Priyamani: ఆంటీ ఏంట్రా? నేను చాలా హాట్, నోరు మూసుకో - నెటిజన్‌కు ప్రియమణి షాకింగ్ రిప్లై
తనను ‘ఆంటీ‘ అని పిలిచిన ఓ నెటిజన్ కు నటి ప్రియమణి గట్టి సమాధానం చెప్పింది. నా వయసు 38 ఏండ్లు అయినా, ఇంకా హాట్ గానే ఉన్నాను, నోరు మూసుకో అంటూ కౌంటర్ ఇచ్చింది.
గత కొంత కాలంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ సంస్కృతి పెరిగిపోయింది. పెళ్లైన హీరోయిన్లు, నటీమణులపై దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ‘ఆంటీ’ మొదలుకొని బూతు పదాలు ఉపయోగిస్తూ, వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. గత కొంతకాలంగా యాంకర్ అనసూయ కూడా ఇలాంటి కామెంట్స్ ఎదుర్కొన్నది. ‘అనసూయ ఆంటీ’ అంటూ ఆమెను నిత్యం వేధించేవారు ఆకతాయిలు. ఆమె కూడా అంతే ఘాటుగా ట్రోలర్స్ కు సమాధానం చెప్పేది. అయినా, కొంత మంది ఆమెపై అదేపనిగా ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది.
‘ఆంటీ’ అని పిలిచిన నెటిజన్ కు ప్రియమణి కౌంటర్
తాజాగా నటి ప్రియమణి విషయంలోనూ కొందరు నెటిజన్లు ‘ఆంటీ’ అని కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు ‘బ్లాక్ ఆంటీ’ అంటూ తరచుగా నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా ‘ఆంటీ’ అని కామెంట్ చేసిన ఓ నెటిజన్ కు గట్టి కౌంటర్ ఇచ్చింది ప్రియమణి. “ప్రస్తుతం నా వయసు 38 ఏళ్లు. అయినా హాట్ గానే ఉన్నాను. ఇక నోరు మూసుకో” అంటూ సమాధానం చెప్పింది. ఇలాంటి కామెంట్స్ ను తాను పాజిటివ్ గా తీసుకుంటానని వెల్లడించింది. “నన్ను ఆంటీ అని కామెంట్ చేయటంలో ఎలాంటి తప్పు లేదు. ఎలాంటి అభ్యంతరం లేకుండా నన్ను ఆంటీ అని పిలవచ్చు. వయసు పెరిగితే సిగ్గు పడాల్సిన అవసరం లేదు. వయసు పెరగడం అనేది సహజ సిద్ధంగా జరిగే పక్రియ”అని చెప్పుకొచ్చింది. ప్రియమణి పాజిటివ్ స్పందనపై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అందరిలా కాకుండా కొత్తగా ఆలోచించడం బాగుందంటున్నారు. నెగిటివ్ కామెంట్లను కూడా పాజిటివ్ తీసుకోవటం ఆమెలోని గొప్పతనం అంటున్నారు. ఇలాంటి ధైర్యం అందరిలో ఉండదని చెప్తున్నారు.
తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ప్రియమణి
ఇక ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు అందిరితో కలిసి నటించింది ప్రియమణి. చక్కటి నటనా ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో చేసి అద్భుత గుర్తింపు తెచ్చుకుంది. అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ అందరినీ అలరించింది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ఆ తర్వాత ముస్తఫా అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్న ప్రియమణి, కొద్ది కాలం పాటు సినిమాలకు దూరం అయ్యింది. ఆ తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ లో మిడిల్ క్లాస్ వైఫ్ గా నటించి ఆకట్టుకుంది. అటు బుల్లితెరపై జడ్జిగానూ వ్యవహరిస్తోంది. పలు సందర్భాల్లో తనకు ఎదురైన బాడీ షేమింగ్ గురించి వివరించే ప్రయత్నం చేసింది. కొంతకాలం క్రితం బరువు పెరగడంతో చాలా మంది తనను ‘బ్లాక్ ఆంటీ’ అని హేళన చేసేవారని గుర్తు చేసింది. మొదట్లో ఈ కామెంట్స్ తనను బాధ పెట్టాయని, ఆ తర్వాత వాటిని పట్టించుకోవడం మానేశానని చెప్పుకొచ్చింది. తాజాగా ప్రియమణి ‘జవాన్’ చిత్రంలో నటించింది. షారుఖ్ కు సాయం చేసే ఆరుగురు అమ్మాయిల్లో ప్రియమణి ఒకరుగా కనిపించారు. ఈ చిత్రంలో ఆమె నటనకు చక్కటి గుర్తింపు లభించింది.
Read Also: అట్లీపై నయనతార అసంతృప్తి, అసలు కారణం దీపికేనా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial