Ileana Son: ఇలియానా బాబు సో క్యూట్ - రెండో బిడ్డ పేరేంటో తెలుసా?
Ileana: ఇలియానా సోషల్ మీడియా వేదికగా తన రెండో బిడ్డను పరిచయం చేశారు. ఈ నెల 19న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఆమె బాబు ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేశారు.

Ileana Dcruz Introduced Second Child: ముద్దుగుమ్మ ఇలియానా మరోసారి తల్లయ్యారు. ఈ నెల 19న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. బాబుకు 'కియాను రఫే డోలన్' అని పేరు పెట్టారు. 'మా బిడ్డను పరిచయం చేస్తున్నందుకు మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి.' అంటూ రాసుకొచ్చారు.
చిన్నారి ఫోటో వైరల్ అవుతుండగా... పలువురు సెలబ్రిటీలు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. హీరోయిన్ ప్రియాంక చోప్రా ఆమెకు విషెష్ చెప్పారు. బాబు చాలా క్యూట్‌గా ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
Also Read: 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3 సర్‌ప్రైజ్ వచ్చేసింది - కొత్త శత్రువుతో వార్ షురూ...
2023 మేలో ఇలియానా తన ప్రియుడు మైఖేల్ డోలన్‌ను వివాహం చేసుకున్నారు. అదే ఏడాది ఆగస్టులో మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. ఆ బాబుకు 'కోవా ఫీనిక్స్ డోలన్' అని పేరు పెట్టారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ సమయంలో తన బేబీ బంప్ ఫోటోలను తరచూ షేర్ చేశారు. ఆ తర్వాత రెండోసారి గర్భం టైంలో మేలో ఒకేసారి మాత్రమే బేబీ బంప్ ఫోటోస్ పంచుకున్నారు. ఇప్పుడు ఏకంగా తన బిడ్డ ఫోటోను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
గతేడాది 2 హిందీ మూవీస్...
పెళ్లి తర్వాత ఇలియానా సినిమాలకు దూరమయ్యారు. 'దేవదాస్'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత పోకిరి, జులాయి, కిక్ సినిమాలతో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరయ్యారు. మాస్ మహారాజ రవితేజ నటించిన 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలో చివరిసారిగా కనిపించారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులు చేశారు. గతేడాది రెండు హిందీ సినిమాల్లో కనిపించారు. చివరిగా ' దో ఔర్ దో ప్యార్' సినిమాలో నటించారు. 'రైడ్ 2'లో ఆఫర్ వచ్చినప్పటికీ వదులుకున్నారు.
ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ, పిల్లలను చూసుకుంటున్నారు ఇలియానా. తన పెళ్లి, భర్త గురించి అప్పట్లో వచ్చిన విమర్శలపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. 'నన్నేమన్నా భరిస్తా... కానీ నా ఫ్యామిలీ మెంబర్స్‌ను ఏమైనా అంటే ఊరుకునేది లేదు.' అంటూ అప్పట్లో ఓ పోస్ట్ పెట్టగా వైరల్ అయ్యింది.






















