By: ABP Desam | Updated at : 19 May 2023 09:20 PM (IST)
Photo Credit: Venkatesh Daggubati/ Instagram
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో 'సైంధవ్' అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హిట్ 2 సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న శైలేష్ కొలను విక్టరీ వెంకటేష్ తో సినిమా చేస్తాడని ఎవరు అనుకోలేదు. దీంతో ఈ క్రేజీ కాంబో పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉండబోతున్నట్లు ఇటీవల టీజర్ గ్లిమ్స్ వీడియోతో చెప్పకనే చెప్పారు మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలో వెంకటేష్ ని ఇప్పటివరకు మునుపెన్నడూ చూడని పాత్రలో డైరెక్టర్ శైలేష్ ఈ సినిమాలో చూపించబోతున్నాడు. హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ఉండబోతోంది.
అయితే ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర నటుడు నవాజుద్దీన్ సిద్ధిక్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే నవాజుద్దీన్ సిద్దిక్ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈరోజు అతని పుట్టిన రోజు సందర్భంగా తాజాగా ఈ సినిమా నుంచి నవాజుద్దీన్ సిద్ధిక్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీలో నమాజుద్దీన్ సిద్ధిక్ 'వికాస్ మాలిక్' అనే పాత్రలో కనిపించనున్నాడు. ఈ మేరకు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో నమాజుద్దీన్ లగ్జరీ కారుపై కూర్చుని, బీడీ తాగుతూ కనిపించాడు. పోస్టర్లో చూడడానికి క్లాస్ గా కనిపిస్తున్నా సినిమాలో మాత్రం అతను క్రూరమైన విలన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక విక్టరీ వెంకటేష్ కెరియర్లోనే 75వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తుండగా.. కిషోర్ తాళ్లూరు సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు.
Happy Birthday @Nawazuddin_S! Can't wait for the world to meet the fearsome Vikas Malik 🔥@KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh @maniDOP @vboyanapalli @NiharikaEnt pic.twitter.com/jyjjioUY5M
— Venkatesh Daggubati (@VenkyMama) May 19, 2023
ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రద్ధ శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. వీరిలో శ్రద్ధ శ్రీనాథ్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా, రుహాని శర్మ డాక్టర్ రేణు అనే పాత్రలో అలాగే ఆండ్రియా జాస్మిన్ పాత్రలో నటిస్తున్నారు. వెంకటేష్ కెరియర్ లోనే మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ తెరకెక్కుతోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న పాన్ ఇండియా లెవెల్ లో ఈ మూవీ విడుదల కామతోంది. ఈ సినిమాకి ఎస్. మణికందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తుండగా.. గ్యారీ బి.హెచ్ ఎడిటింగ్ బాధ్యతలు చేపడుతున్నారు. వెంకటేష్ కెరియర్ లోనే మొదటి పాన్ ఇండియా మూవీగా రాబోతున్న 'సైంధవ్' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.ఇక ఇటీవల విక్టరీ వెంకటేష్ 'రానా నాయుడు' అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రానా దగ్గుపాటి ఈ వెబ్ సిరీస్ లో మరో లీడ్ రోల్ చేశాడు. నెట్ ఫిక్స్ లో స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్నట్టు ఈ వెబ్ సిరీస్ కి సీజన్ 2 కూడా త్వరలో రాబోతోంది.
Also Read: Devara First Look: చేతిలో కత్తి, ఒంటి నిండా రక్తంతో ‘దేవర’గా వచ్చిన ఎన్టీఆర్ - ఫస్ట్‌లుక్ చూశారా?
Vimanam Movie Review - 'విమానం' రివ్యూ : ఏడిపించిన సముద్రఖని, వేశ్యగా అనసూయ - సినిమా ఎలా ఉందంటే?
రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసిన సమంత, ‘సిటాడెల్’ టీమ్ - ఇండియాలో కాదు
హీరో విజయ్ కీలక నిర్ణయం - ఆ విద్యార్థులకు సాయం
Ranbir Kapoor: రణబీర్ కపూర్ మంచి మనసు - వారికి 'ఆదిపురుష్' టికెట్లు ఫ్రీ!
Leo Movie: విజయ్ ‘లియో’లో కమల్ హాసన్ - లోకేష్ కనగరాజ్ కొత్త ప్లాన్?
Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం
Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?
CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు
Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం