అన్వేషించండి

HBD Nani: రేడియో జాకీ నుంచి పాన్‌ ఇండియా స్టార్‌గా - 'నేచురల్ స్టార్‌' గురించి ఈ విషయాలు తెలుసా?

Hero Nani: ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. తన పేరునే బ్రాండ్‌గా మలుచుకున్నాడు హీరో నాని. పాత్ర ఏదైనా పక్కింటి కుర్రాడే అనిపించేలా సహజమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

Nani Birthday Special: ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. తన పేరునే ఓ బ్రాండ్‌గా మలుచుకున్నాడు నేచులర్‌ స్టార్‌ నాని. పాత్ర ఏదైనా పక్కింటి కుర్రాడిలా సహజమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. రేడియో జాకిగా కెరీర్‌ మొదలుపెట్టి రూ. 100 కోట్ల హీరో స్థాయికి ఎదిగాడు. తొలి సినిమా అష్టాచమ్మాతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన ఈ హీరో అంచలెంచలుగా పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. అభిమానుల నేచులర్‌ స్టార్‌గా బ్రాండ్ నేమ్‌ క్రియేట్‌ చేసుకున్న నాని బర్త్‌డే నేడు. ఫిబ్రవరి 24తో హీరో 40వ ఏట అడుగుపెడుతున్నాడు. తన కెరీర్‌లో ఇప్పటివరకు 30 సినిమా చేసిన ఈ హీరో జర్నీ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

రేడియో జాకీ నుంచి పాన్‌ ఇండియా స్టార్‌గా..

హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన నాని డిగ్రీ తర్వాత రెడియో జాకీగా పని చేశాడు. సినిమాలపై మక్కువతో బాపు,కే.రాఘవేంద్రరావు లాంటి దిగ్గజాల వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. అదే సమయంలో డైరెక్టర్‌ ఇంద్రగంటి మోహనకృష్ణ కంటపడ్డా నానిని 'అష్టా చమ్మా'కు హీరోగా ఎంపిక చేశాడు. తొలి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్‌ కొట్టాడు. ఈ సినిమాలో తన సహజమైన నటనతో తెలుగు ఆడియన్స్‌కి దగ్గరయ్యాడు. ఇక తన క్యూట్ లుక్స్‌ అమ్మాయిలో మనసులో నిలిచిపోయాడు. ఆ తర్వాత నాని వరుస ఆఫర్సతో బిజీ అయిపోయాడు. ఆ వెంటనే నందిని రెడ్డి 'అలా మొదలైంది'(2011) సినిమాతో మరో బిగ్‌ హిట్‌ కొట్టాడు. ఈ సినిమాతో నాని పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. హీరోగా తన కెరీర్‌ను మలుపు తిప్పింది కూడా ఈ సినిమానే అని చెప్పాలి. ఎందుకంటే ఆ వెంటనే నాని స్టార్‌  డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళి దృష్టిలో పడ్డాడు.

'ఈగ'తో పాన్‌ ఇండియా క్రేజ్‌ 

సినిమా సినిమాకు కొత్త ప్రయోగం చేసే జక్కన్న నానిని 'ఈగ'లా మార్చేశాడు. ఈ సినిమాలో నాని కనిపించింది కాసేపైనా అతడిని క్రేజ్‌ మాత్రం వరల్డ్‌ వైడ్‌గా పాకింది. ఈగ సినిమా ఓవర్సిస్‌లోనూ దుమ్మురేపింది. ఇక ఈసినిమాతో స్టార్‌ హీరో జాబితాలో చేరిన ఈ నేచులర్‌ స్టార్‌ ఆ తర్వాత 'సెగ', 'పిల్ల జమిందార్‌' వంటి చిత్రాల్లో నటించాడు. ఈ సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. అయితే ఇందులో నాని నటనకు మాత్రం సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. వరుస హిట్లతో దూకుడు మీదున్న నానికి 'పైసా', 'జెండాపై కపిరాజు', 'ఆహా కళ్యాణం' వంటి పరాజయాలు ఎదురయ్యాయి. అలా వరస ప్లాప్స్‌తో డిలా పడ్డ నాని.. ఆ వెంటనే భలే భలే మగాడివోయ్‌ సినిమా నిలబెట్టింది. ఈ మూవీ భారీ విజయం సాధించింది. ఇందులో మతి మరుపు పాత్రతో ఆడియన్స్‌ని ఆకట్టుకునన్న మంచి కమ్‌బ్యాక్‌ ఇచ్చాడు. ఈ సినిమాలో తన నటన, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించిన ఈ హీరో ఆ తర్వాత జెంటిమెన్‌ అంటూ వచ్చాడు. ఆ తర్వాత 'మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి', 'నేను లోకల్‌' లాంటి సినిమాలతో మళ్లీ విజయాల బాట పట్టాడు.  

జెర్సీ, శ్యామ్‌ సింగరాయ్‌, దసరాతో ప్రయోగాలు

ఆ తర్వాత పాత్రలతో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. ఇప్పటికి పక్కింటి కుర్రాడి పాత్రలు చేసిన నాని జెర్సీ సినిమాతో తనలోని కొత్త కోణాన్ని చూపించాడు. తండ్రి-కొడుకుల సెంటిమెంట్‌తో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. అయితే మూవీ యావరేజ్‌ టాక్‌కే పరిమితమైంది. ఆ తర్వాత హీరోగా కొంత గ్యాప్‌ తీసుకున్న నాని ఈ గ్యాప్‌లో నిర్మాతగా మారాడు. వాల్‌ పోస్టర్‌ సినిమాను నిర్మించి ప్రొడ్యూసర్‌గా పరిచయం అయ్యాడు. ఈ గ్యాప్‌ శ్యామ్‌ సింగరాయ్‌తో మరో హిట్‌ కొట్టాడు. కాస్తా గ్యాప్‌త తర్వాత మాస్‌ అవతారంలో మెరిశాడు. అప్పటి వరకు రీజనల్‌ సినిమా, జెంటిమెన్‌ పాత్రలకే పరిమితమైన నాని దసరాతో అప్పటి వరకు పరిచయం లేని కొత్త జానర్‌ని టచ్‌ చేశాడు.జెంటిల్‌మెన్‌, హోమ్లీ హీరో రోల్స్‌తో ఆడియన్స్‌ని ఆకట్టున్న ఈ నేచులర్‌ స్టార్‌ 'దసరా'తో తనలోని మాస్ యాంగిల్‌ని చూపించాడు.

