HanuMan OTT : మరింత ఆలస్యంగా ఓటీటీలోకి 'హనుమాన్' - కారణం అదే!
Hanuman : ప్రస్తుతం థియేటర్స్‌లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న 'హనుమాన్' ఓటీటీలోకి మరింత ఆలస్యంగా రానున్నట్లు తెలుస్తోంది. దానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
Hanuman OTT Release Date : ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా నటించిన 'హనుమాన్' ఈ సంక్రాంతికి జనవరి 12న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు సంక్రాంతి బరిలో గుంటూరు కారం, సైంధవ్, నా స్వామి రంగ వంటి సినిమాలు విడుదలైనా వాటన్నింటిలో 'హనుమాన్' యునానిమస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సౌత్, నార్త్, ఓవర్సీస్.. అనే తేడా లేకుండా విడుదలైన అన్నిచోట్ల రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది.
సినిమా రిలీజై రెండు వారాలు దాటినా ఇంకా కలెక్షన్ల సునామీ ఆగలేదు. ఈ సినిమా తొలి వారంతో పోల్చితే రెండో వారంలో కలెక్షన్లలో దూసుకుపోతోంది. ఓవర్సీస్ మార్కెట్ వద్ద ఏకంగా 5 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకొని ఓవర్సీస్ లో ఆల్ టైం టాప్ 5 హైయెస్ట్ గ్రాఫర్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక ఇప్పటికే హనుమాన్ రూ.250 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయిపోయినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
మరింత ఆలస్యంగా ఓటీటీలోకి 'హనుమాన్'
ప్రస్తుతం థియేటర్స్‌లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న హనుమాన్ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ZEE5 హనుమాన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంది. థియేట్రికల్ రిలీజ్ కి నెల రోజుల తర్వాత ఈ సినిమాని ఓటీటీలోకి తీసుకొద్దాం అనుకున్నారు. కానీ ప్రస్తుతం థియేటర్స్ వద్ద హనుమాన్ దూకుడు ఏమాత్రం తగ్గకపోవడంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ వాయిదా వేసినట్టు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం థియేట్రికల్ రిలీజ్ పూర్తయిన 55 రోజుల తర్వాతే హనుమాన్ ని ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ నిర్ణయించారట. ఇందుకు ZEE5 సంస్థ కూడా ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. దాని ప్రకారం మార్చి మొదటి వారం లేదా రెండో వారంలో హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రావచ్చని అంటున్నారు. ఆ సమయంలో శివరాత్రి పండగ కూడా ఉండడంతో హనుమాన్ ని అదే సమయంలో రిలీజ్ చేస్తే ఓటీటీలో రెస్పాన్స్ అదిరిపోతుందని మేకర్స్ ఇలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ZEE5 త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది.
హనుమాన్ సీక్వెల్ లో స్టార్ హీరో
'హనుమాన్' సినిమాకి సీక్వెల్‌గా 'జై హనుమాన్' తీస్తున్నట్లు ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు ప్రశాంత్ వర్మ. అంతేకాదు ఈ సీక్వెల్‌లో తేజ సజ్జ హీరో కాదని, హనుమాన్ హీరో అని ఆ పాత్రలో ఓ టాలీవుడ్ బిగ్ స్టార్ నటిస్తారని చెప్పడంతో సెకండ్ పార్ట్‌లో హనుమాన్‌గా ఎవరు నటించబోతున్నారో అని అందరిలో ఉత్కంఠ నెలకొంది. ప్రశాంత్ వర్మ లిమిటెడ్ బడ్జెట్‌లో భారీ విజువల్ ఫీస్ట్‌ని ప్రేక్షకుల ముందు ఉంచడంతో ఇప్పుడు 'జై హనుమాన్' మీద ఇంతే భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతున్న ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.
Also Read : KGFను క్రాస్ చేసిన 'హను-మాన్'... హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-10 డబ్బింగ్ సినిమాలివే!