Ayodhya Ram Mandir: రామ మందిరం ప్రారంభోత్సవం.. వెండితెరపై అలరించిన శ్రీరాముని పాటలు ఇవే!
Ayodhya Ram Mandir : ఈ సందర్భంగా దేశమంత రామమయం అయ్యింది. నేటి 'ఆదిపురుష్' నుంచి నాటి 'సంపూర్ణ రామయణం' వరకు అన్ని రాముని ఔదార్యాన్ని చాటాయి. మరోసారి వెండితెరపై అలరించిన శ్రీరాముడు పాటలు ఓసారి చూద్దాం!
Ayodhya Ram Mandir: మరో రెండు రోజుల్లో అయోధ్యలో రామ మందిరం ప్రాణప్రతిష్ఠ జరగనుంది. దీంతో దేశమంత రామమయం అయిపోయింది. అయోధ్యలో శ్రీరామ మందిరం అనేది.. కోట్లాది మంది భారతీయుల కల. ఆ కల నెరవేరేందుకు ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. యావత్ భారత దేశం ఎదురుచూస్తున్న రామ మందిర ప్రారంభోత్సవానికి.. అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. రాముడు కదలాడిని ఆ పుణ్యభూమి ఇకపై రామ మందిరంతో కళకళలాడనుంది. జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామ మందిరాన్ని ప్రారంభించనున్నారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు.. సినీ, రాజకియ ప్రముఖులు భారీ సంఖ్యలో పాల్గొననున్నారు.
ఇప్పటికే రామమందిరం ప్రారంభోత్సవానికి ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. భారీ బందోబస్తు, ఏర్పాట్ల మధ్య అయోధ్య సిద్ధమవుతుంది. రంగు రంగుల దీపాలాంకరణతో రామమందిరం ముస్తాబైంది. ఇంకా రెండు రోజులే ఉండటంతో అక్కడ ఇప్పటికే బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్టించారు ఆలయ అధికారులు. ఈ క్రమంలో అంతా అయోధ్య గురించే మాట్లాడుకుంటున్నారు. అయోధ్యలో రామమందిరం ఏర్పాట్లు జరుగుతుంటే దేశ నలమూలలో రాముడి సందడి నెలకొంది. ఈ సందర్భంగా వెండితెరపై అలరించిన శ్రీరాముడి పాటలు, సినిమాలు సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి. నేటి 'ఆదిపురుష్' నుంచి నాటి 'సంపూర్ణ రామయణం' వరకు అన్ని రాముని ఔదార్యాన్ని చాటాయి. మరి మరోసారి వెండితెరపై అలరించిన శ్రీరాముడి పాటలు ఓసారి చూద్దాం!
ఆదిపురుష్
స్టార్ హీరో ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ 'ఆదిపురుష్'. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించిన ఈ సినిమాను విడుదలైనప్పటి నుంచి కొన్ని వివాదాలు చూట్టుముట్టాయి. కానీ ఇందులో పాటలకు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా రామ్ సీతా రామ్ పాటకు ఎంతో ఆదరణ దక్కింది. సచేత్-పరంపర స్వరపరించిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్ర సాహిత్యం అందించారు. సింగర్స్ కార్తిక్, సచేత్, పరంపలు ఆలపించారు. "హో ఓ, ఆదియు అంతము రామునిలోనే.. మా అనుబంధము రామునితోనే.. ఆప్తుడు బంధువు అన్నియు తానే.. అలకలు పలుకులు ఆతనితోనే.. సీతారాముల పున్నమిలోనే ఏ ఏ.. నిరతము మా ఎద వెన్నెలలోనే" అంటూ సాగే ఈ పాట యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ సాధించింది.
శ్రీరామరాజ్యం
నందమూరి బాలకృష్ణ-నయనతార నటించిన ఈ చిత్రం 2011 నవంబరు 17 న విడుదలైంది. తెలుగు పౌరాణిక చిత్రంగా తెరకెక్కిన ఇందులో బాలయ్య శ్రీరామునిగా, నయనతార సీతా నటించారు. బాపు దర్శకత్వంలో యలమంచిలి సాయిబాబా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలోని పాటలన్ని బాగా ఆకట్టుకోగా అందులో రాముని గొప్పతనాన్ని జగదానంద కారకా..జయ జానకీ ప్రాణనాయకా ప్రతిఒక్కరి హృదయాలను తట్టింది. ఈ పాటకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజ సంగీతం అందించారు. "జగదానంద కారకా..జయ జానకీ ప్రాణనాయకా..శుభస్వాగతం ప్రియ పరిపాలకా" అంటూ సాగే ఈ పాటను లెజెండరి సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం, శ్రేయ ఘోషల్ ఆలపించారు.
