Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖలో కాదు... జూలై 21న ఇక్కడ!
Hari Hara Veera Mallu Pre Release Event: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖలో కాదు. ఆ ఈవెంట్ జరిగేది 20న కూడా కాదు. జూలై 21న ఎక్కడ చేయబోతున్నారో తెలుసా?

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది? అంటే జూలై 20న విశాఖలో అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు అందరూ ఠక్కున చెప్పే సమాధానం. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... విశాఖలో ఫంక్షన్ జరగడం లేదు. అక్కడ లేకపోతే ఎక్కడ చేస్తారు? అంటే...
శిల్పకళా వేదికలో వీరమల్లు ఫంక్షన్!
Hari Hara Veera Mallu Pre Release Event Shifted To Shilpakala Vedika: అవును... 'హరి హర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ జరగబోయే వేదిక మారింది. విశాఖ నుంచి హైదరాబాద్ సిటీలోని శిల్పకళా వేదికకు వచ్చింది. అది కూడా జూలై 20వ తేదీన ఈవెంట్ చేయడం లేదు. జూలై 21న సోమవారం చేయబోతున్నారు. శిల్పకళా వేదికలో పవన్ నటించిన పలు హిట్ సినిమాల ఈవెంట్స్ జరిగాయి.
విశాఖ నుంచి హైదరాబాద్ సిటీకి 'హరి హర వీరమల్లు' ప్రీ రిలీజ్ మారడం ఒక విధంగా మంచిది. విశాఖ అయితే టెక్నీషియన్స్ కొంత మంది అటెండ్ కావడం కష్టం కావచ్చు. హైదరాబాద్ సిటీ అయితే అందరూ వస్తారు. మీడియా కవరేజ్ కూడా ఎక్కువ ఉంటుంది.
Also Read: నదివే వర్సెస్ నీవే... అదే మ్యూజిక్కు - అవే స్టెప్పులు... రష్మిక కొత్త సినిమాలో పాట కాపీయేనా!?
#HariHaraVeeraMallu is loaded with explosive high points that will bring the roof down in theatres! ⚔️⚔️🔥🔥
— Hari Hara Veera Mallu (@HHVMFilm) July 17, 2025
Get ready for a next level big screen experience on July 24th 🦅 🦅
Part 1 ▶️ https://t.co/JZSWRVrGGG
Part 2 ▶️ https://t.co/CwiaLCXCbH
Powerstar @PawanKalyan… pic.twitter.com/s3VCfIVMDz
రోజు రోజుకూ వీరమల్లుకు పెరుగుతోన్న క్రేజ్!
వీరమల్లు ట్రైలర్ విడుదల ముందుకు వరకు ఒక లెక్క, విడుదల తర్వాత మరో లెక్క అన్నట్టుంది పరిస్థితి. ఒక్కసారిగా సినిమా మీద ప్రేక్షకులలో పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ కావడంలో ట్రైలర్ పాత్ర ఎంతో ఉంది. ఆ తర్వాత రోజు రోజుకూ వీరమల్లుకు క్రేజ్ పెరుగుతోంది. ఆల్మోస్ట్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అంతా కంప్లీట్ అయ్యింది.
Also Read: పవన్ కళ్యాణ్‌తో ఒక్క సినిమా... వంద సినిమాలతో సమానం - నిధి అగర్వాల్ ఇంటర్వ్యూ
HHVM Release Date: జూలై 24న తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున 'హరి హర వీరమల్లు' విడుదల కానుంది. పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నటించారు. అనుపమ్ ఖేర్, సత్యరాజ్, సునీల్, సుబ్బరాజ్, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రలు పోషించారు. లెజెండరీ నటుడు కోట శ్రీనివాస రావు చివరి సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ - క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా... ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ప్రముఖ నిర్మాత ఏయం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకం మీద ఏ దయాకర్ రావు నిర్మించారు.





















