అన్వేషించండి

Guppedantha Manasu Rishi: గుప్పెడంత మనసు రిషి హీరోగా తెలుగు - కన్నడ సినిమా... టైటిల్, కాన్సెప్ట్ పోస్టర్ చూశారా?

Priyamaina Nannaku Movie: 'గుప్పెడంత మనసు' సీరియల్ ద్వారా తెలుగు ప్రజల గుండెల్లో 'రిషి'గా గూడు కట్టుకున్న కన్నడ నటుడు ముఖేష్ గౌడ. ఇప్పుడు ఆయన హీరోగా వస్తున్నాడు. కొత్త సినిమా అనౌన్స్ చేశారు.

'గుప్పెడంత మనసు' (Guppedantha Manasu Serial) రిషి అభిమానులకు గుడ్ న్యూస్. ఆ సీరియల్ త్వరలో ఆగుతుందని, దానికి శుభం కార్డు పడుతుందని బాధ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్మాల్ స్క్రీన్ మీద కాదు... సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేయడానికి రిషి అలియాస్ ముఖేష్ గౌడ రెడీ అయ్యాడు. కొత్త సినిమా అనౌన్స్ చేశారు. 

ప్రియమైన నాన్నకు... రిషి హీరోగా!
'గుప్పెడంత మనసు' సీరియల్ కారణంగా, అందులో పేరే ఒరిజినల్ పేరు అని భావిస్తున్నారు. కానీ, అతని పేరు రిషి కాదు... ముఖేష్ గౌడ. అయితే... ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కోసం నిహార్ ముఖేష్ అని తన పేరును మార్చుకున్నాడు. ఇంతకీ, రిషి అలియాస్ నిహార్ ముఖేష్ నటించే సినిమా ఏమిటంటే...

నిహార్ ముఖేష్ (Nihar Mukesh)గా తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు 'గుప్పెడంత మనసు' రిషి అలియాస్ ముఖేష్ గౌడ పరిచయం అవుతున్న సినిమా పేరు 'ప్రియమైన నాన్నకు' (Priyamaina Nannaku Movie). 'తీర్థ రూప తండేయ వరిగే' (Theertharoopa Thandeyavarige) అనేది కన్నడ టైటిల్. రెండు భాషల్లో ఈ సినిమా రూపొందుతోందని ముఖేష్ గౌడ తెలిపారు. 

వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల!
Priyamaina Nannaku Release Date: 'ప్రియమైన నాన్నకు' చిత్రానికి రామేన‌హ‌ల్లి జ‌గ‌న్నాథ దర్శకుడు. ఈ సినిమా కంటే ముందు కన్నడలో 'హొండిసి బరేయిరి' అని ఓ సినిమా తీశారు. దర్శకుడిగా ఆయనకు రెండో చిత్రమిది. వచ్చే ఏడాది వేసవిలో 'ప్రియమైన నాన్నకు' విడుదల చేయనున్నట్లు ముఖేష్ గౌడ చెప్పారు. ఎప్పటిలాగే తన మీద ప్రేక్షకుల ప్రేమ, అభిమానం చూపించాలని ఆయన కోరారు.

Also Readస్త్రీ 2 రివ్యూ: శ్రద్ధా కపూర్ మళ్లీ వచ్చిందిరోయ్... బాలీవుడ్ హారర్ కామెడీ బ్లాక్ బస్టరేనా? మూవీ ఎలా ఉందంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by NIHAR MUKESH B (@_mukesh_gowda5)

'ప్రియమైన నాన్నకు' కంటే ముందు తెలుగులో ముఖేష్ గౌడ హీరోగా 'గీతా శంకరం' అని ఓ సినిమా మొదలైంది. అయితే, అది మధ్యలో ఆగినట్టు ఉంది. కొంత కాలం షూటింగ్ చేశాక, ఫస్ట్ లుక్ సైతం విడుదల చేశాక అప్డేట్స్ ఇవ్వడం మానేశారు. సో, ఇప్పుడు 'ప్రియమైన నాన్నకు' ముఖేష్ గౌడ సిల్వర్ స్క్రీన్ డెబ్యూ కానుంది.

Also Readకుర్చీ మడత పెట్టిన ప్రభాస్ హీరోయిన్ - తెలుగు పాటలకు ఇమాన్వీ సూపర్ స్టెప్స్


'గుప్పెడంత మనసు'కు రిషి బ్రేక్...
మళ్లీ కొన్నాళ్లకు ఎంట్రీ, ఇప్పుడు ఎండ్!
'గుప్పెడంత మనసు' సీరియల్, నటుడిగా ముఖేష్ గౌడ ప్రయాణాన్ని అసలు వేరు చేసి చూడలేం. ఆ సీరియల్ తెలుగులో నాలుగేళ్లుగా టెలికాస్ట్ అవుతోంది. దాంతో రిషిగా ముఖేష్ గౌడ పాపులర్ అయ్యాడు. అయితే, అనివార్య కారణం (ఓ ప్రమాదం) వల్ల ఏడెనిమిది నెలలు 'గుప్పెడంత మనసు'లో కనిపించలేదు. అప్పుడు టీఆర్పీ రేటింగ్స్ కూడా పడ్డాయి. అయితే, మళ్లీ 'రంగ' పాత్రలో రీ ఎంట్రీ ఇచ్చాడు. టీవీ స్క్రీన్ మీద అతను మళ్లీ కనిపించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. అయితే, ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. సీరియల్ ఎండ్ అవుతుందని అనౌన్స్ చేశారు. ఇప్పుడు సినిమా చేస్తుండటం అభిమానులకు సంతోషం కలిగించే అంశమే.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohan Babu discharge: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
Vivo X200: వావ్ అనిపించే వివో ఫోన్ వచ్చేసింది - మార్కెట్లో ఎక్స్200 ఎంట్రీ - ధర ఎంత?
వావ్ అనిపించే వివో ఫోన్ వచ్చేసింది - మార్కెట్లో ఎక్స్200 ఎంట్రీ - ధర ఎంత?
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohan Babu discharge: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
Vivo X200: వావ్ అనిపించే వివో ఫోన్ వచ్చేసింది - మార్కెట్లో ఎక్స్200 ఎంట్రీ - ధర ఎంత?
వావ్ అనిపించే వివో ఫోన్ వచ్చేసింది - మార్కెట్లో ఎక్స్200 ఎంట్రీ - ధర ఎంత?
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
CM Revanth Reddy: లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
Crime News: కదిరిలో దారుణం - తల్లి ఫోన్ ఇవ్వలేదని గొంతుపై కత్తితో దాడి చేసిన యువకుడు
కదిరిలో దారుణం - తల్లి ఫోన్ ఇవ్వలేదని గొంతుపై కత్తితో దాడి చేసిన యువకుడు
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Embed widget