HHVM 2: యుద్ధభూమికి వీరమల్లు... క్లైమాక్స్‌లో సెకండ్ పార్ట్ టైటిల్ రివీల్... అది ఏమిటో తెలుసా?
Hari Hara Veera Mallu 2 Title: హరిహర వీరమల్లుకు సెకండ్ పార్ట్ అనౌన్స్ చేశారు ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో రెండో పార్ట్ టైటిల్ రివీల్ చేశారు. అది ఏమిటో తెలుసుకోండి.

'హరిహర వీరమల్లు' థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులలో సైతం అంచనాలు లేవు. రిలీజ్ దగ్గర పడిన తరుణంలో పవన్ ప్రచార కార్యక్రమాలకు వచ్చేవరకు సినిమాకు బజ్ లేదు. అందుకని సెకండ్ పార్ట్ గురించి అసలు ఎవరు ఆలోచించలేదు. అయితే మేకర్స్ మాత్రం రెండో పార్టు ఉంటుందని కన్ఫర్మ్ చేశారు.
యుద్ధభూమికి వీరమల్లు...
హరిహర వీరములను రెండు భాగాలుగా విడుదల చేస్తామని ఫిల్మ్ మేకర్స్ ఎప్పుడో అనౌన్స్ చేశారు అయితే ఈ ఫస్ట్ పార్ట్ టైటిల్ వీరమల్లుగా, హరిహర వీరమల్లుగా ప్రచారంలోకి వెళ్ళింది. స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ క్యాప్షన్ గురించి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఈ రోజు థియేటర్లలో విడుదలైన సినిమా చూస్తే... రెండో పార్ట్ క్యాప్షన్ హైలైట్ అవుతుంది.
హరిహర వీరమల్లు స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ ఫస్ట్ పార్ట్ టైటిల్ అయితే... హరిహర వీరమల్లు బాటిల్ ఫీల్డ్ (యుద్ధభూమి) అనేది రెండో పార్ట్ టైటిల్. ఇందులో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు, వీరమల్లుకు మధ్య భీకర యుద్ధ సన్నివేశాలు ఉంటాయని అర్థం అవుతోంది.
'హరి హర వీరమల్లు' సినిమాలో పవన్ కళ్యాణ్, బాబీ డియోల్ మధ్య సీన్స్ చాలా ఉంటాయని అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఆశించారు. అయితే ఇద్దరి మధ్య ఒక్క సరైన సన్నివేశం పడలేదు. ఆ మాటకు వస్తే క్లైమాక్స్ తప్ప సినిమాలో ఇద్దరి మధ్య ఫేస్ టు ఫేస్ సీన్స్ లేవు. ఆ విషయం డిజప్పాయింట్ అయిన ప్రేక్షకులకు రెండో పార్ట్ ఫుల్ మీల్స్ పెడుతుందని చెప్పవచ్చు.
'హరిహర వీరమల్లు' ప్రీమియర్స్ నుంచి మిశ్రమ స్పందన లభించింది. వైసీపీ శ్రేణులు చేసే ట్రోల్స్ సంగతి చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. అటు ఫ్యాన్స్, ఇటు క్రిటిక్స్ నుంచి సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. మౌత్ టాక్, రివ్యూలతో సంబంధం లేకుండా థియేటర్స్ నుంచి ప్రీమియర్స్ ద్వారా భారీ కలెక్షన్స్ రాబట్టింది వీరమల్లు సినిమా. మొదటి రోజు సైతం రికార్డ్ కలెక్షన్స్ వస్తాయని అంచనా. టాక్ బట్టి వీకెండ్ సినిమా డౌన్ అయ్యే అవకాశం ఉంది.





















