అన్వేషించండి

Nikhil Siddhartha: కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ - తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను

Nikhil Siddhartha: హీరో నిఖిల్‌ తన కొడుకు పేరు చెప్పేశాడు. రీసెంట్‌గా ఓ మూవీ కార్యక్రమంలో పాల్గొన్న అతడు తండ్రిని అయ్యాక తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయన్నాడు.

Nikhil Siddhartha Said His Son name and Life Changes After Father: యంగ్‌ నిఖిల్‌ సిద్దార్థ ఇటీవల తండ్రైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో అతడి భార్య మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇంతవరకు కొడుకును కానీ, బాబు పేరు కానీ పరిచయం చేయలేదు. అయితే ఈ రీసెంట్‌గా ఓ ఈవెంట్లో పాల్గొన్న నిఖిల్‌ బాబు పేరుతో పాటు తండ్రైన తర్వాత తనలో వచ్చిన మార్పు గురించి చెప్పుకొచ్చాడు. తన కుమారుడి కోసం కొన్ని అలవాట్లు మార్చుకున్నానని, సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఖాళీ సమయాన్ని కుటుంబానికే కెటాయిస్తున్నానన్నాడు. 

ఈ మేరకు నిఖిల్‌ మాట్లాడుతూ.. "బాబు పుట్టాక ఎక్కువ సమయంలో తనతోనే కేటాయిస్తున్నాను. మా అబ్బాయి పేరు ధీర సిద్ధార్త్‌. తండ్రిగా బాబు బాధ్యతను పంచుకుంటున్నాను. ఎక్కువ సమయం వాడితోనే గడపుతున్నాను. వాడు పుట్టాక నా అలవాట్లు కొన్నింటిని మార్చుకున్నాను. వారానికి కనీసం ఒక్కసారైనా పార్టీకి వెళ్లడం నాకు అలవాటు. కానీ ఇప్పుడు పూర్తిగా వెళ్లడం మానేశాను. తల్లిదండ్రులు అయ్యాక పిల్లల కోసం కొన్నిటిని వదులుకోవాల్సి వస్తుంది. పిల్లల్ని మంచి వాతావరణంలో పెంచాలంటే కొన్నిటికి దూరంగా ఉండాలి. ఇలా మార్పు వచ్చినా నేను సంతోషంగానే ఉన్నాను. భర్తగా, తండ్రిగా ఇలా అన్ని రకాలుగా ఆనందంగానే ఉన్నాను. నా జీవితం ఇలా ఉంటుందని కొన్నెళ్ల క్రితమే ఎవరైనా చెప్పిఉంటే ఇన్ని సంవత్సరాలు ఇంత ఒత్తిడికి గురయ్యేవాడినే కాదు" అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా చివరిగా నిఖిల్‌ స్పై మూవీతో పలకరించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన మూవీ మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకున్న కలెక్షన్స్‌ మాత్రం బాగానే చేసింది. ఇప్పుడు నిఖిల్‌ 'స్వయంభు'లో మూవీతో బిజీగా ఉన్నాడు. పాన్‌ ఇండియాగా వస్తున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటుంది. భరత్‌ క్రష్ణమాచారి దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంయుక్తా మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. నభానటేష్‌ సెకండ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో ఆమె ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఇక పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో నిఖిల్‌ ఓ యోధుడిగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రం కోసం అతడు ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు. మార్షల్‌ ఆర్ట్స్‌, గుర్రపు స్వారీల్లో ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడు. కాగా నిఖిల్ నటించిన తొలి చిత్రం హ్యాపీ డేస్  ఇప్పుడు రీరిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. రేపు ఏప్రిల్ 19న ఈ మూవీ మరోసారి థియేటర్లో సందడి చేయబోతుంది. 

Also Read: 'కన్నప్ప' నుంచి నయనతార అవుట్‌? - ఆ స్టార్‌ హీరోయిన్‌ని లైన్లో పెట్టిన విష్ణు!

