కాంబినేషన్లో ‘జవాన్ (Jawan)' మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanatara) కథానాయికగా నటిస్తున్న సినిమాను.. సెప్టెంబర్ 7, 2023న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో 'జవాన్'కు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ చాలా ఉన్నాయని, మేకర్స్ వాటి కోసం దాదాపు రూ.17 కోట్లు ఖర్చు చేశారని సమాచారం. 70 స్కార్పియోలతో థ్రిల్లింగ్ హైవే ఛేజ్ సీన్ కూడా ఈ సినిమాలో ఉండనుందంట. ఇది సినిమాకే స్పెషల్ హైలైట్‌లలో ఒకటిగా నిలుస్తుందని షారుఖ్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో షారుఖ్ ఖాన్, నయనతారతో పాటు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Makkal Selvan Vijay Sethupathi) కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ మూవీ టీజర్ జులై 12, 2023న విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ యాక్షన్ ఫ్లిక్‌ని చూసేందుకు ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ ఏడాదిలో 'పఠాన్ (Pathan)' చిత్రంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన షారుఖ్.. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత బాక్సాఫీస్ వద్ద తన సత్తా చూపించారు. ఇప్పుడు మరోసారి 'జవాన్' ద్వారా తన స్టామినా చూపించటానికి రెడీ అయ్యారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోన్న 'జవాన్' కు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్‌తో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌కి చేరుకున్నాయి. అంతే కాదు ఈ సినిమాలో బాద్ షా ఇప్పటి వరకు కనిపించని ఓ డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్నారు.
త్వరలోనే ట్రైలర్ విడుదల చేయటానికి రెడీ అయిన మేకర్స్.. షారుఖ్ 'జవాన్' ట్రైలర్ పై ఇటీవలే ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ను షేర్ చేశారు. హాలీవుడ్ యాక్షన్ హీరో్ టామ్ క్రూజ్ నటించిన 'మిషన్ ఇంపాజిబుల్ 7 (Mission Impossible 7) డెడ్ రాకింగ్’ సినిమా ప్రదర్శించే థియేటర్స్‌లో ‘జవాన్’ ట్రైలర్‌ను ప్రదర్శించబోతున్నామని ప్రకటించారు. మరో వైపు షారూక్ ఖాన్ అభిమానులు సైతం ఈ సినిమా ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్స్‌లో షారూక్ ముఖం కనిపించకుండా ఉంది. అసలు ఆయన పాత్ర ఏంటి? అనే దానిపై అందరిలోనూ క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే పఠాన్ చిత్రంతో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన షారూక్.. ఇప్పుడు జవాన్‌తో ఖచ్చితంగా మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తారని ఆయన ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial