అన్వేషించండి

Hanu-Man Movie : గుంటూరు కారం vs హనుమాన్ - వీటిలో దేనికి ఎక్కువ క్రేజో తెలుసా? ఇదిగో ‘బుక్ మై షో’ రిజల్ట్!

Hanuman : ప్రముఖ ఆన్లైన్ టికెటింగ్ వెబ్ సైట్ బుక్ మై షోలో 'గుంటూరు కారం' కంటే 'హనుమాన్' పైనే ఆడియన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు.

HanuMan Movie : ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బిగ్ ఫైట్ జరగబోతోంది. ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది సంక్రాంతికి ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వాటిల్లో స్టార్ హీరోలతో పాటు సీనియర్ హీరోల సినిమాలు అలాగే ఓ యంగ్ హీరో సినిమా కూడా ఉంది. ఈ పొంగల్ కి గుంటూరు కారం, హనుమాన్, ఈగల్, సైంధవ్, నా సామిరంగ వంటి సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. వీటన్నింటిలో ఇప్పటివరకు చూసుకుంటే మహేష్ 'గుంటూరు కారం' సినిమాపైనే అందరి దృష్టి ఉంది. ఇటు ఆడియన్స్ లోనూ, ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఈ పండక్కి పెద్ద సినిమా ఏదంటే అందరూ 'గుంటూరు కారం' అని, ఆడియన్స్ అంతా ఆ సినిమాను చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారనే టాక్ వినిపించింది.

కానీ ఆడియన్స్ ఇంట్రెస్ట్ మాత్రం 'గుంటూరు కారం'పై కాకుండా వేరే సినిమాపై ఉందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని బుక్ మై షో వెబ్ సైట్ బయట పెట్టింది. ప్రముఖ ఆన్ లైన్ టికెటింగ్ యాప్ బుక్ మై షో లెక్కల ప్రకారం ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సినిమాల్లో 'హనుమాన్'పై  ఆడియన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. బుక్ మై షో లో 'హనుమాన్' హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంట్రెస్ట్స్ ని కలిగి ఉంది. ఈ ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ ఫామ్ లో 'హనుమాన్' సినిమాకి ఏకంగా 169.5K ఇంట్రెస్ట్ ని చూపించారు. తర్వాత 'గుంటూరు కారం' 168.7K మందితో రెండో స్థానంలో ఉంది.

ఇక సంక్రాంతి సినిమాల్లో విక్టరీ వెంకటేష్ నటించిన 'సైంధవ' సినిమా కోసం 63K ఇంట్రెస్ట్ చూపించగా నాగార్జున 'నా సామిరంగా' కోసం 41K ఆసక్తి చూపారు. రవితేజ ఈగల్ 18.2K ఇంట్రెస్ట్ తో లాస్ట్ ప్లేస్ లో ఉండటం గమనార్హం అయితే సంక్రాంతికి విడుదలయ్యే అన్ని సినిమాల్లో ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కలయికలో తెరకెక్కిన 'హనుమాన్'పై ఆడియన్స్ ఎక్కువ ఆసక్తిని చూపించడం విశేషం. 'గుంటూరు కారం' కంటే 'హనుమాన్' పైనే ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపించడానికి కారణం ముందు నుంచే ‘హనుమాన్’పై భారీ అంచనాలు ఉండటమే.

నిజానికి ‘హనుమాన్’ ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా. తక్కువ బడ్జెట్ లోనే భారీ గ్రాఫిక్స్, VFX క్వాలిటీ పరంగానూ మూవీ టీమ్ నుంచి బ్రిలియంట్ వర్క్ కనిపించింది. ఓ చిన్న సినిమాలో హాలీవుడ్ స్టాండర్డ్స్ టెక్నికల్ వర్క్ కనిపించడంతో సహజంగానే ‘హనుమాన్’ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ట్రైలర్ కూడా అదే రేంజ్ లో ఉండటంతో ఆడియన్స్ ఈ సినిమా చూసేందుకు ఇంట్రెస్ట్ గా ఉన్నారు. మరి జనవరి 12న రిలీజ్ అవుతున్న 'హనుమాన్' అదే రోజు రిలీజ్ అవుతున్న 'గుంటూరు కారం' కలెక్షన్స్ ని ఎంతవరకు మ్యాచ్ చేస్తుందో చూడాలి.

Also Read : ‘సైంధవ్’ ట్రైలర్‌లో బులెట్ షాట్‌పై ట్రోల్స్ - వివరణ ఇచ్చిన డైరెక్టర్ శైలేష్

టాప్ హెడ్ లైన్స్

Thrigun Jangaa First Look: 'బిగ్ బాస్' త్రిగుణ్ హీరోగా 'జంగా'... హౌస్‌లో హీరో - కానీ ఫస్ట్ లుక్ వచ్చేసింది
'బిగ్ బాస్' త్రిగుణ్ హీరోగా 'జంగా'... హౌస్‌లో హీరో - కానీ ఫస్ట్ లుక్ వచ్చేసింది
RC17 Concept Poster : మెగా ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ - రామ్ చరణ్, సుకుమార్ RC17 కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్... స్టోరీ అదేనా?
మెగా ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ - రామ్ చరణ్, సుకుమార్ RC17 కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్... స్టోరీ అదేనా?
Mailu Rayi: నిర్మాతగా హన్సిక... నాగబాబు చేతుల మీదుగా 'మైలురాయి' టైటిల్ పోస్టర్ లాంచ్
నిర్మాతగా హన్సిక... నాగబాబు చేతుల మీదుగా 'మైలురాయి' టైటిల్ పోస్టర్ లాంచ్
Anakapalli Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి
రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Rice Prices: బియ్యం అక్రమ నిల్వలు, ధరల పెంపుపై ప్రభుత్వం ఉక్కుపాదం.. సన్నబియ్యంపై గరిష్ఠ ధరలు ఖరారు
బియ్యం అక్రమ నిల్వలు, ధరల పెంపుపై ప్రభుత్వం ఉక్కుపాదం.. సన్నబియ్యంపై గరిష్ఠ ధరలు ఖరారు
YS Jagan Protest: పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
రాప్తాడు ఘటన: విద్యార్థులకు కౌన్సెలింగ్.. మానసిక ధైర్యం నింపేందుకు నారా లోకేష్ చర్యలు
రాప్తాడు ఘటన: విద్యార్థులకు కౌన్సెలింగ్.. మానసిక ధైర్యం నింపేందుకు నారా లోకేష్ చర్యలు
High Tension in Pulivendula: పులివెందులలో రాళ్లు రువ్వుకున్న వైసీపీ, టీడీపీ వర్గీయులు.. వాహనాలు తగులబెట్టేశారు!
పులివెందులలో రాళ్లు రువ్వుకున్న వైసీపీ, టీడీపీ వర్గీయులు.. వాహనాలు తగులబెట్టేశారు!
Mallanna Sagar Reservoir: మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్ మహేష్ క్లారిటీ
మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్
Telangana MLC Elections: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
Andhra Pradesh Rains: ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
Embed widget