టాప్ హెడ్ లైన్స్

Pawan Anna Konidela Divorce : పవన్ కల్యాణ్ అన్నా కొణిదెల డివోర్స్ - ఆమె బ్యాగ్రౌండ్, ఆస్తుల విలువ ఎంతంటే?
పవన్ కల్యాణ్ అన్నా కొణిదెల డివోర్స్ - ఆమె బ్యాగ్రౌండ్, ఆస్తుల విలువ ఎంతంటే?
DNK Trailer Review : DNK ట్రైలర్ రివ్యూ - తుంటరి కొడుకుతో పేరెంట్స్ ఇబ్బందులు... మరోసారి నవ్వులు పూయించిన మౌళి
DNK ట్రైలర్ రివ్యూ - తుంటరి కొడుకుతో పేరెంట్స్ ఇబ్బందులు... మరోసారి నవ్వులు పూయించిన మౌళి
Itlu Arjuna First Review : 'ఇట్లు అర్జున'పై కింగ్ నాగార్జున ఫస్ట్ రివ్యూ - డెబ్యూ సినిమాలో అనీష్ నటన అద్భుతమంటూ ప్రశంసలు
'ఇట్లు అర్జున'పై కింగ్ నాగార్జున ఫస్ట్ రివ్యూ - డెబ్యూ సినిమాలో అనీష్ నటన అద్భుతమంటూ ప్రశంసలు
Renu Desai Reaction : అందుకే ఆ రోజు నేను సైలెంట్‌గా ఉన్నా - రేణూ దేశాయ్ స్ట్రాంగ్ రియాక్షన్
అందుకే ఆ రోజు నేను సైలెంట్‌గా ఉన్నా - రేణూ దేశాయ్ స్ట్రాంగ్ రియాక్షన్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PRC ఆలస్యం..ఉద్యోగుల్లో అసంతృప్తి.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి!
PRC ఆలస్యం..ఉద్యోగుల్లో అసంతృప్తి.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి!
YSRCP On Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయవద్దు: క్యాడర్‌కు వైసీపీ అధినేత ఆదేశాలు
పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయవద్దు: క్యాడర్‌కు వైసీపీ అధినేత ఆదేశాలు
KA Paul: నేను ఆ పని చేస్తే వారం రోజుల్లోగా రేవంత్ రెడ్డి సీఎం పదవి పోతుంది: కేఏ పాల్ సంచలనం
నేను ఆ పని చేస్తే వారం రోజుల్లోగా రేవంత్ రెడ్డి సీఎం పదవి పోతుంది: కేఏ పాల్ సంచలనం
Makhana Benefits : రోజూ మఖానా తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే.. డైట్‌లో ఇలా చేర్చుకోండి
రోజూ మఖానా తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే.. డైట్‌లో ఇలా చేర్చుకోండి
Pawan Kalyan Divorce: పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకుల ప్రకటన ఇప్పుడు ఎందుకు చేశారంటే !
పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకుల ప్రకటన ఇప్పుడు ఎందుకు చేశారంటే !
Car Engine Problems: మిస్‌ఫైరింగ్ నుంచి 'చెక్ ఇంజిన్' లైట్ వరకు.. ఇంజిన్‌కు ప్రమాదం తెచ్చే 3 సమస్యలు ఇవే
కారు ఇంజిన్‌లో ఈ 3 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. సర్వీస్ సెంటర్‌కు మాత్రమే వెళ్లండి
Weight Loss Recipe : బరువు తగ్గాలనుకునేవారి నోరూరించే టేస్టీ రెసిపీ.. పనీర్, వెజిటెబుల్స్​తో ఈ రైస్ ట్రై చేయండి
బరువు తగ్గాలనుకునేవారి నోరూరించే టేస్టీ రెసిపీ.. పనీర్, వెజిటెబుల్స్​తో ఈ రైస్ ట్రై చేయండి
Congress Politics: 9 సార్లు ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా చిన్నారెడ్డి! అసలేం జరుగుతోంది?
9 సార్లు ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా చిన్నారెడ్డి! అసలేం జరుగుతోంది?
Embed widget