అన్వేషించండి

8 ఏళ్ల తర్వాత మరోసారి ప్లాప్ డైరెక్టర్‌తో గోపిచంద్ సినిమా?

సుమారు 8 ఏళ్ల క్రితం వచ్చిన ' జిల్' తర్వాత డైరెక్టర్ రాధాకృష్ణతో గోపీచంద్ మరో సినిమాకి కమిట్ అయినట్లు తెలుస్తోంది. UV క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు సమాచారం.

మ్యాచో స్టార్ గోపీచంద్ సినీ కెరియర్ ప్రస్తుతం డైలమాలో పడింది. దానికి కారణం గత కొంతకాలంగా ఈ హీరో వరుస అపజయాలు ఎదుర్కోవడమే. 'లౌక్యం' తర్వాత మళ్లీ గోపీచంద్ కి ఆ రేంజ్ హిట్టు పడలేదు. మధ్యలో 'జిల్', 'గౌతమ్ నంద', 'పక్కా కమర్షియల్', ‘సీటీమార్' సినిమాలకు మంచి టాక్ వచ్చినా కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయాయి. ఇక రీసెంట్ గా వచ్చిన 'రామబాణం' అయితే గోపీచంద్ కెరీర్ లోనే బిగ్గెస్,ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. రొటీన్ కమర్షియల్ ఫార్మేట్ ఉన్న కథలకే గోపీచంద్ ప్రాధాన్యత ఇవ్వడం అతని కెరియర్ కు మైనస్ గా మారింది. ప్రస్తుతం ఓ కన్నడ దర్శకుడితో 'భీమా'(Bheema) అనే యాక్షన్ ఎంటర్టైనర్ ని చేస్తున్న గోపీచంద్ ఇప్పుడు మరో ప్లాప్ డైరెక్టర్ తో సినిమాకి కమిట్ అయినట్లు తెలుస్తోంది.

సాధారణంగా సక్సెస్ ఉన్న డైరెక్టర్స్ తోటే సినిమాలు చేసేందుకు హీరోలు ఆసక్తి చూపిస్తుంటారు. కానీ గోపీచంద్ మాత్రం రివర్స్ లో వెళ్తున్నారు. రీసెంట్ గానే శ్రీను వైట్లతో సినిమా లాంచ్ చేసిన విషయం తెలిసిందే. వరుస డిజాస్టర్స్ తో శ్రీను వైట్ల కెరియర్ కు గ్యాప్ వచ్చింది. అయినా సరే ఆయనతో సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు మరో డిజాస్టర్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి షాక్ ఇచ్చాడు. ఆ డైరెక్టర్ మరెవరో కాదు రాధాకృష్ణ కుమార్. పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో ఈ దర్శకుడు తెరకెక్కించిన 'రాదే శ్యామ్' గత ఏడాది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ మూవీ భారీ అంచనాలతో విడుదలై డిజాస్టర్ అందుకుంది. అంతేకాదు సుమారు రూ.100 కోట్లకు పైనే నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. దాంతో రాధాకృష్ణ ఇప్పటివరకు ఏ హీరో తో నెక్స్ట్ మూవీ ని కన్ఫర్మ్ చేయలేదు. తాజా సమాచారం ప్రకారం గోపీచంద్ తో ఈయన నెక్స్ట్ మూవీ ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఈ డైరెక్టర్ కి మొదటినుంచి ప్రభాస్ సపోర్ట్ ఉండటంతో UV క్రియేషన్స్ బ్యానర్లో గోపీచంద్ హీరోగా సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల రాధాకృష్ణ వినిపించిన కథ గోపీచంద్ కి నచ్చడం జరిగిందని, త్వరలోనే దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు వీరిద్దరి కాంబినేషన్లో 2015 లో 'జిల్' అనే సినిమా వచ్చింది.

UV క్రియేషన్స్ బ్యానర్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ముఖ్యంగా సినిమాలో గోపీచంద్ ని దర్శకుడు రాధాకృష్ణ చూపించిన విధానం ఆకట్టుకుంది. ఇక మళ్లీ 8 ఏళ్ల గ్యాప్ తర్వాత వీరి కాంబో సెట్ అవ్వడం సర్వత్ర ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది చివర్లో సినిమాను లాంచ్ చేసి 2024 ప్రారంభంలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గోపిచంద్ 'భీమా' షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కే.కే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ స్వరాలు సమకూరుస్తున్నారు. మలయాళ దర్శకుడు హర్ష డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో గోపీచ చాలా కాలం తర్వాత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

Also Read : మాస్ మహారాజ రవితేజతో రష్మిక - పాన్ ఇండియా సినిమా కోసం!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Balakrishna Injured: బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
NTR Jr On Balakrishna Injury: బాబాయ్ బాలయ్య కోలుకోవాలని అబ్బాయిలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ట్వీట్లు... ఫోనులో మావయ్యకు లోకేష్ పరామర్శ
బాబాయ్ బాలయ్య కోలుకోవాలని అబ్బాయిలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ట్వీట్లు... ఫోనులో మావయ్యకు లోకేష్ పరామర్శ
Manasaagadhe Song Lyrics: మనసాగదే సాంగ్ లిరిక్స్... తారా సుతారియాతో యశ్ రొమాంటిక్ మెలోడీ... ట్రెండింగ్‌లో 'టాక్సిక్' సెకండ్ సింగిల్
మనసాగదే సాంగ్ లిరిక్స్... తారా సుతారియాతో యశ్ రొమాంటిక్ మెలోడీ... ట్రెండింగ్‌లో 'టాక్సిక్' సెకండ్ సింగిల్
Kajal Aggarwal Vs Kiara Advani: బోల్డ్ బికినీ సీన్లు... కాజల్ వర్సెస్ కియారా... చందమామ ఆన్సర్ వైరల్
కొడుకు కోసం కాజల్ అగర్వాల్ సంచలన నిర్ణయం

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadambari Jethwani Case Facts: ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
Rahul Gandhi Lok Kalyan Marg Protest: ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
Balakrishna Injured: బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
Rag Mayur: రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు
రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు
Benefits Of Walk After Dinner: రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Embed widget