(Source: ECI/ABP News/ABP Majha)
Indian 2: హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
Indian 2 Telugu Pre Release Event: లోకనాయకుడు కమల్ హాసన్ కథానాయకుడిగా శంకర్ తెరకెక్కించిన 'భారతీయుడు 2' జూలై 12న విడుదల కానుంది. మరి, హైదరాబాద్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు చేస్తున్నారో తెలుసా?
Bharateeyudu 2 Pre Release Event: లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) కథానాయకుడిగా నటించిన సినిమా 'ఇండియన్ 2' (Indian 2 Movie). ఏపీ, తెలంగాణ - తెలుగు ప్రేక్షకుల ముందుకు 'భారతీయుడు 2'గా రానుంది. లెజెండరీ ఫిల్మ్ మేకర్ శంకర్ తీసిన చిత్రమిది. 28 ఏళ్ల క్రితం విడుదలైన 'భారతీయుడు' చిత్రానికి సీక్వెల్. చెన్నై వేదికగా ఆడియో లాంచ్ చేశారు. ఆ తర్వాత ముంబైలో భారీ ప్రెస్ మీట్ నిర్వహించారు. విదేశాల్లో (సింగపూర్) ఓ ఈవెంట్ చేశారు. మరి, హైదరాబాద్ సిటీలో? తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు నిర్వహిస్తున్నారో తెలుసా?
జూలై 7న 'భారతీయుడు 2' ప్రీ రిలీజ్ ఈవెంట్!
ఎస్... భారతీయుడు హైదరాబాద్ వస్తున్నాడు. ఈ ఆదివారం భాగ్యనగరంలో కమల్ హాసన్ సందడి చేయనున్నారు. జూలై 7న హైదరాబాద్ సిటీలో 'భారతీయుడు 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ డిసైడ్ అయ్యింది. కమల్ హాసన్ సహా సినిమాలో నటించిన ప్రధాన తారాగణం అంతా ఈ వేడుకకు రానున్నారు.
ముఖ్య అతిథిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వస్తారా?
'భారతీయుడు 2' ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కమల్ సినిమాతో పాటు చరణ్ హీరోగా 'గేమ్ ఛేంజర్'ను సైతం శంకర్ తెరకెక్కించారు.
'ఇండియన్ 2' తర్వాత శంకర్ నుంచి వచ్చే సినిమా 'గేమ్ ఛేంజర్'లో హీరో కావడం, తెలుగునాట సీడెడ్ ఏరియాలో 'భారతీయుడు 2'ను మెగా ఫ్యామిలీకి సన్నిహితులైన నిర్మాత ఎన్వీ ప్రసాద్ విడుదల చేస్తుండటంతో... ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా రామ్ చరణ్ రావచ్చని తెలుస్తోంది. అయితే... 'ఇండియన్ 2' యూనిట్ నుంచి ఇంకా ఎటువంటి సమాచారం లేదు.
Also Read: అల్లు హీరోతో నటించిన ఈ అందాల భామ ఎవరు, ఇంతకు ముందు ఏం చేసిందో తెలుసా?
జూలై 12న ప్రపంచవ్యాప్తంగా 'ఇండియన్ 2' విడుదల
Indian 2 Release Date 2024: లైకా ప్రొడక్షన్స్, రెడ్ జైంట్ మూవీస్ సంస్థలపై ఈ సినిమా రూపొందింది. లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మాత. తెలుగులో 'భారతీయుడు 2', తమిళంలో 'ఇండియన్ 2', హిందీలో 'హిందుస్థానీ' పేరుతో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున, అత్యధిక థియేటర్లలో విడుదల చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సోనీ మ్యూజిక్ ద్వారా ఈ సినిమా పాటలు విడుదల అయ్యాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
Also Read: ఈటీవీ విన్ ఓటీటీ కోసం నిర్మాతగా మారుతున్న దర్శకుడు... యేలేటి నుంచి వెబ్ సిరీస్, ట్విస్ట్ ఏమిటంటే?
కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో ఎస్‌జె సూర్య, ప్రియా భవానీ శంకర్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, నెడుముడి వేణు, వివేక్, కాళిదాస్ జయరాం, గుల్షన్ గ్రోవర్, సముద్రఖని, బాబీ సింహ, బ్రహ్మానందం, జాకీర్ హుస్సేన్ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. తెలుగులో ఈ చిత్రానికి హనుమాన్ చౌదరి మాటలు రాశారు.