Arya In Saindhav : 'సైంధవ్'లో ఆర్య - తెలుగు తెరకు ఎనిమిదేళ్ళ తర్వాత!
Venkatesh Daggubati - Saindhav Movie Update : వెంకటేష్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'సైంధవ్'. ఇందులో తమిళ హీరో ఆర్య కీలక పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు.
![Arya In Saindhav : 'సైంధవ్'లో ఆర్య - తెలుగు తెరకు ఎనిమిదేళ్ళ తర్వాత! Introducing Arya As Manas From Victory Venkatesh, Sailesh Kolanu's Saindhav movie, Here is First Look Arya In Saindhav : 'సైంధవ్'లో ఆర్య - తెలుగు తెరకు ఎనిమిదేళ్ళ తర్వాత!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/30/49ced1c7d79bb9eabf2ad6a626a5af121693402234640313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati) కథానాయకుడిగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా 'సైంధవ్' (Saindhav Movie). దీనికి శైలేష్ కొలను దర్శకుడు. 'హిట్', 'హిట్ 2' చిత్రాలతో విజయాలు తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిహారికా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. 'శ్యామ్ సింగ రాయ్' తర్వాత ఆయన ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే...
'సైంధవ్'లో తమిళ హీరో ఆర్య!
Arya As Manas in Saindhav : తమిళ కథానాయకుడు ఆర్య తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. ఆయన హీరోగా నటించిన 'రాజా రాణి' తెలుగులోనూ భారీ విజయం సాధించింది. ఇక, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'వరుడు'లో విలన్ రోల్ కూడా చేశారు. అనుష్క శెట్టి 'సైజ్ జీరో' సినిమాలోనూ నటించారు. 'సైంధవ్'లో ఆయన కూడా నటిస్తున్నట్లు ఈ రోజు వెల్లడించారు. ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఆర్య నటిస్తున్న స్ట్రెయిట్ తెలుగు చిత్రమిది.
'సైంధవ్'లో మానస్ పాత్రలో ఆర్య కనిపించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాలోని ఎనిమిది కీలక పాత్రల్లో ఆయనది ఓ పాత్ర అని చెప్పారు. ఆయన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. చేతిలో మెషిన్ గన్, స్టయిలిష్ డ్రస్సింగ్... ఆర్య లుక్ చాలా బావుంది. ఆయన పాత్ర చాలా శక్తిమంతంగా ఉంటుందని పేర్కొన్నారు.
Also Read : బాలయ్య వస్తే తీన్మార్ కాదు, సౌమార్ కొట్టాల్సిందే - 'భగవంత్ కేసరి' ఫస్ట్ సాంగ్ ప్రోమో చూశారా?
View this post on Instagram
క్రిస్మస్ కానుకగా సినిమా విడుదల
క్రిస్మస్ కానుకగా ఈ డిసెంబర్ 22న ఈ సినిమా విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. వెంకటేష్ 75వ చిత్రమిది. 'సైంధవ్' పతాక సన్నివేశాల చిత్రీకరణ ఇటీవల పూర్తి చేసినట్లు చిత్ర బృందం తెలియజేసింది. ''సుమారు పదహారు రోజుల పాటు కీలకమైన షెడ్యూల్ జరిగింది. ఎనిమిది మంది నటీనటులు పాల్గొనగా... హై - ఆక్టేన్ ఎమోషనల్ క్లైమాక్స్ చిత్రీకరించారు. రామ్ - లక్ష్మణ్ మాస్టర్స్ నేతృత్వంలో యాక్షన్ దృశ్యాలు తెరకెక్కించారు. వెంకటేష్ కెరీర్ చూస్తే... ఇప్పటి వరకు తీసిన క్లైమాక్స్‌లలో భారీ ఖర్చుతో తీసిన క్లైమాక్స్ ఇది'' అని చిత్ర బృందం పేర్కొంది.
Also Read : 'ఖుషి' ప్రీ రిలీజ్ డీటెయిల్స్ - విజయ్ దేవరకొండ ముందున్న టార్గెట్ ఎంత?
'సైంధవ్'లో అభినయానికి ఆస్కారమున్న మనోజ్ఞ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నట్లు దర్శక - నిర్మాతలు కొన్ని రోజుల క్రితం తెలిపారు. మూడేళ్ళ విరామం తర్వాత శ్రద్ధా శ్రీనాథ్ చేస్తున్న తెలుగు చిత్రమిది. వెంకటేష్ జోడీగా ఆవిడ కనిపించనున్నట్లు సమాచారం. శ్రద్ధా శ్రీనాథ్ కాకుండా ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. సుశాంత్ 'చిలసౌ', విశ్వక్ సేన్ 'హిట్' సినిమాల ఫేమ్ రుహానీ శర్మ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. మరో కీలక పాత్రలో ఆండ్రియా జెరెమియా నటిస్తున్నారు. రేణూ దేశాయ్ డాక్టర్ పాత్ర చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్ర చేస్తున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)