Kodi Burra: క్లైమాక్స్‌కు చేరుకున్న ‘కోడి బుర్ర‘ షూటింగ్... క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శ్రీరామ్
Hero Sriram Latest Movie: హీరో శ్రీరామ్ లాంగ్ గ్యాప్ తర్వాత ‘కోడి బుర్ర‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకుంది.
Kodi Burra Movie Shooting: శ్రీరామ్ హీరోగా చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘కోడి బుర్ర‘. ‘అల్లుకున్న కథ‘ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్నది. ఈ సినిమాను వీ4 క్రియేషన్స్ బ్యానర్ లో కంచర్ల సత్యనారాయణరెడ్డి, గట్టు విజయ్ గౌడ్, చిన్ని చందు, వట్టం రాఘవేంద్ర, సముద్రాల మహేశ్ గౌడ్ నిర్మిస్తున్నారు. శృతి మీనన్, ఆరుషి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ‘కోడి బుర్ర‘ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్నది. ఈ షెడ్యూల్ భారీ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారు. ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయంటున్నారు మేకర్స్. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ వెల్లడించారు. ఈ మూవీకి సంబంధించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
ఈ కథ మీ చుట్టూ జరుగుతున్నట్లే ఉంటుంది- శ్రీరామ్
‘కోడి బుర్ర’ సినిమా కథ ప్రతి ఒక్కరి చుట్టూనే జరుగుతున్నట్లు అనిపిస్తుందని హీరో శ్రీరామ్ వెల్లడించారు. “’కోడి బుర్ర’ సినిమా క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం. ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్సులు తెరకెక్కిస్తున్నారు. చాలా ఫాస్ట్ గా మూవీ షూటింగ్ చేస్తున్నాం. మా మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. కథలో ఎన్నో మలుపులు ఉంటాయి. వాటిని ఇప్పుడే రివీల్ చేస్తే మీకు థ్రిల్ పోతుంది. అందుకే థియేటర్ లోనే ఈ సినిమా చూడండి. ఈ రోజుల్లో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా వచ్చే మూవీస్ సక్సెస్ అవుతున్నాయి. ఈ సినిమా కథ మీ చుట్టూ జరుగుతున్నట్లే ఉంటుంది. చాలా రియలిస్టిక్ మూవీ. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది” అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా ఒక మంచి థ్రిల్లర్ గా అందరికీ ఆకట్టుకుందని హీరోయిన్ ఆరుషి వెల్లడించింది.
త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం- దర్శకుడు చంద్రశేఖర్
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుందని దర్శకుడు చంద్రశేఖర్ కానూరి వెల్లడించారు. “ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ చేస్తున్నాం. భారీ క్లైమాక్స్ సన్నివేశాలు రూపొందిస్తున్నాం. ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ మూవీకి హైలెట్ గా నిలవనుంది. సినిమాను కంప్లీట్ చేసి త్వరలోనే మీ ముందుకు థియేట్రికల్ రిలీజ్ ద్వారా తీసుకొస్తాం” అని వెల్లడించారు.
ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటుంది- నిర్మాతలు
‘కోడి బుర్ర’ సినిమా ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటుందని నిర్మాతలు కంచర్ల సత్యనారాయణరెడ్డి, గట్టు విజయ్ గౌడ్, చిన్ని చందు, వట్టం రాఘవేంద్ర, సముద్రాల మహేశ్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఫైటర్స్, స్టంట్ మాస్టర్స్ క్లైమాక్స్ ను అద్భుతంగా రూపొందిస్తున్నట్లు తెలిపారు. హీరో శ్రీరామ్ కు థ్యాంక్స్ చెప్పారు.
ఇక ఈ సినిమాలో ఆనంద్, జెమిని సురేష్, జబర్దస్త్ రాంప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కల్యాణ్ శ్యామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సుకుమార్ రాగ సంగీతం అందిస్తున్నారు. ఎడిటర్ గా గ్యారీ బీ హెచ్ పని చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.
Read Also: తృటిలో ప్రాణాలతో బయటపడ్డ ఇమ్రాన్ హష్మీ... ‘గూఢచారి 2’ సెట్‌లో ప్రమాదం - ఇప్పుడు ఎలా ఉన్నారంటే?