'వేట్టయన్' నిండా స్టార్లే... ఎవరి క్యారెక్టర్ పేరేంటి? ఎవరి లుక్ ఎలా ఉంటుందో తెల్సా?

'వేట్టయన్' పాత్రలో సూపర్ స్టార్ రజనీకాంత్ టైటిల్ రోల్ చేశారు. ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా కనిపిస్తారు.

డీజీపీ సత్యదేవ్ బ్రహ్మదత్ పాండే పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించారు. 

'వెట్టయన్' భార్యగా తారా పాత్రలో హీరోయిన్ మంజూ వారియర్ కనిపించనున్నట్టు కోలీవుడ్ టాక్.

నటరాజ్ పాత్రలో ప్రతినాయకుడిగా రానా దగ్గుబాటి కనిపించనున్నారు.

మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఆయన పాట్రిక్ క్యారెక్టర్ చేశారు.

ధనుష్ 'రాయన్'లో చెల్లెలి పాత్ర చేసిన దుషారా విజయన్ గుర్తున్నారు కదా! ఆమె ఈ సినిమాలోనూ సిస్టర్ రోల్ చేసినట్టు టాక్. 

శ్వేతా పాత్రలో అభిరామి నటించారు. 

ఏఎస్పీ రూప పాత్రలో యంగ్ హీరోయిన్ రితికా సింగ్ నటించారు. 

డీజీపీ శ్రీనివాస్ పాత్రను తెలుగు నటుడు రావు రమేష్ పోషించారు. 

ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.

'వెట్టయన్' దర్శకుడు టీజే జ్ఞానవేల్ ఫోటో ఇది!