Hari Hara Veera Mallu Premiere Collection: వీరమల్లు ప్రీమియర్ షోస్ కలెక్షన్స్... పవన్ స్టార్‌డమ్ ఎన్ని కోట్లు తెచ్చిందంటే?
Hari Hara Veera Mallu Box Office Collection: ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో హరిహర వీరమల్లు ప్రీమియర్ షోలు పడ్డాయి. అలాగే అమెరికాలోనూ ప్రీమియర్స్ వేశారు. వాటి ద్వారా ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Premiere Shows Collection Of HHVM: 'హరి హర వీరమల్లు ప్రీమియర్ షోస్ టికెట్స్ హాట్ కేకుల్లా సేల్ అయ్యాయి. ప్రతి థియేటర్ దగ్గర నిన్న రాత్రి (జూలై 23వ తేదీ) బీభత్సమైన హంగామా కనిపించింది. నైట్ షోస్ (బుధవారం, జూలై 23న) ఓపెన్ చేయడమే ఆలస్యం... వెంటనే టికెట్స్ సేల్ అయ్యాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ బాక్స్ ఆఫీస్ సాక్షిగా మరోసారి ఆడియన్స్ అందరికీ అర్థం అయ్యింది. ప్రీమియర్ షోస్ కలెక్షన్ ఎంత? అనేది ఎర్లీ ఎస్టిమేషన్ చూస్తే...
పది కోట్ల కంటే ఎక్కువ...
బుధవారం రాత్రి బీభత్సం!
బాక్సాఫీస్ బరిలో బుధవారం రాత్రి 'హరిహర వీరమల్లు' బీభత్సం సృష్టించింది. ఆ ఒక్క రాత్రిలో కేవలం ప్రీమియర్ షోస్ ద్వారా పది కోట్ల కంటే ఎక్కువ గ్రాస్ కలెక్ట్ చేసింది.
ప్రతి సినిమా మొదటి రోజు వసూళ్ళలో సాధారణంగా అమెరికాలో వేసే ప్రీమియర్స్ ద్వారా వచ్చే కలెక్షన్ వాటా ఎక్కువ ఉంటుంది. బట్ ఫర్ ఏ ఛేంజ్... పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు'కు మాత్రం ఇండియాలో ప్రీమియర్స్ ద్వారా వచ్చే కలెక్షన్ షేర్ ఎక్కువ.
ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాలలో బుధవారం రాత్రి వేసిన ప్రీమియర్స్ ద్వారా ఏడు కోట్లకు పైగా కలెక్షన్ వచ్చింది. అమెరికాలో ప్రీమియర్స్ కలెక్షన్ నాలుగున్నర కోట్ల వరకు ఉందని టాక్. సో... ప్రీమియర్స్ కలెక్షన్ పదకొండు కోట్లకు పైగా ఉందని తెలిసింది.
మొదటి రోజు 50 కోట్ల మార్క్ దాటుతుందా?
Hari Hara Veera Mallu First Day Collection: ప్రీమియర్స్ ద్వారా పదకొండు కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టిన 'హరి హర వీరమల్లు', మొదటి రోజు 50 కోట్ల గ్రాస్ పైగా కలెక్ట్ చేస్తుందని అంచనా. బుధవారం రాత్రి వరకు జరిగిన ప్రీ సేల్స్ ద్వారా 40 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. సినిమా రిలీజ్ డే గురువారం ఇంకా కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సింగిల్ స్క్రీన్లలో కౌంటర్ సేల్స్ ఉంటాయి కదా! సినిమాకు విపరీతమైన మిక్స్డ్ టాక్ వచ్చిన నేపథ్యంలో వీకెండ్ వరకు సినిమా ఉంటుందా? లేదా? అనేది చూడాలి.
Also Read: యుద్ధభూమికి వీరమల్లు... క్లైమాక్స్‌లో సెకండ్ పార్ట్ టైటిల్ రివీల్... అది ఏమిటో తెలుసా?





















