Imanvi: కుర్చీ మడత పెట్టిన ప్రభాస్ హీరోయిన్ - తెలుగు పాటలకు ఇమాన్వీ సూపర్ స్టెప్స్
Prabhas Hanu Heroine Name: ప్రభాస్, హను రాఘవపూడి సినిమాలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, డ్యాన్సర్ ఇమాన్వీ నటించనుంది. ఆవిడ తెలుగు పాటలకు వేసిన సూపర్ స్టెప్స్ చూశారా?
![Imanvi: కుర్చీ మడత పెట్టిన ప్రభాస్ హీరోయిన్ - తెలుగు పాటలకు ఇమాన్వీ సూపర్ స్టెప్స్ Imanvi dance reels to Kurchi Madathapetti and Srivalli songs goes viral Imanvi: కుర్చీ మడత పెట్టిన ప్రభాస్ హీరోయిన్ - తెలుగు పాటలకు ఇమాన్వీ సూపర్ స్టెప్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/18/4a89e67e0b8b219f2552b92821ec15151723955385915313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఇమాన్వీ గురించి తెలుగు ప్రేక్షకులు విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ సరసన నటించే లక్కీ ఛాన్స్ అందుకున్నది ఎవరో తెలుసుకోవాలని చాలా ఆసక్తి చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కొంత మందికి ఆమె గురించి తెలుసు. ఒకవేళ ఆమె పేరు తెలియకపోయినా... ఏదో ఒక సమయంలో ఆవిడ చేసిన రీల్స్ చూసే ఉంటారు. అయితే... పాపులర్ తెలుగు పాటలకు ఇమాన్వీ రీల్స్ చేశారని తెలుసా?
కుర్చీ మడత పెట్టిన ఇమాన్వీ...
సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ తెరకెక్కించిన 'గుంటూరు కారం' సినిమాలో 'కుర్చీ మడత పెట్టి...' పాట ఎంత పాపులర్ అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పాటకు ప్రభాస్, హను రాఘవపూడి సినిమాలో హీరోయిన్ ఇమాన్వీ స్టెప్పులు వేశారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉంటున్న నిధి రెడ్డి (తెలుగు అమ్మాయి)తో కలిసి 'కుర్చీ మడత పెట్టి...' పాటకు రీల్ చేశారు ఇమాన్వీ.
View this post on Instagram
'కుర్చీ మడత పెట్టి...' పాటకు మాత్రమే కాదు... 'గుంటూరు కారం' సినిమాలో మెలోడీ సాంగ్ 'ఓ మై బేబీ' పాటకు కూడా నిధి రెడ్డితో కలిసి రీల్ చేశారు ఇమాన్వీ. 'పుష్ప' సినిమాలోని 'శ్రీవల్లి' హిందీ పాటకు సోలోగా రీల్ చేశారు. ప్రజెంట్ ఆ మూడు రీల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
View this post on Instagram
నువ్ కావాలయ్యా పాటకూ ఇమాన్వీ డ్యాన్స్!
హీరోయిన్లలో తమన్నా భాటియా అంటే ఇమాన్వీకి ఇష్టం అనుకుంట. సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్' సినిమాలో మిల్కీ బ్యూటీ చేసిన 'నువ్ కావాలయ్యా...' పాటకు ఆవిడ డ్యాన్స్ చేశారు. ఆ రీల్ సోషల్ మీడియాలో షేర్ చేసి, తమన్నా డ్యాన్స్ చేసిన తీరు నచ్చిందని, తానూ ఆ పాటకు డ్యాన్స్ చేసే ప్రయత్నం చేశానని పేర్కొన్నారు.
View this post on Instagram
ఇమాన్వీ పోస్టులకు ప్రభాస్ ఫ్యాన్స్ లైకులు!
ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇమాన్వీ ఫాలోయింగ్ గంట గంటకూ పెరుగుతోంది. హను రాఘవపూడి, ప్రభాస్ సినిమా ఓపెనింగ్ నుంచి ఇప్పటి వరకు చూస్తే... ఆల్మోస్ట్ 60 వేల మంది ఫాలోయర్లు పెరిగారు. అంతే కాదు... ఆవిడ పోస్టులకు ప్రభాస్ ఫ్యాన్స్ లైక్స్ కొడుతున్నారు. ఇమాన్వీ చేసిన డ్యాన్స్ రీల్స్ కింద కామెంట్స్ పెడుతున్నారు.
Also Read: నిర్మాతల చుట్టూ తిరిగిన రిషబ్... ఎయిర్ పోర్టులోనూ రిక్వెస్టులు... 'కాంతార' తెర వెనుక కహాని!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)