మాస్‌ హీరోగానూ ఆడియన్స్‌ని మెప్పించి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టాడు. పాన్‌ ఇండియా మూవీగా వచ్చిన 'దసరా' ఏకంగా వందకోట్ల క్లబ్‌లో చేరింది. నాని కెరీర్‌ వంద కోట్ల మార్క్‌ చేరిన తొలి చిత్రంగా 'దసరా' అతడి కెరీర్‌లో నిలిచిపోయింది. ఈ సినిమాతోనే వందకోట్ల హీరోగాను రికార్డుకు ఎక్కాడు. ఇక రీసెంట్‌గా హాయ్‌ నాన్న అంటూ పలకరించని నాని మంచి క్లాసికల్‌ హిట్‌ అందుకున్నాడు. ఇలా రెడియో జాకీగా కెరీర్‌ మొదలుపెట్టి ఏకంగా పాన్‌ ఇండియా స్టార్‌ ఎదగడమనేది అసాధ్యమనే చెప్పాలి. కానీ ఇది నాని జీవితంలో సాధ్యమైంది. ఇలా టాలీవుడ్‌ సక్సెస్‌ ఫుల్‌ హీరోగా గుర్తింపు పొందిన నాని ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటాడట. ఒక జానర్‌లో నటించిన అతడు మళ్లీ అలాంటి జానర్‌ని రిపీట్‌ చేయకపోడాన్ని ఇష్టపడతాడాట. ప్రస్తుతం నాని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై 'సరిపోదా శనివారం' అనే డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార పోస్టర్స్‌ మూవీపై అంచనాలు పెంచేస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Abhishek Singhvi Controversy:రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
YSRCP: కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
Benefit Shows Cancelled In Telangana: ఫుష్ప 2 ఎఫెక్ట్‌- తెలంగాణలో బెనిఫిట్‌ షోలు రద్దు
ఫుష్ప 2 ఎఫెక్ట్‌- తెలంగాణలో బెనిఫిట్‌ షోలు రద్దు
Srikakulam Latest News:కాలు నొక్కితే ఆర్మీ కోచింగ్- కాదంటే బెల్ట్‌తో కోటింగ్‌- శ్రీకాకుళం ఆర్మీ కాలింగ్ సెంటర్‌లో అరాచకాలు
కాలు నొక్కితే ఆర్మీ కోచింగ్- కాదంటే బెల్ట్‌తో కోటింగ్‌- శ్రీకాకుళం ఆర్మీ కాలింగ్ సెంటర్‌లో అరాచకాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, మహిళ మృతినాగచైతన్య శోభితా వెడ్డింగ్ వీడియో వైరల్బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్ట్ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Abhishek Singhvi Controversy:రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
YSRCP: కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
Benefit Shows Cancelled In Telangana: ఫుష్ప 2 ఎఫెక్ట్‌- తెలంగాణలో బెనిఫిట్‌ షోలు రద్దు
ఫుష్ప 2 ఎఫెక్ట్‌- తెలంగాణలో బెనిఫిట్‌ షోలు రద్దు
Srikakulam Latest News:కాలు నొక్కితే ఆర్మీ కోచింగ్- కాదంటే బెల్ట్‌తో కోటింగ్‌- శ్రీకాకుళం ఆర్మీ కాలింగ్ సెంటర్‌లో అరాచకాలు
కాలు నొక్కితే ఆర్మీ కోచింగ్- కాదంటే బెల్ట్‌తో కోటింగ్‌- శ్రీకాకుళం ఆర్మీ కాలింగ్ సెంటర్‌లో అరాచకాలు
Devendra Fadnavis First Interview: హిందుత్వ అజెండాతోనే బీజేపీ గెలిచిందా? మొదటి ఇంటర్వ్యూలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఏం చెప్పారు?
హిందుత్వ అజెండాతోనే బీజేపీ గెలిచిందా? మొదటి ఇంటర్వ్యూలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఏం చెప్పారు?
పార్లమెంట్‌లో రామ్మోహన్ నాయుడు -  సుధామూర్తి ఇంట్రస్టింగ్ సీన్
పార్లమెంట్‌లో రామ్మోహన్ నాయుడు - సుధామూర్తి ఇంట్రస్టింగ్ సీన్
Rashmika Mandanna : దేవరకొండ ఫ్యామిలీతో మూవీకి వెళ్ళిన రష్మిక... కోడలిగా ఫిక్స్ అయిపోయారా?
దేవరకొండ ఫ్యామిలీతో మూవీకి వెళ్ళిన రష్మిక... కోడలిగా ఫిక్స్ అయిపోయారా?
Allu Arjun: అల్లు అర్జున్‌కు మళ్లీ నేషనల్ అవార్డు... 'పుష్ప 2'కు వచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయంటే?
అల్లు అర్జున్‌కు మళ్లీ నేషనల్ అవార్డు... 'పుష్ప 2'కు వచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయంటే?
Embed widget