శ్రీరామదాసు
నాగార్జున అక్కినేని-స్నేహ జంటగా నటించిన ఈ చిత్రం 2006లో విడులైంది. కె. రాఘవేంద్రరావు ఈ సినిమాను తెరకెక్కించారు. శ్రీరామ భక్తిరస చిత్రంగా వచ్చిన ఈ సినిమాలోని అంతా రామయం పాట బాగా అలరించింది. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈపాటను ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడారు.
సంపూర్ణ రామాయణం
శోభన్ బాబు ... శ్రీరాముడిగా, చంద్రకళ ... సీతగా, ఎస్వీ రంగారావు ... రావణుడుగా నటించిన ఈ చిత్రం 1971 విడుదలైంది. బాపు దర్శకత్వం వహించిన ఈ పౌరాణిక చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించిన. ఈ సినిమాకు కేవీ మహదేవన్ అందించిన సంగీతం అందరిని ఆకట్టుకుంది. ఇందులో రామయ తండ్రి ఓ రామయ తండ్రి మా నోముల పండినాయి పాట అప్పుట్లో మంచి విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి ఈ పాట మీ కోసం.
లవకుశ
రాముడి సినిమా అనగానే అందరికి మొదట గుర్తొచ్చేది లవకుశ సినిమానే. సీనియర్ ఎన్టీఆర్ శ్రీరాముడిగా, అంజలి దేవి సీత నటించిన ఈ సినిమాలో ఇప్పటికి ఎవర్ గ్రీన్‌గా అనడంతో సందేహం లేదు. సి.పుల్లయ్య, ఆయన కుమారుడు సి.ఎస్.రావు దర్శకులుగా, లలితా శివజ్యోతి పిక్చర్స్ పతాకంపై శంకరరెడ్డి ఈ సినిమాను నిర్మించారు. సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు, కేవీ మహదేవన్. ఈ సినిమాలోని ‘జయ జయ రామా శ్రీరామ’ పాటను ఇక్కడ వినండి. గానం రాఘవులు,సరోజిని బృందం - రచన: సదాశివబ్రహ్మం
దేవుళ్లు
దేవుళ్ళు 2000 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన ఒక భక్తి రసాత్మక చిత్రం. ఇందులో పృథ్వీరాజ్, రాశి, మాస్టర్ నందన్, బేబీ నిత్య ప్రధాన పాత్రలు పోషించారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అందరి బంధువయ్యా పాట ద్వారా శ్రీరాముడు గురించి వివరించారు. ఈ పాటలో రాజేంద్ర ప్రసాద్ నటించారు. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య అంటూ సాగే ఈపాట ఇక్కడ మరోసారి వినండి!
రామాలయం
జగ్గయ్య, శోభన్ బాబు, జమున ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈసినిమా 1971లో విడుదలైంది. కె బాబురావు దర్శకత్వం వహించినన ఈ సినిమాను కె.ఏ ప్రభాకర్ నిర్మించారు. ఇందులో జగదభి రామ పాటను ఇక్కడ వినండి.
సీతారామ కళ్యాణం
సీనియర్ ఎన్టీఆర్, హరినాథ్, గీతాంజలి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు ఎన్. త్రివిక్రమ్ రావు దర్శకత్వం వహించారు. నేషనల్ ఆర్ట్స్ థియేటర్ నిర్మించిన ఈ సినిమాలోని శ్రీ సీతారాముల కళ్యాణం పాట ఇప్పటికి వినిపిస్తూనే ఉంది. శ్రీరాముని వేడుకలు, పెళ్లిళ్లలో ఈ పాటను బాగా వినిపిస్తుంది. అలాంటి ఈ పాట రామమందిరం ప్రారంభోత్సవ సందర్భంగా మరోసారి ఇక్కడ వినండి.