Ranbir Kapoor's Ramayana: 'రామాయణ' నుంచి సాయిపల్లవి ఔట్? సీతగా జాన్వీ కపూర్
Ranbir Kapoor's Ramayana: 'రామాయణ' గురించి అప్ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ప్రాజెక్ట్ నుంచి సాయిపల్లవి ఔట్ అనే టాక్ వినిపిస్తోంది. ఆమె ప్లేస్ లో సీతగా ...
Janhvi Kapoor replaces Sai Pallavi: 'యానిమల్' విజయాన్ని సక్సెస్ చేస్తున్న రణ్ బీర్ కపూర్.. ఇప్పుడు ఇక తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పైన ఫోకస్ పెట్టారు. అదే రామాయణ. ఈ సినిమాకి సంబంధించి పనులు చకచకా సాగిపోతున్నాయి. 'రామాయణ'లో రాముడిగా రణ్ బీర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆయన పక్కన సీతగా సాయిపల్లవి నటిస్తోంది అనే వార్తలు బయటికి వచ్చాయి. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నుంచి ఆమె బయటికి వచ్చేసిందట. సాయి పల్లవి ప్లేస్ లో ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తున్నారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.
సీతగా జాన్వీ కపూర్
ఈ సినిమాలో రాముడిగా రణ్ బీర్ నటిస్తుండగా.. ఆలియా భట్ ని సీతగా అనుకున్నాడట డైరెక్టర్ నితీశ్ తివారీ. కానీ, ఆలియా భట్ వేరే ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉండటం వల్ల.. ఆమె డెట్స్ అడ్జస్ట్ అవ్వలేదని చెప్తున్నారు. దీంతో ముందు సాయిపల్లవిని సీతగా అనుకున్నారట. అయితే, ఇప్పుడు ఆమె ప్లేస్ లో జాన్వీ కపూర్ ని రీప్లేస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, సాయి పల్లవి కావాలనే బయటికి వెళ్లారా? లేక మేకర్స్ ఆమెను తొలగించారా? అనే విషయం మాత్రం ఇంకా బయటికి రాలేదు. అలానే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన కూడా రాలేదు.
ఎస్ చెప్పిన జాన్వీ కపూర్
డైరెక్టర్ నితీశ్ తివారీ, జాన్వీ కపూర్ కాంబినేషన్ లో ఈ మధ్యే 'బవాల్' అనే సినిమా రిలీజ్ అయ్యింది. ఓటీటీలో రిలీజైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఆయన తర్వాతి ప్రాజెక్ట్ పై పూర్తి కాన్సన్ ట్రేట్ చేశారట. ఇక జాన్వీ కపూర్ తో 'బవాల్' చేస్తున్నప్పుడు ఆమె సీతగా చేస్తే బాగుంటుందని అనిపించిందట నితీశ్ కి దీంతో సాయిపల్లవి ప్లేస్ లో జాన్వీ కపూర్ ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక సీతగా చేసేందుకు జాన్వీ కపూర్ కూడా ఇప్పటికే ఓకే చెప్పారనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది.
అందరూ స్టార్ లే
ఇక ఈ సినిమాకి సంబంధించి చాలా భారీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దాంట్లో భాగంగానే అన్ని క్యారెక్టర్లకు స్టార్ హీరోలు, హీరోయిన్లను ఎంపిక చేశారు. రాముడిగా ఇప్పటికే రణ్ బీర్ కన్ఫామ్ అయ్యారు. ఇక విభిషణుడి పాత్రలో విజయ్ సేతుపతి, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారట. సీతగా ముందు అలియాభట్ ని సంప్రదించగా ఆమె వేరే ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నారు. 'యానిమల్' సినిమాలో ఆల్ఫా మేల్ క్యారెక్టర్ లో నటించిన రణ్ బీర్ ని ఉత్తమ పురుషుడైన రాముడి గెటప్ లో చూసేందుకు ఆయన ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
'దేవర'లో బిజీ బిజీగా జాన్వీ..
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ 'ధడక్' సినిమాతో బాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది ఆ తర్వాత 'గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్', 'రూహి', 'మిలీ' లాంటి సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన తెలుగులో ఎంట్రీ ఇవ్వనున్నారు జాన్వీ. ఇక ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి బిజీబిజీగా ఉన్నారు ఆమె.
Also Read: కుమారి ఆంటీపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంట్రీ?