అన్వేషించండి

'భోళా శంకర్' కి రెమ్యునరేషన్ వద్దన్న చిరంజీవి - దానికి బదులుగా నిర్మాతలతో భారీ ఒప్పందం!

చిరంజీవి లేటెస్ట్ మూవీ 'భోళా శంకర్' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. ఈ సినిమాకి చిరంజీవి ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదట. దానికి బదులుగా లాభాల్లో వాటా అడిగినట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లోనే 'బోళాశంకర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సీనియర్ హీరో. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అదేంటంటే.. ఈ సినిమాకి చిరంజీవి ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని అంటున్నారు. ఈ సినిమా కోసం చిరు రెమ్యూనరేషన్ వద్దని చెప్పారట. మెగాస్టార్కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆయన ప్రతి సినిమాకు తీసుకునే రెమ్యూనరేషన్ గురించి ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో డిస్కషన్ నడుస్తుంది.

ఈ క్రమంలోనే తాజాగా 'భోళాశంకర్' సినిమా కోసం చిరంజీవి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. అయితే రెమ్యునరేషన్ కి బదులు సినిమా విడుదలైన తర్వాత లాభాల్లో షేర్ తీసుకుంటానని నిర్మాతలకు చెప్పారట చిరంజీవి. తన గత సినిమాల సక్సెస్ ని దృష్టిలో పెట్టుకొనే చిరు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి నటించిన చిత్రాలు 'గాడ్ ఫాదర్', 'వాల్తేరు వీరయ్య' బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని అందుకొని కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించాయి. ఇప్పుడు అదే సక్సెస్ ని కొనసాగించాలని చిరు ఈ డెసిషన్ తీసుకున్నట్లు చెబుతున్నారు. రెమ్యునరేషన్ అయితే ఫిక్స్డ్ శాలరీ లాగా తీసుకోవాలి. అదే షేర్ అయితే అలా కాదు. చిరంజీవి సినిమా కాబట్టి కలెక్షన్స్ అయితే ఓ రేంజ్ లో ఉంటాయి.

కాబట్టి షేర్ అయితే రెమ్యునరేషన్ కి మూడింతలు వస్తుంది. అంతకన్నా ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే మెగాస్టార్ చిరంజీవి'భోళా శంకర్' సినిమాకి రెమ్యూనరేషన్ కి బదులుగా లాభాల్లో వాటా తీసుకుంటానని నిర్మాతలతో డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమాపై ఎంతో నమ్మకం ఉండబట్టే  రిలీజ్ తర్వాత లాభాల వాటా తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట మెగాస్టార్. ఇక మరోవైపు 'భోళాశంకర్' సినిమాకి ఇప్పటికే భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా థియేటర్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు వార్తలు వినిపిస్తున్నా యి. అలాగే చిత్ర నిర్మాతలు ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని అప్పుడే అమ్మాలని అనుకోవడం లేదట.

సినిమా విడుదల అయిన తర్వాత ఆడియన్స్ రెస్పాన్స్ ని చూసి అప్పుడు పలు ఓటీటీ సంస్థలతో డీల్ కుదుర్చుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తమిళంలో అజిత్ నటించిన 'వేదాలం' అనే సూపర్ హిట్ మూవీకి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతోంది. అయితే మెగాస్టార్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకొని ఈ రీమేక్ లో దర్శకుడు కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. సినిమాలో మెగాస్టార్ కి జోడిగా తమన్నా హీరోయిన్గా నటించిన కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా కనిపించనుంది. హీరో సుశాంత్ మరో కీలకపాత్ర పోషిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.

Also Read : పవన్ కళ్యాణ్ 'బ్రో ' బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకుంటుందా?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Honda SP 125: ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Honda SP 125: ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Ram Gopal Varma: 'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
Smartphone Malware Removal: మీ స్మార్ట్ ఫోన్‌లో మాల్‌వేర్‌ ఉందా? - ఇలా చెక్ చేసి క్షణాల్లో తీసేయచ్చు!
మీ స్మార్ట్ ఫోన్‌లో మాల్‌వేర్‌ ఉందా? - ఇలా చెక్ చేసి క్షణాల్లో తీసేయచ్చు!
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Embed widget