News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

మళ్ళీ ప్రభాస్ తో కలిసి నటిస్తారా? - డార్లింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్!

'చంద్రముఖి 2' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా 'ఏక్ నిరంజన్ 2' మూవీలో ఛాన్స్ వస్తే ప్రభాస్ పక్కన నటిస్తారా? అనే ప్రశ్నకి ఆసక్తికర సమాధానం ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్.

FOLLOW US: 
Share:

రాఘవ లారెన్స్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ జంటగా నటించిన తాజా చిత్రం 'చంద్రముఖి 2' సెప్టెంబర్ 28న థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలోనే మూవీ యూనిట్ వరుస ప్రమోషన్స్ ని ప్లాన్ చేస్తోంది. సెప్టెంబర్ 23న 'చంద్రముఖి 2' ప్రమోషన్స్ కోసం బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనోత్ హైదరాబాద్ కి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే ప్రభాస్ తో కలిసి ఏక్ నిరంజన్ 2 సినిమా చేసే అవకాశం వస్తే చేస్తారా? అనే ప్రశ్న కంగనకు ఎదురవగా, దీనికి ఆమె ఆసక్తికర సమాధానం చెప్పారు. అలాగే ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

2009లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఏక్ నిరంజన్' సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్గా నటించిన తర్వాత మళ్ళీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు. పూర్తిగా బాలీవుడ్ కే పరిమితమైంది. అయితే మళ్లీ చాలాకాలం తర్వాత సౌత్ మూవీ 'చంద్రముఖి 2' తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ రిపోర్టర్.. ఎక్ నిరంజన్ 2 సినిమా ఛాన్స్ వస్తే ప్రభాస్ పక్కన నటిస్తారా? అని అడిగితే, ప్రభాస్ తో కలిసి నటించేందుకు తాను ఎప్పుడూ ఇష్టపడతానని చెబుతూ డార్లింగ్ పై ప్రశంసల వర్షం కురిపించింది.

"ప్రభాస్ తో కలిసి పని చేసేందుకు ఇష్టపడతా. అతని సక్సెస్ పట్ల చాలా సంతోషిస్తున్నా. పాన్ ఇండియా స్టార్ గా ఆయన అద్భుతంగా ఎదిగారుమ్ మేము 'ఏక్ నిరంజన్' సినిమా చేసినప్పుడు మా వయసు చాలా తక్కువ . ప్రభాస్ చాలా యంగ్. ఆ సినిమా చేసే సమయంలో ప్రభాస్ చాలా గొప్పగా ఆతిధ్యం ఇచ్చారు. ఫామ్ హౌస్ లో మాకు అద్భుతమైన ఆహారం ఇచ్చారు. అతను చాలా దయాగుణం ఉన్న వ్యక్తి. మేము సెట్స్ లో చాలా సరదాగా గడిపాము. షూటింగ్లో మేమిద్దరం చాలా ఆట పట్టించుకునే వాళ్ళం కూడా. ఆప్యాయంగా ఉండే వాళ్ళం. ఇప్పుడు మళ్లీ ప్రభాస్ తో కలిసి పని చేసే అవకాశం వస్తే కచ్చితంగా చేస్తా. దానికంటే ముందు ప్రభాస్ ని కలవాలని అనుకుంటున్నా  ఎందుకంటే ఆయన్ని కలిసి దాదాపు 10 ఏళ్లు అవుతోంది. అతనితో నటించే ఆఫర్ వస్తే కచ్చితంగా చేస్తా. ఓ వ్యక్తిగా, నటుడిగా ఆయన ఎదిగిన తీరుని చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఆయనకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా" అంటూ చెప్పుకొచ్చింది కంగనా రనౌత్.

ఇక 'చంద్రముఖి 2' విషయానికి వస్తే.. 2005లో వచ్చిన రజనీకాంత్ 'చంద్రముఖి' సినిమాకి ఈ మూవీ సీక్వెల్ గా వస్తోంది. సుమారు 18 ఏళ్ల తర్వాత డైరెక్టర్ పి. వాసు ఈ సినిమాని తెరకెక్కించారు. ఎం. ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ ని అందుకోడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచాయి. సెప్టెంబర్ 28న తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తో మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు రాఘవ లారెన్స్. దీంతో వీళ్లిద్దరి జంటని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఆడియన్స్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Also Read : మరో బాలీవుడ్ ఆఫర్ అందుకున్న పూజా హెగ్డే - మొదటిసారి ఆ స్టార్ హీరోతో రొమాన్స్?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 24 Sep 2023 05:07 PM (IST) Tags: Kangana Ranaut Prabhas Acctress Kangana Ranaut Kangana Ranaut About Prbhas Bollywood Acctress Kangana Ranaut

ఇవి కూడా చూడండి

Aishwarya Abhishek Bachchan: అభిషేక్, ఐశ్వర్య విడాకులు తీసుకోనున్నారా? అమితాబ్ బచ్చన్ పోస్ట్‌కు అర్థం ఏమిటీ?

Aishwarya Abhishek Bachchan: అభిషేక్, ఐశ్వర్య విడాకులు తీసుకోనున్నారా? అమితాబ్ బచ్చన్ పోస్ట్‌కు అర్థం ఏమిటీ?

Tripti Dimri: నా తల్లిదండ్రులు అలా అన్నారు - ‘యానిమల్’లోని ఇంటిమేట్ సీన్స్‌కు పేరెంట్స్ రియాక్షన్ బయటపెట్టిన తృప్తి

Tripti Dimri: నా తల్లిదండ్రులు అలా అన్నారు - ‘యానిమల్’లోని ఇంటిమేట్ సీన్స్‌కు పేరెంట్స్ రియాక్షన్ బయటపెట్టిన తృప్తి

Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య

Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Devil Movie: ‘డెవిల్’ కోసం కళ్యాణ్‌రామ్‌కు 90 స్పెషల్ కాస్ట్యూమ్స్‌ - ఇటలీ నుంచి తెప్పిన మోహైర్ ఊల్‌తో!

Devil Movie: ‘డెవిల్’ కోసం కళ్యాణ్‌రామ్‌కు 90 స్పెషల్ కాస్ట్యూమ్స్‌ - ఇటలీ నుంచి తెప్పిన మోహైర్ ఊల్‌తో!

టాప్ స్టోరీస్

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి-  మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

మూడు వేల కిలోమీటర్ల మైలురాయి చేరిన లోకేష్ పాదయాత్ర- 20న భోగాపురంలో ముగింపు సభ

మూడు వేల కిలోమీటర్ల మైలురాయి చేరిన లోకేష్ పాదయాత్ర- 20న భోగాపురంలో ముగింపు సభ

Jharkhand CM: జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు - ఆరోసారి సమన్లు పంపిన అధికారులు

Jharkhand CM: జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు - ఆరోసారి సమన్లు పంపిన అధికారులు