అన్వేషించండి

Janaka Aithe Ganaka Trailer: స్టార్టింగ్ టు ఎండింగ్ నవ్వులే నవ్వులు... ‘జనక అయితే గనక’ రిలీజ్ ట్రైలర్‌ అదుర్స్ అంతే!

సుహాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జనక అయితే గనక’. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రబృందం ట్రైలర్‌ ను రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది.

Suhas Janaka Aithe Ganaka Movie Trailer Out: టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్, సంగీర్తన జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జనక అయితే గనక’. సందీప్‌ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ సహా అన్ని ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటోంది.    

నవ్విస్తూ అలరించిన ‘జనక అయితే గనక’ ట్రైలర్

‘జనక అయితే గనక’ సినిమా ట్రైలర్ చూస్తే, ప్రస్తుతం ఉన్న సమాజ స్థితిగతుల రీత్యా పిల్లలు కనడానికి భయపడే ఒక వ్యక్తి కథతో ఈ మూవీని తెరకెక్కించారు. ఎల్‌కేజీ, యూకేజీ చదువులకు ల‌క్ష‌ల రూపాయలు వసూలు చేస్తున్న ఈ కాలంలో ఒక మిడిల్ క్లాస్ యువకుడు త‌న‌కు పిల్ల‌లు పుడితే వారిని ఎలా పెంచాలి? ఎలా చ‌దివించాలి? అని ఆలోచిస్తాడు. ఈ కాలంలో పిల్ల‌ల‌ను పెంచ‌డం క‌ష్ట‌మ‌ని భావించి, అసలు పిల్లలే వద్దు అనుకుంటాడు. కానీ, తాను ప్రెగ్నెంట్ అయ్యానని  భార్య చెప్పడంతో షాక్ అవుతాడు. తాను వాడిన నాసిరకం కండోమ్ వ‌ల‌నే తన భార్య ప్రెగ్నెంట్ అయ్యిదంటూ  కండోమ్‌ ల‌ను స‌ప్ల‌య్ చేసే కంపెనీ పైనే కేసు పెడతాడు. ఇంతకీ ఈ కేసు తన జీవితాన్ని ఎటువైపు తీసుకెళ్లింది. మధ్య తరగతి యువకుడిగా సంసార జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాడు? అనేది ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.  

అక్టోబర్ 12న ప్రేక్షకుల ముందుకు ‘జనక అయితే గనక’

సుహాస్‌ హీరోగా తెరకెక్క ఈ సినిమాకు సందీప్‌రెడ్డి బండ్ల ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ‘బలగం’, ‘లవ్‌ మీ’ లాంటి సినిమాల తర్వాత దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ పతాకంపై హర్షిత్‌ రెడ్డి, హన్షిత నిర్మిస్తున్నారు. 'బేబి' ఫేమ్ విజయ్ బుల్గానిన్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్‌, కమెడియన్  వెన్నెల కిశోర్‌, మురళీ శర్మ, గోపరాజు రమణ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. దసరా కానుకగా  అక్టోబర్‌ 12న ఇది విడుదల కానుంది. ముందు రోజు రాత్రి పెయిడ్ ప్రీమియర్ షోలు వేస్తున్నారు.

అటు వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు నటుడు సుహాస్. ఈ ఏడాది ఆయన నటించిన ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’, ‘ప్రసన్న వదనం’, ‘శ్రీరంగ నీతులు’, ‘గొర్రె పురాణం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన నటన పట్ల ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు సరికొత్త కథాశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా సుహాస్ కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.  

Read Also: అమితాబ్ ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అయితే రజనీది లాస్ట్ బెంచ్ ‌- వేట్టయన్ దర్శకుడి సెన్సేషనల్ కామెంట్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Pushpa 2 Collection: కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
Rayachoti Issue: రాయచోటిలో అయ్యప్పభక్తులపై దాడి ఘటన కలకలం  - బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్
రాయచోటిలో అయ్యప్పభక్తులపై దాడి ఘటన కలకలం - బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్
Embed widget