Poorna: భార్యకు దూరంగా ఉన్నానంటూ హీరోయిన్ భర్త ఎమోషనల్ పోస్ట్! నెటిజన్లకు స్పెషల్ రిక్వెస్ట్!
Poorna Shanid Asifali: 45 రోజులు ఒంటరితనం భరించలేకపోయాను. ఈ పోస్ట్ పై ఎలాంటి ప్రచారాలు చేయకండి .. మేం ఇద్దరం సంతోషంగా ఉన్నాం అంటూ పూర్ణ భర్త పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

Poorna: హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ సాగిస్తోన్న పూర్ణ తన భర్త నుంచి విడాకులు తీసుకుంటోందనే ప్రచారం జరిగింది.ఆమె భర్త సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ఈ ప్రచారానికి దారితీసింది. ఈ న్యూస్ వైరల్ అవడంతో ఆయన వెంటనే స్పందించి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇదంతా ప్రేమ మాత్రమే..తప్పుడు ప్రచారం చేయకండి..ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాం అంటూ ఫొటోస్ తో పాటూ మరో పోస్ట్ పెట్టారు పూర్ణ భర్త షానిద్ అసిఫ్ అలీ.
పూర్ణ భర్త షానిగ్ అసిఫ్ అలీ రీసెంట్ గా భావోద్వేగంతో ఓ పోస్ట్ పెట్టారు. 45 రోజులుగా తన భార్య దూరంగా ఉందని , ఒంటరితనం భరించలేకపోతున్నాను అన్నది ఆ సారాంశం. నా జీవితంలో ఈ 45 రోజులు మర్చిపోలేను..నీ జ్ఞాపకాలతో గడిపేయాల్సి వచ్చింది..ప్రతి ఉదయం నిన్ను తలుచుకుని భావోద్వేగానికి గురయ్యేవాడిని..మనం ప్రేమించిన వారు మనతో ఉండడమే ఈ జీవితానికి పెద్ద వరం. ఈ నెలన్నర రోజుల్లో నీ ప్రేమ గొప్పతనం తెలిసొచ్చిందని రాసుకొచ్చారు. అంతే ఈ పోస్ట్ చూడగానే నెటిజన్లు విజృంభించారు. ఇద్దరి మధ్యా ఏదో జరిగింది, అందుకే విడిపోయారు, దూరంగా ఉన్నారని వైరల్ చేసేశారు. తాను ప్రేమను వ్యక్తం చేస్తే ఇలా జరిగిందేంటని అవాక్కైన షానిద్ వెంటనే స్పందించి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇదంతా ప్రేమ మాత్రమే..తన భార్య తనదగ్గరకు వచ్చేసింది..ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాం, విడాకుల వార్తలు ప్రచారం మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు.
పెళ్లి జరిగిన తర్వాత నా భార్య నాకు దూరంగా 45 రోజులు ఉండడం ఇదే ఫస్ట్ టైమ్. అందుకే అంతలా మిస్సయ్యానని పోస్ట్ లో పెట్టారు షానిద్. దయచేసి తప్పుగా అర్థం చేసుకుని లేనిపోనివి కల్పించి రాయొద్దన్నారు.మా వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతోందంటూ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు.
2022లో షానిద్ అసిఫ్ అలీని పెళ్లి చేసుకున్నారు పూర్ణ. వీరికి 2023లో బాబు పుట్టాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్న పూర్ణ....రీసెంట్ గా 20 రోజులు చెన్నైలో, 15 రోజులు మలప్పురంలో, ఆ తర్వాత రజనీకాంత్ జైలర్ 2 మూవీ షూటింగ్ కోసం వెళ్లారు. ఓవరాల్ గా 45 రోజుల పాటూ షూటింగ్ పర్పస్ తో తనకు దూరంగా ఉంది అన్నది పూర్ణ భర్త పెట్టిన పోస్ట్ వెనుకున్న ఆంతర్యం. కానీ మూడు రోజుల క్రితం పెట్టిన ఆ పోస్ట్ ని నెటిజన్లు వేేరేలా అర్థం చేసుకోవడంతో మరో పోస్ట్ తో క్లారిటీ ఇచ్చారు షానిద్.
రవిబాబు అవును సినిమాతో పాపులర్ అయిన పూర్ణ.. సీమటపాకాయ్, అఖండ, దసరా చిత్రాలతో గుర్తింపు పొందారు. మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన గుంటూరుకారం సినిమాలో కుర్చీ మడతపెట్టి సాంగ్ లో మెరిసారు పూర్ణ.
View this post on Instagram
View this post on Instagram






















