అన్వేషించండి

Sukumar: ‘ఆర్య’ సినిమాకు బన్నీ వద్దు, ఆ హీరో‌ను తీసుకుందామని దిల్ రాజు చెప్పారు: దర్శకుడు సుకుమార్

అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెంచిన సినిమా ’ఆర్య’. తాజాగా ఈ మూవీ 20 ఏళ్ల వేడుక జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న దర్శకుడు సుకుమార్, అసలు ఈ సినిమా హీరోగా ప్రభాస్ ను తీసుకోవాలని దిల్ రాజు చెప్పారన్నారు.

Director Sukumar About ‘Arya’ Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు సాలిడ్ హిట్ అందించిన సినిమా ‘ఆర్య’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా అను మెహతా హీరోయిన్‌గా ఈ సినిమా తెరకెక్కింది. శివ బాలాజీ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ మే 7, 2004లో విడుదలై సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఒకే అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమించే, ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా యువతను ఓ రేంజిలో ఆకట్టుకుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ అద్భుతంగా అలరించింది. అప్పట్లో ఈ సినిమా 100 రోజులకు పైగా ఆడి సంచలనం సృష్టించింది. తెలుగులో అప్పటి వరకు ఉన్న రికార్డులను బద్దలు కొడుతూ ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, చిత్రబృందం ‘ఆర్య 20 ఏళ్ల వేడుక’ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్‌, 'దిల్‌' రాజు, డైరెక్టర్‌ సుకుమార్‌, అల్లు అర్జున్‌ సహా చిత్రబృందం హాజరైంది.   

‘ఆర్య’ హీరోగా ప్రభాస్ ను తీసుకోవాలన్నారు- సుకుమార్

ఈ వేడుకలో మాట్లాడిన దర్శకుడు సుకుమార్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమాలో హీరోగా బన్నీని ఎలా సెలెక్ట్ చేశారో చెప్పారు. ‘ఆర్య’ సినిమా కోసం హీరోగా మొదట ప్రభాస్ ని తీసుకుందామని దిల్ రాజు చెబితే.. తాను మాత్రం అల్లు అర్జున్ కావాలని అడిగానన్నారు. ‘ఆర్య’ సినిమాకు బన్నీ హీరోగా తీసుకోవాలి అనుకున్నప్పుడు, దిల్ రాజు అతడిని చూసి ఇంట్రెస్ట్ చూపించలేదన్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్ ఏంటి ఇలా ఉంది అనుకున్నారని చెప్పారు. “’ఆర్య’ సినిమాలో హీరోగా ప్రభాస్ అయితే బాగుంటుందని దిల్ రాజు గారు చెప్పారు. ఆయనకు కథ చెప్పమన్నారు. నేను ప్రభాస్ తో చెప్పాను. ప్రభాస్.. రాజు గారు ఈ కథ చెప్పమన్నారు. కానీ, ఎందుకో నీకు కరెక్ట్ కాదు అనిపిస్తుంది అన్నాను. నేను కథ చెప్పాక విని ప్రభాస్, నువ్ చెప్పింది కరెక్టే అన్నారు. ఆ తర్వాత రాత్రి 12 గంటల సమయంలో నేను, రాజు గారు బన్నీకి కథ చెప్పడానికి వెళ్లాం. మమ్మల్ని చూసి ఇప్పటికే 71 కథలు విన్నాం. ఈ కథ వింటే నా గుండె 72వ సారి కొట్టుకోకుండా ఆగిపోతుంది అన్నాడు బన్నీ. వెంటనే రాజు గారు కంగారు పడి ఇతడే కథ చెప్పేది అని నన్ను చూపించాడు. కంగారుపడకు నీ గుండె నేను కాపాడుతాను అన్నాను” అని చెప్పానన్నారు సుకుమార్. అలా ఈ సినిమాకు హీరోగా అల్లు అర్జున్ ను సెలెక్ట్ చేసినట్లు తెలిపారు.

విడుదలకు రెడీ అవుతున్న ‘పుష్ప 2’

సుకుమార్, బన్నీ కాంబోలో తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇటీవ‌లే పుష్ప 2 నుంచి ఫ‌స్ట్ సాంగ్ రీలీజ‌య్యి రికార్డుల మోత మోగించింది. ‘పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్..’ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టుకుంది. త్వరలోనే రెండో పాట విడుదల కానున్నట్లు టాక్ విపిపిస్తోంది.

Read Also: వాళ్లకే మా ఓటు.. బలహీనవర్గాల ఎంటర్‌టైన్మెంట్‌పై కక్ష ఎందుకు? - ‘ఆయ్’ మూవీలో ఫన్నీగా హరి పాత్ర

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Tirumala News: తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
Bigg Boss Rohini: రోహిణి దెబ్బకు మారిన బిగ్ బాస్ లెక్కలు... శివంగిలా ఆడుతూ టాప్ 5 లిస్టులోకి Jabardasth లేడీ
రోహిణి దెబ్బకు మారిన బిగ్ బాస్ లెక్కలు... శివంగిలా ఆడుతూ టాప్ 5 లిస్టులోకి Jabardasth లేడీ
Telangana: మేం అలా చేసి ఉంటే చర్లపల్లి జైల్లో చిప్పకూడు తింటూడేవాడివి - కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ ఫైర్ !
మేం అలా చేసి ఉంటే చర్లపల్లి జైల్లో చిప్పకూడు తింటూడేవాడివి - కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ ఫైర్ !
Mirai Audio Rights: హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
Embed widget