మాస్ కా దాస్ 'ఫ్యామిలీ ధమాకా' - ‘ఆహా’లో హోస్ట్ అవతారమెత్తిన విశ్వక్ సేన్!
తెలుగు ఓటీటీ 'ఆహా'లో త్వరలో 'ఫ్యామిలీ ధమాకా' అనే గేమ్ షో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హోస్టుగా వ్యవహరించనున్నారు.
సినిమాలతో కాకుండా తన రియల్ లైఫ్ యాటిట్యూడ్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విశ్వక్.. వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చున్నాడు. నటుడిగానే కాకుండా నిర్మాతగా, స్కిప్ట్ రైటర్ గా, డైరెక్టర్ గా సత్తా చాటుతూ మల్టీటాలెంటెడ్ అనిపించుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు హోస్ట్ అవతారం ఎత్తాడు విశ్వక్.
100% తెలుగు కంటెంట్ తో తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్న 'ఆహా' ఓటీటీ.. 'ఫ్యామిలీ ధమాకా' అనే పేరుతో సరికొత్త గేమ్ షోకి శ్రీకారం చుట్టింది. దీనికి విశ్వక్ సేన్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఇండిపెండెన్స్ డేని పురస్కరించుకుని నిర్వాహకులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ''ఇక చూస్తున్నారుగా.. 'ఫ్యామిలీ ధమాకా' మాస్ కా దాస్ ఇలాకా!! ఇది మాస్ కా దాస్ ఆడించే ఫ్యామిలీ ఆట.. అతి త్వరలోనే రాబోతోంది'' అని 'ఆహా' టీమ్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ప్రోమోని రిలీజ్ చేసారు.
ఈ ప్రోమోలో ''అందరికీ నమస్తే.. వెల్ కమ్ టూ మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫ్యామిలీ షో 'ఫ్యామిలీ ధమాకా'.. ఇది దాస్ ఇలాకా'' అంటూ విశ్వక్ సేన్ తనదైన శైలిలో హోస్టుగా తనకి తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. 'ఇది గ్లోబల్ సూపర్ హిట్ ఫ్యామిలీ గేమ్ షో.. త్వరలో మన తెలుగు కుటుంబాలలో చేరబోతోంది' అని ఈ వీడియోలో పేర్కొన్నారు. అయితే ఈ గేమ్ షో కాన్సెప్ట్ ఏంటి?.. ఎన్ని ఎపిసోడ్స్ గా స్ట్రీమింగ్ కానుందనేది వెల్లడించలేదు.
ika chustharuga....
— ahavideoin (@ahavideoIN) August 15, 2023
'ఫ్యామిలీ ధమాకా' మాస్ కా దాస్ ఇలాకా!!
Ee maas ka Dass aadinche Family aata..!👨👩👦👦🙅🏻♂️👨👨👧👦
Coming soon on aha👉 #FamilyDhamakaOnAHA Coming Soon! @VishwakSenActor @rsbrothersindia @KhiladiOfficia3 @sprite_india @lalithaajewels @fremantle_india pic.twitter.com/PiccvEEX8Y
'ఆహా' ఓటీటీ ఇంతకముందు నటసింహం నందమూరి బాలకృష్ణని హోస్టుగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ అనే సెలబ్రిటీ టాక్ షోతో బాలయ్య డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. అలానే స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభుతో 'సామ్ జామ్' అనే టాక్ షోని నిర్వహించారు. ఈ క్రమంలో ఇప్పుడు 'ఫ్యామిలీ ధమాకా' గేమ్ షోతో విశ్వక్ సేన్ ను వ్యాఖ్యాతగా తీసుకొస్తున్నారు. మరి హోస్టుగా విశ్వక్ ఎలా ఆకట్టుకుంటారో, ఈ కార్యక్రమం ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో వేచి చూడాలి.
కాగా, 'పిట్టకథ' అనే షార్ట్ ఫిలింలో నటించిన విశ్వక్ సేన్.. 'వెళ్ళిపోమాకే' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసాడు. ఆ తర్వాత 'ఈ నగరానికి ఏమైంది' యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. 'ఫలక్ నుమా దాస్' చిత్రంతో డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గా సక్సెస్ అందుకున్నాడు. ఇక హీరో నాని నిర్మాణంలో చేసిన 'హిట్' మూవీ అతన్ని మరో మెట్టు ఎక్కించింది. అప్పటి నుంచి రిజల్ట్ తో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో 'పాగల్', 'అశోకవనంలో అర్జున కళ్యాణం', 'ఓరి దేవుడా', 'దాస్ కా ధమ్కీ' చిత్రాలతో అలరించాడు. విశ్వక్ ప్రస్తుతం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' తో పాటుగా VS10 సినిమాలలో నటిస్తున్నారు.
Also Read: అజీత్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసింది చిరంజీవే - ఇప్పుడు అతడి రీమేక్ మూవీలో!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial