Kannappa Movie: 'కన్నప్ప' నుంచి నయనతార అవుట్? - ఆ స్టార్ హీరోయిన్‌ని లైన్లో పెట్టిన విష్ణు!
Kannappa Movie: 'కన్నప్ప' మూవీపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ కాస్ట్ చూస్తుంటే దిమ్మతిరిగిపోతుంది.

Kajal Aggarwal Joins in Kannappa Movie Sets: 'కన్నప్ప' (Kannappa Movie) మూవీపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ కాస్ట్ చూస్తుంటే దిమ్మతిరిగిపోతుంది. ప్రభాస్, అక్షయ్ కుమార్, నయనతార వంటి స్టార్స్ కన్నప్పలో నటించనున్నారంటూ మొన్నటి వరకు వార్తలు మాత్రమే విన్నాం. దీంతో అవన్ని రూమర్స్ అనుకున్నారు. కానీ ఈ రూమర్స్ కార్యరూపం దాలుస్తున్నాయి. ఒక్కొక్కరుగా సెట్‌లో అడుగుపెడుతున్నారు. ఇప్పటికే అక్షయ్ కుమార్ కన్నప్ప షూటింగ్‌లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. అక్షయ్ ఇందులో శివుడి పాత్రలో కనిపించనున్నాడని టాక్.
ప్రభాష్ రోల్ అదేనా?
ఇక ప్రభాస్ (Prabhas Role in Kannappa) సెట్‌లో అడుగుపెట్టడమే మిగిలి ఉంది. ఇందులో 'డార్లింగ్' నందీశ్వరుడిగా కనిపించనున్నాడని టాక్. ఇక కన్నప్పలో నయనతార కూడానటిస్తున్నట్టు ఇప్పటికే గట్టి ప్రచారం జరుగుతుంది. అయితే, ఇప్పుడు తెరపై మరో స్టార్ హీరోయిన్ పేరు కూడా వచ్చి చేరింది. 'కన్నప్ప'లో కాజల్ అగర్వాల్ కూడా నటిస్తుందంటూ తాజాగా ఓ అప్‌డేట్ బయటకు వచ్చింది. త్వరలోనే ఆమె షూటింగ్‌లో సెట్‌లో అడుగుపెట్టనుందని కూడా టాక్. ఇందులో కాజల్ అక్షయ్ కుమార్ సరసన పార్వతిగా నటిస్తుందని సమాచారం. అయితే నయనతారది ఇందులో పార్వతి రోల్ అన్నారు. అనుష్క శెట్టి పేరు కూడా వినిపించింది.
నయనతార స్థానంలో కాజలా?
కానీ, ఈ తాజా బజ్ ప్రకారం కాజల్ పార్వతి రోల్ అంటున్నారు. అంటే నయన్, అనుష్క స్థానంలో కాజల్ వచ్చిందా? లేక 'కన్నప్ప'లో వారు కూడా నటిస్తున్నారా? అన్నది క్లారిటీ లేదు. దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తున్న కన్నప్పలో విష్ణు లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ఈ సినిమాలో అతడి తండ్రి, విలక్షణ నటుడు మోహన్ బాబు కూడా ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారట. ఈ సినిమాలో మంచు వారసుడు, విష్ణు తనయుడి గ్రాండ్ ఎంట్రీ కూడా ఉండబోతుంది. కన్నప్పులో చిన్ననాటి విష్ణు పాత్రను అతడి తనయుడు అవ్రామ్ పోషిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ చిత్రంలో స్టార్ కాస్ట్ అంతా భాగం అవుతున్నట్టు ఇప్పటికే విష్ణు చెప్పిన సంగతి తెలిసిందే.
Also Read: సందీప్ రెడ్డి వంగా మాస్ - ఆ బాలీవుడ్ యాక్టర్‌కు ఇచ్చి పడేసిన దర్శకుడు
ప్రభాస్, మోహన్ లాల్, నయనతార, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, శివ రాజ్‌కుమార్, మధూ, దేవరాజ్, ప్రీతి ముకుందాన్ వంటి నటీనటులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బ్రహ్మానందం కూడా ఇందులో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. ఈ స్టార్ క్యాస్టింగ్‌ను చూసి ఇప్పటికే ప్రేక్షకులంతా అవాక్క్ అవుతున్నారు. ఈ క్రమంలో రీసెంట్‌గానే అక్షయ్ కుమార్ సెట్‌లో అడుగుపెట్టడం, ఇప్పుడు తెరపైకి కాజల్ అగర్వాల్ పేరు రావడంతో అంతా సర్‌ప్రైజ్ అవుతున్నారు. ఇలా రోజు రోజుకీ ‘కన్నప్ప’పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేలా ఏదోక అప్‌డేట్ బయటకు వస్తుండటంతో మెల్లిమెల్లిగా మూవీపై హైప్ పెరిగిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

