Hit 3 Twitter Review: హిట్ 3 ట్విట్టర్ రివ్యూ: కొరియన్ సిరీస్ కాపీ... స్క్రీన్ మీద బ్లడ్ బాత్, విపరీతమైన వయలెన్స్... సోషల్ మీడియాలో నాని సినిమా టాకేంటి?
Hit 3 Movie Twitter Review: నాని కెరీర్‌లో మోస్ట్ వయలెంట్ ఫిలిం హిట్ 3 అంటున్నారు ఎన్ఆర్ఐలు. అమెరికాలో సినిమా ప్రీమియర్ షోలు పూర్తి అయ్యాయి. అక్కడి నుంచి వచ్చిన ట్విట్టర్ రివ్యూస్ ఎలా ఉన్నాయో చూడండి.

అమెరికాలో 'హిట్ 3' (Hit 3) ప్రీమియర్ షోలు పూర్తి అయ్యాయి. తెలుగు ఎన్ఆర్ఐ ఆడియన్స్ సినిమా చూశారు. న్యాచురల్ స్టార్ నాని కెరీర్‌లో 'హిట్ 3' మోస్ట్ వయలెంట్ సినిమా అంటున్నారు. పిల్లలను సినిమాకు తీసుకు వెళ్ళకూడదని నాని చెప్పిన మాటలు అక్షర సత్యం అని చెబుతున్నారు. అసలు సినిమా ఎలా ఉంది? సోషల్ మీడియాలో టాక్ ఏంటి? అనేది చూస్తే...
వయలెంట్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్!
'హిట్ 3' ఒక వయలెంట్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ అని అమెరికాలో సినిమా చూసిన నెటిజన్ ఒకరు తెలిపారు. స్క్రీన్ మీద కొన్ని మూమెంట్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయని, అదే సమయంలో రొటీన్ సీన్స్ కూడా కొన్ని ఉన్నాయని వివరించారు.
నటనలో అదరగొట్టిన నాని... ఇంకా!
నటుడిగా నాని మరొకసారి అదరగొట్టాడని ప్రీమియర్ షోలు చూసిన ఆడియన్స్ చెబుతున్నారు. అవుట్ అండ్ అవుట్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో తన పర్ఫామెన్స్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా నాని నటించారని ప్రశంసలు లభిస్తున్నాయి.
యావరేజ్ ఫస్టాఫ్... ఇక క్లైమాక్స్ సూపర్!
సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాని పాత్రను పరిచయం చేసిన తీరు బావుందని అయితే ఆ తరువాత ప్రీ ఇంటర్వెల్ ట్విస్ట్ వరకు ఈ మూవీ సాదాసీదాగా సాగుతుందని నెటిజన్స్ ట్వీట్లు చేస్తున్నారు.
Also Read: భాగ్యశ్రీతో విజయ్ దేవరకొండ లిప్ లాక్... పాట కంటే ప్రోమోలో ముద్దు గురించే డిస్కషన్
ఇంటర్వెల్ తర్వాత సినిమా మొత్తం సౌత్ కొరియన్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' స్ఫూర్తితో తీసినట్లు అర్థం అవుతుందని ప్రతి ఒక్కరూ చెప్పే మాట. అయితే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ పోర్షన్స్ మాత్రం వర్కౌట్ అయ్యాయట.
శైలేష్ కొలను దర్శకత్వంపై మిక్స్డ్ టాక్!
నాని నటన, సినిమాలో యాక్షన్ సన్నీ వేశాల గురించి ఎక్కువ చెబుతున్న ఆడియన్స్... దర్శకుడు శైలేష్ కొలను విషయానికి వచ్చేసరికి పెదవి విరుస్తున్నారు. ఆయన రాసిన కథలో ఇంట్రెస్టింగ్ పాయింట్ లేదని చెబుతున్నారు. సెకండాఫ్ అంతా 'స్క్విడ్ గేమ్' సిరీస్ కాపీ చేసి రాసిన ఆయన... చాలా సన్నివేశాలలో రైటింగ్ పరంగా అప్ టు ది మార్క్ ఇవ్వలేదని విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో ప్రతి సన్నివేశంలో ఒక డిస్ట్రక్టివ్ ఇమేజ్ తీసుకురావడంలో సక్సెస్ అయ్యారని అంటున్నారు. 'హిట్ 3' ట్విట్టర్ రివ్యూలను ఒకసారి చూడండి.
Also Read: శివయ్యా... ఆ డైలాగ్ తీసేశాం - విష్ణు మంచు & 'కన్నప్ప' టీంకు సారీ చెప్పిన శ్రీ విష్ణు
#HIT3 #HIT3Review
— Karthik (@meet_tk) April 30, 2025
RAW..BLOODY..🎯🎯🎯🎯
Not for family audiences or kids. What an actor @NameisNani . He is growing as multitalented, big box office star. Best of #Nani movie I have ever watched. Totally new experience 👏🏼👏🏼
Strictly NO Kids ⛔️⛔️
***BLOCKBUSTER***
Over expectations petkokunda velandi
— Hemanth😎 (@hemanthviru) April 30, 2025
Nani paina Barosa tho velandi
Too much violence anipinchachu, but still
Ramp adinchadu🔥Nani🔥❤️
One man show#HIT3 #Nani @NameisNani @PrathyangiraUS https://t.co/vgAsNnsyrO
#Hit3 is a very violent action crime thriller that has moments that work well but at the same time portions that are too run of the mill and narrated on the slower side.
— Venky Reviews (@venkyreviews) April 30, 2025
The first half is pretty average and predictable till the pre-interval which starts to engage. The second…
3.5/5 💥💥💥💥
— Filmupdates (@film_updatez) April 30, 2025
Final review guys bomma blockbuster anthey last 20min was freaking blood bath anthey.
Evdu edhi chepina vinakandi 2nd half will be the answer💥🔥🔥#HIT3#HIT3FromMay1st #HIT4 #Nani @NameisNani 💥@SrinidhiShetty7 @KolanuSailesh @walpostercinema @tprashantii pic.twitter.com/3Kw8um2njx
Done with my show,engaging 2nd half. CTK final act episode will be the standout episode..!! Nani killed his role effortlessly. Mickey's music is good..!! Cameos are whistle worthy but doesn't serve it's purpose. 2.5/5 #HIT3
— Peter Reviews (@urstrulyPeter) April 30, 2025
తెలుగు మాస్ ప్రేక్షకులకు నచ్చుతుందా?
హాలీవుడ్ సినిమాలు చూసే ప్రేక్షకులకు, వెస్ట్రన్ ఫిలిమ్స్ రైటింగ్ స్టైల్ మెచ్చే జనాలకు 'హిట్ 3' నచ్చుతుందని ఓవర్సీస్ నుంచి ఎర్లీ రిపోర్ట్స్ వస్తున్నాయి. తెలుగు మాస్ ప్రేక్షకులకు సెకండాఫ్ మీద కంప్లైంట్స్ ఉండొచ్చట. వాళ్లు డిస్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఓవరాల్‌గా సినిమాకు అబౌవ్ యావరేజ్ నుంచి హిట్ టాక్ లభించింది. అమెరికా ప్రీమియర్ షోస్ నుంచి టాక్ బాగా వచ్చింది. మరి తెలుగు రాష్ట్రాలలో రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.





















