News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Ustaad Bhagat Singh : నువ్వేం చేయగలవు చెప్పు - 'ఉస్తాద్' దర్శకుడు హరీష్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్!

Harish Shankar reply on Ustaad Bhagat Singh comments : 'ఉస్తాద్ భగత్ సింగ్' గురించి సోషల్ మీడియాలో ఓ నెటిజన్ కామెంట్ చేశారు. దానికి హరీష్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

FOLLOW US: 
Share:

అభిమానులు & ప్రేక్షకులకు చేరువ కావడానికి, తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించడానికి సెలబ్రిటీలు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. ఒక్కోసారి ఆ సోషల్ మీడియా వల్ల అకారణంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. నిజానిజాలు తెలియకుండా సినీ ప్రముఖులపై కొందరు నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. ఓ నెటిజన్ (Netizen Comments On Ustaad Bhagat Singh) ఆ విధంగా 'ఉస్తాద్ భగత్ సింగ్' మీద కామెంట్ చేయగా... దర్శకుడు హరీష్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసలు వివరాల్లోకి వెళితే... 

'ఉస్తాద్...'లో క్వాలిటీనా?
ఆ దేవుడి మీద భారం వేశాం!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh). ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ 'గబ్బర్ సింగ్' తర్వాత వాళ్ళిద్దరి కలయికలో తెరకెక్కుతున్న సినిమా ఇది. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అయితే... సినిమాలో ఎంత పర్సెంట్ తీశారు? ఇంకా ఎంత తీయాలి? అనేది ఎవరు చెప్పలేదు. ఓ నెటిజన్ మాత్రం కామెంట్ చేసేశారు. 

వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ హరీష్ శంకర్ ఓ పోస్ట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్ కింద ''ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ 50 పర్సెంట్ కంప్లీట్ అయ్యింది అంట కదా అన్నా! ఇంక క్వాలిటీ ఆ? ఆ దేవుడి మీదే భారం వేశాం'' అని రిప్లై ఇచ్చాడు. అతడికి హరీష్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Also Read : మహేష్, చరణ్ నవ్వులు... అరవింద్, అశ్వినీదత్, దిల్ రాజు ముచ్చట్లు - ఏఎన్నార్ విగ్రహావిష్కరణలో స్టార్స్

నువ్వు ఏం చేయగలవు చెప్పు?
స్టడీస్, కెరీర్ మీద కాన్సంట్రేట్ చెయ్!
''అంతే కదా తమ్ముడు! అంతకు మించి నువ్వు ఏం చేయగలవు చెప్పు? ఈలోగా కాస్త స్టడీస్, జాబ్, కెరీర్ మీద ఫోకస్ పెట్టు. వాటిని మాత్రం దేవుడికి వదిలేయకు. ఆల్ ది బెస్ట్'' అని హరీష్ శంకర్ ట్వీట్ చేశారు. అందుకు మరో పవన్ కళ్యాణ్ అభిమాని ''కెరీర్ పోతే పోనీ! మాకు 'ఉస్తాద్ భగత్ సింగ్' ముఖ్యం. ఇంకో 'గబ్బర్ సింగ్' లాంటి హిట్ ఇవ్వు అన్నా'' అని రిక్వెస్ట్ చేయగా... ''ఐ విల్ ట్రై మై బెస్ట్ బ్రో'' అని హరీష్ శంకర్ రిప్లై ఇచ్చారు. అదీ సంగతి!

Also Read నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ నుంచి సుప్రియ, సుమంత్ వరకు... అక్కినేని విగ్రహావిష్కరణలో ఏయన్నార్ కుటుంబ సభ్యులు

'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాన్ని ప్రస్తుతం తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకరైన మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన శ్రీ లీల ఓ కథానాయిక. మరో కథానాయికగా అఖిల్ అక్కినేని 'ఏజెంట్', వరుణ్ తేజ్ 'గాండీవధారి అర్జున' సినిమాల ఫేమ్ సాక్షి వైద్య నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' కాకుండా సుజీత్ దర్శకత్వంలో 'ఓజీ', క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' సినిమాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్ళూరి నిర్మించే సినిమా కూడా చేయాల్సి ఉంది.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 20 Sep 2023 12:59 PM (IST) Tags: Harish Shankar Pawan Kalyan latest telugu news Ustaad Bhagat Singh movie Netizen Comments

ఇవి కూడా చూడండి

Animal Review - యానిమల్ ఆడియన్స్ రివ్యూ: ఓపెనింగ్ సీన్ నుంచి అటెన్షన్ షురూ - బ్లాక్ బస్టర్ టాక్

Animal Review - యానిమల్ ఆడియన్స్ రివ్యూ: ఓపెనింగ్ సీన్ నుంచి అటెన్షన్ షురూ - బ్లాక్ బస్టర్ టాక్

Vijay Rashmika: ఒకే తరహా డ్రెస్‌లో రష్మిక, విజయ్ దేవరకొండ - దొరికిపోయారుగా!

Vijay Rashmika: ఒకే తరహా డ్రెస్‌లో రష్మిక, విజయ్ దేవరకొండ - దొరికిపోయారుగా!

The Goat Life Release Date: ఎడారి దేశంలో భారతీయ కూలీ కష్టాలు - మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సినిమా విడుదలకు రెడీ!

The Goat Life Release Date: ఎడారి దేశంలో భారతీయ కూలీ కష్టాలు - మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సినిమా విడుదలకు రెడీ!

ఫ్రీగా ‘సలార్’ టికెట్లు, ‘కాలింగ్ సహస్ర’కు థియేటర్ల కరువు - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఫ్రీగా ‘సలార్’ టికెట్లు, ‘కాలింగ్ సహస్ర’కు థియేటర్ల కరువు - నేటి టాప్ సినీ విశేషాలివే!

Allu Arjun: విడివిడిగా ఓటు వేసిన అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహ - వేర్వేరుగా వెళ్లడంతో...

Allu Arjun: విడివిడిగా ఓటు వేసిన అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహ - వేర్వేరుగా వెళ్లడంతో...

టాప్ స్టోరీస్

Telangana Elections 2023 : తెలంగాణలో హంగ్ వస్తే బీఆర్ఎస్ పార్టీతో కలిసేదెవరు ? - బీజేపీనా ? మజ్లిస్ పార్టీనా ?

Telangana Elections 2023 :  తెలంగాణలో హంగ్ వస్తే బీఆర్ఎస్ పార్టీతో కలిసేదెవరు ? -  బీజేపీనా ? మజ్లిస్ పార్టీనా ?

Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో కాస్త తగ్గిన చలి, ఏపీకి మాత్రం వర్ష సూచన!

Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో కాస్త తగ్గిన చలి, ఏపీకి మాత్రం వర్ష సూచన!

Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?

Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?

Screen Effect on Children : మీ పిల్లలు టీవీ, ఫోన్లకు అలవాటు పడిపోతున్నారా? అది చాలా ప్రమాదం, ఇలా చేస్తే మేలు

Screen Effect on Children : మీ పిల్లలు టీవీ, ఫోన్లకు అలవాటు పడిపోతున్నారా? అది చాలా ప్రమాదం, ఇలా చేస్తే మేలు