HIT 3 Box Office Collections Day 3: రూ.100 కోట్లకు చేరువలో 'హిట్ 3' - 3 రోజుల్లోనే రికార్డు కలెక్షన్లు
HIT 3 Collections Day 3: నాని 'హిట్ 3' బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. 3 రోజుల్లోనే రూ.82 కోట్ల వసూళ్లు రాబట్టింది. వీకెండ్ కావడంతో ఆదివారం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరే ఛాన్స్ ఉంది.

Nani's HIT 3 Box Office Collections Reached 100 Crores Club: నేచురల్ స్టార్ నాని (Nani) 'హిట్ 3'తో (HIT 3) భారీ హిట్ కొట్టారు. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తూ.. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది మూవీ. అతి త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరనుంది.
3 రోజుల్లోనే రికార్డు కలెక్షన్లు
శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం వహించిన 'హిట్ 3' మూవీ మే 1న గురువారం ప్రేక్షకుల ముందుకు రాగా.. 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.82 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. వీకెండ్ ఆదివారం కావడంతో ఈ రోజు రూ.100 కోట్ల మార్క్ దాటి కలెక్షన్లు రాబట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఫస్ట్ డే రూ.43 కోట్లకు పైగా కలెక్షన్లు రాగా.. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీగా రికార్డులకెక్కింది. ఇక రెండో రోజు కూడా రూ.20 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా.. తాజాగా రూ.82 కోట్లకు రీచ్ అయ్యింది. ఇక రూ.100 కోట్ల క్లబ్‌లో రీచ్ కావడమే పెండింగ్. ఈ జోష్‌తో దర్శక, నిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్, చిన్న పిల్లలు ఈ సినిమాకు రావొద్దని మూవీ టీం ముందే హెచ్చరించింది. ఈ క్రమంలో తొలి 2 రోజుల్లో థియేటర్ల మాస్ యూత్ ఆడియన్స్ హవా ఎక్కువగా కనిపించింది.
82+ CRORES GROSS WORLDWIDE for #HIT3 in 3 days ❤🔥
— Wall Poster Cinema (@walpostercinema) May 4, 2025
It's SARKAAR SHOW at the box office 💥💥
Book your tickets now!
🎟️ https://t.co/8HrBsV0jIt
A sensational Sunday loading with massive bookings all over. #BoxOfficeKaSarkaar pic.twitter.com/dsRvH3lpFG
Also Read: స్టైల్ స్టైల్‌గా ఐకాన్ స్టార్ - అట్లీ మూవీ కోసం ఎన్టీఆర్, మహేష్ బాబు ఫిట్‌నెస్ ట్రైనర్
పవర్ ప్యాక్ట్ వయలెన్స్.. మాస్ ఎంటర్ టైనర్
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాని అదరగొట్టారు. మాస్ యాక్షన్, వయలెన్స్‌తో మూవీ సెకండాఫ్ మొత్త బ్లడ్ బాత్‌లానే కనిపిస్తుంది. అందుకే చిన్న పిల్లలు ఈ సినిమాకు దూరంగా ఉండాలని మేకర్స్ మొదటి నుంచీ చెప్తూ వచ్చారు. నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి తిపిర్నేని ఈ మూవీని నిర్మించారు. నాని సరసన కేజీఎఫ్ ఫేం 'శ్రీనిధి శెట్టి' నటించగా.. రావు రమేష్, కోమలీ ప్రసాద్, సూర్య శ్రీనివాస్ ఇతర కీలక పాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించారు.
ఫ్యామిలీ ఆడియన్స్ కూడా..
గత రెండు రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నామని.. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు క్యూ కడుతున్నారని డైరెక్టర్ శైలేష్ కొలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ముఖ్యంగా లేడీస్‌కు నాని క్యారెక్టర్ నచ్చడం సర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తుందన్నారు. డిఫరెంట్ రోల్, మాస్ లుక్ చూసేందుకు ఎక్కువగా వస్తున్నారని అనుకుంటున్నామన్నారు. ఆడియన్స్ రెస్పాన్స్ అద్భుతంగా ఉందంటూ శైలేష్ ఆనందం వ్యక్తం చేశారు.





















