Janhvi Kapoor: పొరపాటున బాయ్‌ఫ్రెండ్ పేరును బయటపెట్టేసిన జాన్వీ - ఆ మాజీ సీఎం కొడుకేనట!
Janhvi Kapoor: శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ ఒక రాజకీయ కుటుంబంలోని వ్యక్తితో ప్రేమలో ఉందని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపస్తుండగా.. తాజాగా ‘కాఫీ విత్ కరణ్’ షోలో ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది.
Janhvi kapoor Boy friend: అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ ప్రేమాయణం గురించి బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. జాన్వీ కపూర్ బాయ్‌ఫ్రెండ్స్ గురించి, రిలేషన్స్‌షిప్స్ గురించి తను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంది. ఇక తాజాగా ‘కాఫీ విత్ కరణ్’ ప్రోగ్రామ్‌కు గెస్ట్‌గా వచ్చిన జాన్వీ.. తన బాయ్‌ఫ్రెండ్ ముద్దుపేరును పొరపాటున బయటపెట్టేసింది.
బాయ్‌ఫ్రెండ్‌కు జాన్వీ ముద్దుపేరు..
బాలీవుడ్ టాక్ షోలలో విపరీతంగా పాపులర్ అయ్యింది ‘కాఫీ విత్ కరణ్’. ఇప్పటికే ఈ షో 7 సీజన్స్‌లను పూర్తి చేసుకోగా.. 8వ సీజన్‌ను కూడా ప్రారంభించుకుంది. ‘కాఫీ విత్ కరణ్’ సీజన్ 8లో ఎంతోమంది సెలబ్రిటీలు గెస్టులుగా వచ్చి తమ మనసులోని మాటలను బయటపెట్టగా.. తాజాగా శ్రీదేవి వారసురాళ్లు జాన్వీ, ఖుషీ కూడా ఇందులో గెస్టులుగా పాల్గొన్నారు. ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. ఇందులో ముఖ్యంగా జాన్వీ, ఖుషీల పర్సనల్ లైఫ్ గురించి, వారి రిలేషన్‌షిప్ గురించి, బాయ్‌ఫ్రెండ్స్ గురించి డిస్కషన్ నడిచింది. అదే క్రమంలో అనుకోకుండా తన బాయ్‌ఫ్రెండ్ ముద్దుపేరు ‘షీకు’ అని బయటపెట్టేసింది జాన్వీ కపూర్.
మేము జస్ట్ ఫ్రెండ్స్..
ముందుగా తను ఈ విషయంలో కాన్ఫిడెంట్‌గా ఉన్నానంటూ షోలో పాల్గొనడంపై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది ఖుషీ కపూర్. ‘‘నిన్న నేను పార్టీలో ఉన్నప్పుడు అందరి దగ్గరకి వెళ్లి నన్ను ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలు అడగండి’’ అని చెప్తున్నాను అని జాన్వీ చెప్పింది. ఎందుకు అని అడిగాడు కరణ్ జోహార్. ‘‘నవ్య నేను ఈ షోకు రావడానికి రెడీగా లేను అనుకుంది. వెళ్లకు అని చెప్పింది’’ అంటూ జాన్వీ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత వేదాంగ్ రైనా, ఖుషీ కపూర్ డేటింగ్‌లో ఉన్న విషయంపై ప్రశ్నించాడు కరణ్. దానికి సమాధానంగా ‘ఓం శాంతి ఓం’ సినిమాలోని ఒక సీన్‌ను గుర్తుచేస్తూ.. మేము జస్ట్ ఫ్రెండ్స్ అంటూ సమాధానం ఇచ్చింది.
ముగ్గురిని మాత్రమే డేట్ చేశాను..
ఆ తర్వాత జాన్వీ కపూర్.. ఎవరిని డేట్ చేస్తుందంటూ ఖుషీ కపూర్‌ను ప్రశ్నించాడు కరణ్. ‘‘నేను కేవలం ముగ్గురినే డేట్ చేశాను. అది గుర్తుపెట్టుకో’’ అంటూ ఖుషీకి వార్నింగ్ ఇచ్చింది జాన్వీ. బాయ్‌ఫ్రెండ్ పేరు చెప్పాలా అని ఖుషీ అడగగానే.. జాన్వీ ఒకసారిగా కంగారుపడింది. ‘‘మీ స్పీడ్ డైల్ లిస్ట్‌లో ఉండే ముగ్గురి పేర్లు చెప్పండి’’ అని కరణ్ అడగగానే.. ‘‘పాపా, ఖుషు, షీకు’’ అని చెప్పేసింది జాన్వీ.
షీకు అంటే షికార్ పహారియా. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుషీల్ కుమార్ మనవడే షికార్. తను ఒక బిజినెస్‌మ్యాన్. అయితే గతకొంతకాలంగా జాన్వీ, షికార్ ప్రేమలో ఉన్నారని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. అది నిజమే అనిపించే విధంగా వీరిద్దరూ పలుమార్లు పబ్లిక్‌గా కూడా కలిసి కనిపించారు. జాన్వీ ఎక్కడికి వెళ్లినా షికార్ అక్కడ ఉంటాడు. ఇక ‘కాఫీ విత్ కరణ్’లో జాన్వీ చెప్పినట్టుగా షికు అంటూ షికార్ అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు.
Also Read: కమల్ హాసన్ ఇంట న్యూ ఇయర్ వేడుకలు - బాయ్‌ఫ్రెండ్‌తో శృతి సందడి