అన్వేషించండి

తగ్గేదెలే అంటున్న తేజా సజ్జా - 'హనుమాన్' రిలీజ్ డేట్‌పై మరోసారి క్లారిటీ ఇచ్చిన మేకర్స్, ట్రైలర్ ఎప్పుడంటే?

తేజ సజ్జా నటిస్తున్న 'హనుమాన్' మూవీని వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు మరోసారి స్పెషల్ పోస్టర్ తో ప్రకటించారు. అంతేకాకుండా త్వరలోనే ట్రైలర్ కూడా విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ జరగబోతోంది. ముఖ్యంగా అగ్ర హీరోలు సంక్రాంతి బరిలో తమ సినిమాలతో థియేటర్స్ లో సందడి చేయబోతున్నారు. మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, రవితేజ, నాగార్జున, వెంకటేష్ లాంటి బడా హీరోలు వస్తున్నా కూడా వీళ్లకు ఏమాత్రం భయపడకుండా ఓ యంగ్ హీరో తన సినిమాని సంక్రాంతి బరిలో దించబోతున్నాడు. ఆ యంగ్ హీరో మరెవరో కాదు తేజ సజ్జా. ఎంతమంది వచ్చినా వెనకడుగు వేసేది లేదంటూ 'హనుమాన్' సినిమాని ఖచ్చితంగా సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు మరోసారి అధికారికంగా ప్రకటించారు. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'హనుమాన్(Hanuman).

తేజ సజ్జా కెరియర్ లోనే హైటెక్నికల్ వాల్యూస్ హై బడ్జెట్ తో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా సినిమా ఇది. దీంతో ఈ చిత్రంపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'జాంబిరెడ్డి' బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవడంతో హనుమాన్' పై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. సినిమాని వచ్చే ఏడాది జనవరి 12 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ముందుగానే ప్రకటించారు. కానీ సంక్రాంతికి పెద్ద సినిమాల రిలీజ్ ఉండడంతో హనుమాన్ మూవీ వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు ఉగత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతూ వచ్చింది.

ఇలాంటి తరుణంలో మూవీ టీం మరోసారి స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేస్తూ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తూనే ట్రైలర్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. దసరా సందర్భంగా ఈ చిత్రం నుంచి మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు ఈ పోస్టర్ లో తేజ సత్య కోర మీసాలతో స్టైలిష్ లుక్ లో సజ్జా ఇదే పోస్టర్లో రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న హనుమాన్ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మరోసారి స్పెషల్ పోస్టర్ ద్వారా స్పష్టం చేశారు మేకర్స్. దాంతోపాటు 'హనుమాన్' ట్రైలర్ ని అతి త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించారు.

వచ్చే సంక్రాంతికి పెద్ద సినిమాలు బరిలో ఉన్నా 'హనుమాన్' యూనిట్ వెనక్కి తగ్గడం లేదంటే కచ్చితంగా సినిమాలో మంచి కంటెంట్ ఉండే ఉంటుందంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాజ్, వెన్నెల కిశోర్, సత్య కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరిగౌడ, కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు.పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ భాషలతో పాటూ ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, జపనీస్, చైనీస్ భాషల్లోనూ విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా వచ్చే ఏడాదికి సంక్రాంతికి 'గుంటూరు కారం', 'సైంధవ్', 'ఫ్యామిలీ స్టార్', 'నా సామిరంగ', 'ఈగల్' సహా మరిన్ని చిత్రాలు విడుదల కాబోతున్నాయి. వీటిల్లో ఏ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుందో చూడాలి.

Also Read : బిగ్ బాస్ బ్యూటీకి గోల్డెన్ ఛాన్స్ - పవన్ సినిమాలో శుభశ్రీ!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Radhika Apte : 'లెజెండ్'లో పద్ధతైన క్యారెక్టర్స్ ఇస్తే విమర్శలా? - బాలీవుడ్‌లో చేసిన రోల్స్ ఏంటి?... రాధికా ఆప్టేపై ట్రోలింగ్
'లెజెండ్'లో పద్ధతైన క్యారెక్టర్స్ ఇస్తే విమర్శలా? - బాలీవుడ్‌లో చేసిన రోల్స్ ఏంటి?... రాధికా ఆప్టేపై ట్రోలింగ్
ENE Repeat Trailer Review : 'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌లో వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌లో వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
Anirudh Kavya Maran Marriage : అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
Mysaa Re Song Lyrics: కాటేసే సర్పాన్ని... రక్త దాహాన్ని... సాగాలీ మృత్యు క్రీడ - రష్మిక రుద్రతాండవం - 'ఓ మైసా రే' టైటిల్ సాంగ్ లిరిక్స్
కాటేసే సర్పాన్ని... రక్త దాహాన్ని... సాగాలీ మృత్యు క్రీడ - రష్మిక రుద్రతాండవం - 'ఓ మైసా రే' టైటిల్ సాంగ్ లిరిక్స్

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Murala Jyothi: చర్చిపేట నుంచి ఛైర్ పర్సన్ స్థాయికి.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
చర్చిపేట నుంచి ఛైర్ పర్సన్ స్థాయికి.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Andhra Pradesh Rains Update: తీరం దాటినా వణికిస్తున్న మురసు తుపాను.. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. విజయవాడకు బుడమేరు ముప్పు
తీరం దాటినా వణికిస్తున్న మురసు తుపాను.. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. విజయవాడకు బుడమేరు ముప్పు
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
Royal Enfield Himalayan 440: తక్కువ ధరలో అడ్వెంచర్ టూరర్.. కొనేముందు తెలుసుకోవాల్సిన 5 విషయాలు
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 440 కొనాలా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు.. ఈ 2 మైనస్‌లు!
YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు
మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు
The Grand Master OTT : చెస్ బోర్డుపై పేదింటి కుర్రాడి జర్నీ - ఓటీటీలోకి స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా 'ది గ్రాండ్ మాస్టర్'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
చెస్ బోర్డుపై పేదింటి కుర్రాడి జర్నీ - ఓటీటీలోకి స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా 'ది గ్రాండ్ మాస్టర్'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Malla Reddy Farmhouse: మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
Embed widget